వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నిఘాబృందాలు అప్రమత్తంగా వ్యవహరించాలి

April 3, 2019

వరంగల్‌ ‌లోక్‌సభ ప్రత్యేక వ్యయ పరిశీలకులు గోపాల్‌ ‌ముఖర్జీ
పోలింగ్‌ ‌జరిగే 11వ తేదీ వరకు ఈ తొమ్మిది రోజుల పాటు చాలా అప్రమ త్తంగా వ్యవహరించాలని ఎన్నికల నిఘా బృందాలకు వరంగల్‌ ‌లోక్‌సభ ప్రత్యేక వ్యయ పరిశీలకులు గోపాల్‌ ‌ముఖర్జీ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ ‌నందు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌పాటిల్‌ అధ్యక్షతన 7శాసనసభ స్థానాలలో నియమించిన ఎస్‌ ఎస్‌టి, విఎస్‌టి, వివిటి, ఎఇవో బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌) ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువనే అభిప్రాయం ఉన్నదని పేర్కొన్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయపరిమితి రూ. 70లక్షలుగా ఉన్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న ప్రతి అభ్య ర్థికి, పార్టీకి సమాన అవకాశాలను కల్పిం చడమే ఎన్నికల సంఘం )క్ష్యమని చెప్పారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించుటకు నిఘాబృందాలు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. ప్రయా ణికుల వాహనములతో పాటు ర్యాండముగా ట్రక్కులు, అంబులెన్స్‌లను కూడా తనిఖీ చేయాలని తెలిపారు. ఈ నెల 7నుండి రాత్రి పూట నిఘాను పెంచాలని చెప్పారు. పేద అభ్యర్థి కూడా ఎన్నికలలోవ నిలదొక్కుకు నేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాం గంపై ఉన్నదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల లో నిఘాబృందాలు సమర్ధవంతంగా పనిచే శాయని, అదేస్పూర్తితో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించాలని తెలిపారు. డబ్బుప్రభావం, తరలింపు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై నిఘాపెంచాలని తెలిపారు. ఇం•లిజెన్స్, ‌జర్నలిస్టులు నుండి సమాచారాన్ని పొందాలని సూచించారు. సామాన్య ప్రజలతో కూడా మాట్లాడితే ఎన్నికల అక్రమాలపై సరైన సమా చారం లభిస్తుందని తెలిపారు. ఎన్నికల ఏర్పా ట్లలో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల వలన కొంత అసౌకర్యం కలిగినప్పటికీ, అధికారులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల వ్యయ రిజిష్టర్లను షెడ్యూల్‌ ‌ప్రకారం తనిఖీ చేయాలని చెప్పారు. సివిజిల్‌ ‌యాప్‌కు రానురాను ప్రాధాన్యత పెరుగుతున్నట్లు గోపాల్‌ ‌ముఖర్జీ చెప్పారు. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌పాటిల్‌ ‌మాట్లాడుతూ నిఘాబృందాలు ఇప్పటి వరకు రూ. 36లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సివిజిల్‌ ‌ద్వారా వచ్చిన ఫిర్యాదులపై 65 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సివిజిల్‌ ‌ఫిర్యాదులపై రాష్ట్రంలో రెండోస్థానంలో ఉన్నట్లు చెప్పారు. సివిజిల్‌పై ఇంజనీరింగ్‌ ‌కళాశాలలో నిర్వహించిన చైతన్య కార్యక్రమాల్లో దాదాపు 7వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. ఎంసిఎంసి ద్వారా చెల్లింపు వార్తలు, ప్రకటనలు, సోషల్‌ ‌మీడియా ప్రచారాన్ని మానిటరింగ్‌ ‌చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు నరేష్‌కుమార్‌సైనీ, విజయ్‌ అగర్వాల్‌, ‌జిల్లా వ్యయ పరిశీలన నోడల్‌ ఆఫీసర్‌, ‌సంయుక్త కలెక్టర్‌ ఎస్‌.‌దయానంద్‌, అసిస్టెంట్‌ ‌కలెక్టర్‌ ‌బి.సంతోష్‌, ‌ట్రైనీ కలెక్టర్‌ ‌మనుచౌదరి, సహాయ వ్యయపరిశీలకులు వి.విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎంసిఎంసి సభ్య కార్యదర్శి యాసా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.