Take a fresh look at your lifestyle.

నా చావే ఆఖరిది కావాలి

బలవన్మరణానికి పాల్పడ్డ, ఉద్యమంలో పాల్గొన్న డ్రైవర్‌ ‌నరేష్‌
బలవన్మరణానికి పాల్పడ్డ, ఉద్యమంలో పాల్గొన్న డ్రైవర్‌ ‌నరేష్‌

మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య
ప్రభుత్వ వైఖరి… ఆలస్యమవుతున్న కోర్టు వాదనలు
మానసిక వేదనతో బలవన్మరణం
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చూపిస్తున్న మొండి వైఖరి కోర్టు తీర్పుల ఆలస్యం తో అప్పుల ఊబిలో చిక్కుకొని మానసిక వేదనకు గురై తనదే ఆఖరిది కావాలని సూసైడ్‌ ‌నోట్‌ ‌రాసుకొని మరో ఆర్టీసీ కార్మికుడు ఆవుల నరేష్‌ (48 ) ‌బలవన్మరణకి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ ‌డిపో పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం సూర్యాపేట జిల్లా గోరెంట్ల వాసి ఆయన మృతుడు గత 20 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్‌ ‌మహబూబాబ్డ్ ‌డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు . బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో కోలోఫేస్‌ ‌పురుగుల మందును తాగి అపస్మారక స్థితిలో పడి వున్నా అతని హుటాహుటిన కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స చేస్తుండగనే 6 గంటల ప్రాంతంలో మృతిచెందాడు మృతుడికి భార్య ఇరువురు కుమారులు వున్నారు ఇది తెలిసిన యూనియన్‌ ‌నాయకులూ ప్రజా సంఘాల వివిధ పార్టీల నేతలు మృతదేహాన్ని చూసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఏరియా ఆసుపత్రి నుంచి డిపో వరకు ర్యాలీగా నిర్వహించి మృతదేహని డిపో ఏదుట పెట్టి ఆందోళన నిర్వహించారు ఈ సందర్బంగా యూనియన్‌ ‌నాయకులు జేఏసీ నాయకులూ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ ‌నియంత పోకడలతోనే నరేష్‌ ‌చనిపోయాడని యూనియన్‌ ‌కార్యక్రమంలో ముందుండి తెలంగాణ ఉద్యమసమయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి టి ఎం యు యూనియన్‌ ‌కార్యకలపాలో మ్ముందుడే వారని గుర్తు చేసుకున్నారు . సమ్మె ప్రారంభించిన రోజు నుంచి ఈ నాటి వరకు కార్మికుల సమస్యలపై ఉపన్యాసించేవాడని పలువురు కార్మికులు కంటతడి పెట్టారు. పలువురు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులూ డిపోఅవవరణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధంచేసి పెద్ద ఎత్తున నిరసనవ్యక్తం చేశారు ఎంపీ ఎమ్మెల్యే మంత్రి రాజీనామా చేయాలనీ ప్రభుత్వం మృతుడికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలని డిమాండ్‌ ‌చేశారు . డిపో ఆవరణం ప్రజాసంఘాలు రాజకీయ నాయకుల నినాదాలతో ఉద్రికత్త వాతావరణం తలపించింది జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌ ‌డేవిడ్‌ ‌యూనియన్‌ ‌నాయకులతో చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇవ్వడంతో శాంతించారు , మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ ‌నిర్వహించి తన స్వగ్రామానికి తరలించారు.
నేడు ఉమ్మడి జిల్లా బంద్‌
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యకు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా బందుకు పిలుపునిచ్చింది ఈ బంద్‌ ‌వ్యాపార వాణిజ్య వర్గాలు పాల్గొని ప్రభుత్వ దమన నీతి ని ఎండగట్టాలని పలువురు రాజకీయ నాయకులూ మేధావులు పిలుపునిచ్చారు

Leave a Reply

error: Content is protected !!