నాగర్ కర్నూల్,జూన్ 10.ప్రజాతంత్రవిలేకరి: జిల్లాల్లో కొనసాగుతున్న అన్ని రకాల యాజమా న్యాల పాఠశాలలు , రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశా లల ప్రధానోపాధ్యాయులు, పదవ తరగతి విద్యార్థు లకు సంబంధించిన ఈ సంవత్సరం మార్చి మా సంలో ఎస్ఎస్సి బోర్డు నుండి వచ్చిన నామినల్ రోల్స్‌ను సరిచేసి తప్పులు ఉన్నచో సరిదిద్ది విద్యా ర్థుల నామినల్ రోల్స్ లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు మేల్ అండ్ ఫిమేల్, కమ్యూనిటీ సంబంధించిన ఎలాంటి తప్పు లు లేకుండా పదవ తరగతికి సంబంధించిన ప్రతి విద్యార్థి వివరాలను గురువారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని,వాటి ఆధా రంగా విద్యార్థులు పదో తరగతి మెమో లు రానున్నాయని తప్పనిసరిగా అన్ని రకాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా గురువారం సమర్పించాలని డిఇఓ గోవిందరాజులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.