Take a fresh look at your lifestyle.

నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలి

రైతులు తూర్పాలబట్టుకొని తాలు లేకుండా నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ‌కోరారు.  కలెక్టర్‌ ‌గురువారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్‌ ‌పాఠశాల బైపాస్‌ ‌వద్ద గల పిఎసిఎస్‌ ‌ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాల మేరకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చినచో మీల్లర్లతో ఎలాంటి ఇబ్బందులూ ఉత్పన్నం కావని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వెంటనే చేరవేయాలని సెంటర్‌ ఇన్చార్జిలను కోరారు. మిల్లర్లు ధాన్యం లారీలు పేరుకుపోకుండా వెనువెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ‌వెంట తాసిల్దారు జనార్దన్‌ ‌రెడ్డి, పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌పరమేశ్వర్‌ ‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేటలో…
మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాలవర్షానికి ఐకేపి కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యాన్ని స్థానిక తహశీల్దార్‌ ‌డి.శ్రీనివాస్‌ ‌కుమార్‌ ఎం‌పిటిసి మడూరి జ్యోతితో కలిసి గురువారం సందర్శించి ధాన్యం రాశులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి మిల్లులకు తరలిస్తామని అన్నారు. రైతులు అవసరమైన టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. సమస్యలు ఎదురు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోకుండా వీలైనంత త్వరగా రైస్‌మిల్లులకు తరలించాలని, ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ‌విషయంలో మిల్లర్లు మరింత వేగంగా స్పందించేలా చూడాలని కోరారు. తడిసిన ధాన్యం పై ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగే విధంగా ఛూస్తామని తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట రెవిన్యూ సిబ్బంది ఆర్‌ఐ ‌జాఫర్‌, ‌విఆర్‌ఓ ‌నర్సయ్య, రాకేశ్‌, ‌వెంకటయ్య తదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!