వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నాగర్‌దొడ్డి గ్రామంలో విషాదం ఐదుగురు బాలికలు మృత్యువాత

April 8, 2019

జోగులాంబ జిల్లా గద్వాల నాగర్‌దొడ్డి గ్రామంలో ఐదుగురు బాలికలు బావిలో పడి మృతి చెందారు. సోమవారం 5 గంటల సమయంలో బావిలోకి వెళ్లినట్లు స్థానికుల సమాచారం. బావిలోకి వెళ్లిన ఐదుగురు బాలికలు మృత్యువాత పడినట్లు ఆ ప్రాంత ప్రజల సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతిచెందిన చిన్నారులలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులందరు 10 సంవత్సరాలలోపు వారే. యమున, చిన్నారి, బుజ్జి, కవిత, కృష్ణలుగా గుర్తించారు. చిన్నారులు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.