ప్రజాతంత్రవిలేకరి: జిల్లా తిమ్మాజీపేట మండలం లోని అప్పాజీపల్లి మరియు అచ్చంపేట మం డల పరిధిలోని రంగాపూర్ లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్,ఎస్పీ సాయి శేఖర్, జిల్లా పరిషత్ చైర్మ న్ పద్మావతి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, విప్ గువ్వల బాలరాజ్ ప్రారంభించారు. అప్పాజీపల్లి లో నిర్వహించిన 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాకు మణిహారం లాంటి నల్లమల్ల అటవీ ప్రాంతానికి పూర్వ వైభవం తెచ్చేం దుకు ఆరో విడత హరితహారంలో ప్రత్యేక కార్యాచరణతో అధిక సంఖ్యలో మొక్కలు నాటనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లావ్యాప్తంగా80లక్షల మొక్కలను నాటడం,జిల్లాను హరితహారంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంలో భాగ స్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. హరితహా రం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మొక్కలునాట డంతో పాటు సంరక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మను చౌదరి,శిక్షణ సహాయ కలెక్టర్ చిత్ర మిశ్రా జిల్లా అధికారులు డాక్టర్ అంజిలప్ప, సుధాకర్, సురేష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.