Take a fresh look at your lifestyle.

నిత్యం నిరుపేదల సేవలోనే సీతక్క

కరోనా మహమ్మారీ విజృంబిస్తున్న సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సమయంలో ములుగు జిల్లాలోని నిరుపేదలు రెక్కాడుతే గాని డోక్కాడని నిరుపేదలకు నిత్యం అండగా ఉంటు ప్రతి రొజు వారు ఆకలితో మాడ్చుకోకుండా ఉండటం కోసం పదుల కిలోమీటర్ల దూరం వరక నడుస్తు నిరుపేదలైన వారికి నిత్యావసర సరుకులను అందిస్తు వారి సేవలో నెల రోజులుగా కాలం వెల్ల దీస్తున్న ములుగు ఎమ్మేల్యే సీతక్క తన ఉదార స్వబావాన్ని చాటుకుంటున్నారు. దీనిలో బాగంగానే బుధవా రం మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని 30 మంది నిరుపేదలకు,మొట్లగూడెం గ్రామం లోని 40 మంది నిరుపేదలకు,శనిగకుంట గ్రామంలోని 180 మంది నిరుపేదలకు, నరేంద్ర రావుపేట గ్రామంలోని 280 కుటుంబాలకు, పూరేడుపల్లి గ్రామంలోని 350 నిరుపేద కుటుంబాల వారికి, పూరేడుపల్లి పరిధిలోని క్రింది గుంపు గ్రామంలో 40 కుటుంబాల వారికి కాంగ్రేస్‌ ‌పార్టీ నాయకులు సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ ఆకలితో ఉన్న నిరుపేదలకు అండగా తాను ఉంటానని హమీ ఇచ్చారు.

ప్రజలందరు సామాజిక దూరాన్ని పాటించాలని అప్పుడే కరోనా మహమ్మారీని తరిమి కోట్టవచ్చన్నారు. అనంతరం ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలంలోని )క్ష్మిందేవిపేట గ్రామానికి చెందిన చిర్ర సాంబయ్య కూతిరి వివాహనికి హజరై దంపతులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్‌ ‌పార్టీ జిల్లా అద్యక్షులు నల్లేల కుమారస్వామి, మాజీ మార్కెట్‌ ‌కమిటి చైర్మెన్‌ ‌మల్లాడి రాంరెడ్డి, మండల పార్టీ అద్యక్షులు మైల జయరాంరెడ్డి, ఎండి చాంద్‌ ‌పాషా, చెన్నోజు సూర్యనారాయణ, మాజీ జడ్పీటిసి గుమ్మడి సోమయ్య,వల్లేపల్లి శివయ్య, జాగర్లమూడి నాగేశ్వర్‌ ‌రావు, కో అప్షన్‌ ‌సభ్యులు యూనిస్‌,‌వెంకట నాగ)క్ష్మి, స్వప్న, వర్కింగ్‌ ‌కమిటి అద్యక్షులు బండి శ్రీనివాస్‌ ‌తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!