వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నవభారత నిర్మాణమే లక్ష్యం

September 5, 2019

  • తూర్పు దేశాలతో భారత్‌ ‌సంబంధం ఈనాటిదికాదు
  • 2024 నాటికి 5లక్షలకోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం: ప్రధాని నరేంద్ర మోదీ
  • రష్యా అభివృద్ధికి బిలియన్‌ ‌డాలర్ల రుణం.. 

సబ్‌కా సాత్‌, ‌సబ్‌కా వికాస్‌ అనే నినాదంతో నూతన భారతావని నిర్మాణానికి నడుం బిగించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రష్యాలోని వ్లాడివోస్టోక్‌ ‌వేదికగా జరుగుతోన్న తూర్పు దేశాల ఆర్థిక ఫోరం (ఈఈఎఫ్‌) ఐదో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మోదీ ప్రసంగించారు. తూర్పు దేశాల్లో మానవ సంక్షేమం కోసం ఈఈఎఫ్‌ ‌చేపట్టిన చర్యలు మొత్తం మానవాళి సంక్షేమానికి ఉపయోగపడతాయని తాను బలంగా నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు. తూర్పు దేశాలతో భారత్‌కు చాలా ఏళ్లుగా బలమైన సంబంధాలు ఉన్నాయని, వ్లాడివోస్టోక్‌లో కాన్సులేట్‌ ‌ప్రారంభించిన తొలి దేశం తమదేనని మోదీ పేర్కొన్నారు. సోవియట్‌ ‌రష్యాలో విదేశీయులపై నిషేధం ఉన్న కాలంలోనూ వ్లాడివోస్టోక్‌లో మాత్రం భారతీయులను అనుమతించిన విషయాన్ని గుర్తుచేశారు. ’సబ్‌ ‌కా సాత్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌’ ‌నినాదంతో నవభారత్‌ ‌నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్‌ ‌డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తూర్పు తీరంలో అభివృద్ధికి రష్యాతో కలిసి నడుస్తామని మోదీ హా ఇచ్చారు. ఈ సందర్భంగా ’యాక్ట్ ‌ఫర్‌ ఈస్ట్’‌పాలసీని ఆవిష్కరించిన ప్రధాని.. తూర్పు తీరం అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ప్రాంతాభివృద్ధికి రష్యాకు ఒక బిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు. ’యాక్ట్ ‌ఫర్‌ ఈస్ట్’ ‌విధానంలో భాగంగా తూర్పు ఆసియాలో భారత్‌ ‌చురుకుగా వ్యవహరించనుందని, ఇది తమ ఆర్థిక దౌత్యంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు.
మరోవైపు, భారత్‌, ‌రష్యాల మధ్య రక్షణ, ఇంధన సహా పలు రంగాల్లో సహకారాన్ని పెంపొదించుకోడమే లక్ష్యంగా బుధవారం జరిగిన చర్చల్లో మొత్తం 10.45 లక్షల కోట్లు విలువ చేసే 15 ఒప్పందాలు కుదిరాయి. వాణిజ్యం, పెట్టుబడులు, ఆయిల్‌, ‌గ్యాస్‌, అణు శక్తి, రక్షణ, అంతరిక్షం, సముద్ర రవాణా తదితర అంశాలలో సహకారంపై మోదీ చర్చించారు. తాము ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యానికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఇస్రో చేపట్టిన గగన్‌యాన్‌ ‌ప్రాజెక్టుకు సహకరిస్తోన్న రష్యా ఆస్టోన్రాట్స్‌కు శిక్షణ ఇవ్వనుంది. తమ మధ్య స్నేహం మరింత బలపడుతోందని, వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ప్రయోజనం కలగడమే కాదు, ప్రజల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు.