వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం

September 9, 2019

యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం … మావోయిస్టు పార్టీ ప్రకటననల్లమల ప్రాంతంలో కేంద్రప్రభుత్వం యురేనియం తవ్వకాలు జరపాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల ప్రజలు చేపట్టిన పోరాటానికి తమ మద్దతును ప్రకటిస్తూ సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ మీడియాకు ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటన పూర్తి పాఠం ..
అణుబాంబుల కోసమే యురేనియం త్రవ్వకాలు, నల్లమల అడవి ప్రాంతంలో అమ్రాబాద్‌,‌పదర తదితర ప్రాంతంలోని ప్రజలను నిర్వాసితులను చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న యురేనియం త్రవ్వకాలను సి.పి.ఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.యురేనియం త్రవ్వకాల ప్రయత్నాలు వెంటనే ఆపివేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నాము. విద్యుత్‌ అవసరల పేరుతో అణుథర్మల్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి అనివార్యమని కేంద్ర ప్రభుత్వం ప్రజలను పక్కతోవ పట్టించేలా ప్రయత్నిస్తుంది. దేశంలో తయారువుతున్న విద్యుత్‌ ‌ను సరిగ్గా ఉపయోగించుకోలేని పాలకులు,మానవాళిని వినాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన యురేనియం ఖనిజంను వేలికితీయడం దుర్మార్గమైన చర్య, యురేనియం విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ఎంత ప్రమాదకరమో జార?ండ్‌ ‌రాష్ట్రంలో జాదుగూడ,తమిళనాడులోని కూడం కులంలో చూడవచ్చు. 1986 రష్యాలో చెర్నోబిల్‌ ‌ప్రమాదం నుండి మొదలుకొని 2011జపాన్లో పుకుషిమా ప్రమాదం వరకు ఈ త్రవ్వకాలు ఎంత మారణహెమాన్ని సృష్టిస్తాయో ప్రపంచం ముందు కనిపిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో హిరోషిమా పై ప్రయోగించబడిన అణ్వాయుధం వల్ల లక్షలాది మంది ప్రజలు విగతజీవులైనారు. అణ్వాయుధ బలాన్ని బట్టి మిలటరీ శక్తిని గొప్పగా భావించే సామ్రాజ్యవాద దళారీ పాలకులు యురేనియంను అణుబాంబుల తయారీకి ఉపయోగించి మానవాళి విద్వంసానికి పూనుకుంటున్నారు. నల్లమల ప్రజలను బలవంతంగా అడవి నుండి తరలించే ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం మానుకోకపోతే తగిన రీతిలో ప్రజా వ్యతిరేకతకు గురికాక తప్పదు. ప్రత్యమ్నాయ ఇందన వనరులు వదిలి అణువిద్యుత్‌ ‌విధానం చేపట్టడమే కుట్ర, నల్లమల ప్రాంతం జీవ వైవిధ్యానికి ప్రసిద్ధిచెందింది. ఆదివాసీలకు రాజ్యంగం కల్పించిన రక్షణలను ఉల్లంగిస్తూ నల్లమలను అణుక్షేత్రంగా మార్చివేయడాన్ని ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. కృష్ణా జలాలను అణు ప్రమాదానికి గురిచేసే దుర్మార్గాన్ని నల్లమల పరిసర ప్రాంతమైన ఆంధ్రా, తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు యువత్‌ ‌దేశ ప్రజలు కూడా ఖండించాలని కోరుతున్నాము. నల్లమల ప్రాంతంలో జరిగిన ప్రజాపోరాటాల ఫలితంగా అడవిని, అటవీ సంపదను ఖనిజ సంపదను ప్రజలు రక్షిస్తున్నారు. నల్లమల విప్లవోద్యమాన్ని నెత్తుటేరులో పారించిన పాలక వర్గాలు ఇదే అదనుగా ఖనిజల కోసం అడవి బిడ్డలను, అడవిని వినాశనం చేస్తున్నారు. భారత అణదార్శిక సంస్థ, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అణుబాంబుల కోసం అడవిని ఆక్రమించే కుట్రలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని నల్లమల ప్రజలకు పిలుపునిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా అణుదార్మిక ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తుండగా భారత ప్రభుత్వం మాత్రం దుర్మర్గపు విదానాన్ని చేపట్టింది. 2003లో నాగార్జునసాగర్‌ ‌ప్రాంతంలో యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు రాజీలేని పోరాటం సాగించి విజయం సాధించారు. అదే సూర్తితో యురేనియం కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాను నల్లమల నుండి తరిమి కొట్టాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుంది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల ప్రజలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటిస్తుంది. పర్యావరణ వేత్తలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజలు నల్లమల ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిస్తున్నాము.