Take a fresh look at your lifestyle.

నల్లమలలో ఉద్రిక్తం

వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో..
వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో..

యురేనియం తవ్వకాల నిరసన ధర్నాకు మద్దత్తు తెలిపిన
ప్రొ।। కోదండరామ్‌ అరెస్టుతెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు నిరసనగా ధర్నా చేస్తున్న వారికి సంఘీభావం తెలపడం కోసం వెళ్తున్న ఆయన్ను.. మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా హాజీపూర్‌ ‌సపంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నపోలీసులు కోదండరామ్‌ ‌ధర్నా జరుగుతున్న చోటుకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసు జులం నశించాలని జనసమితి నేతలు నినాదాలు చేశారు. యురేనియం వద్దు.. నల్లమలే ముద్దంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు వెంటనే కోదండరామ్‌ను అక్కడ నుండి తరలించారు. నల్లమలలో యూరేనియం నిక్షేపాలు వెలికితీయడం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను తెలుసుకోవడా•కి వెళ్తున్న తమ బృందాన్ని అడ్డుకొని అరెస్టు చేయడం పట్ల తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని ఫాసిస్ట్ ‌చర్యగా అభివర్ణించారు. శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గం ఆదిపూర్‌ ‌గేటు వద్ద డిఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో పోలీసులు వారి బృందాన్ని అరెస్టు చేసి వెల్దండ పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కోదండరామ్‌తో పాటు రమేష్‌ ‌రెడ్డి, భవానిరెడ్డి, స్వాతి, సీనియర్‌ అడ్వకేట్‌
అం‌బటి శ్రీనివాస్‌, అచ్చంపేట టీజేఎస్‌ ఇన్చార్జ్ ‌ద్రోణ చారిలు ఉన్నారు. అరెస్టు సమయంలో పోలీసులకు టీజేఎస్‌ ‌నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకురాలు సృహతప్పి పడిపోయింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా విలేకరులతో ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వ ఫాసిస్టు చర్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. శాంతియుతంగా ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకునేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని, ప్రభుత్వ ప్రయత్నాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల బందోబస్తులో భాగంగా తమను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. మున్ననూరు దాక వెళ్తామని చెప్పినా పోలీసులు ఎంతమాత్రం ఒప్పుకోలేదన్నారు. యూరేనియం తవ్వకాలతో ఆ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, రైతు వ్యతిరేక చర్యలను మానుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. కాగా కోదండరామ్‌తో పాటు మరో 13 మందిని వెల్దండ పోలీస్‌ ‌స్టేషన్‌లో సుమారు 2 గంటల పాటు ఉంచి ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
అరెస్టును ఖండించిన యూరేనియం వ్యతిరేఖ కమిటీ
యురేనియం తోవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని సంఘీభావం ప్రకటించి ఆ ఉద్యమంలో భాగం పంచుకొవాడానికి నల్లమల ప్రాంతానికి వస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఆచార్య ప్రొ।। ’కోదండరామ్‌ను అక్రమంగా అరెస్టు చేయడాని ఖండిస్తూ నల్లమల ప్రాంతంలోని మన్ననుర్‌ ‌గ్రామంలో శ్రీశైలం హైదరాబాద్‌ ‌జాతీయ రహదారిపై యురేనియం వ్యతిరేక కమిటీ అధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా కోదండరామ్‌ అరెస్టును ఖండిస్తూ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ‘నల్లమల అడవి ప్రాంతంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ వార్‌ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో కోదండరాం నల్లమల ప్రాంతంలో పర్యాటిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎట్టిపరిస్థితుల్లోను కోదండరాం గారు నల్లమల ప్రాంతంలో పర్యటన చేయడానికి విలులేదంటు అడగించి అరెస్టు చేయడం జరిగింది.ప్రభుత్వమే బహటంగా నల్లమలలో మావోయిస్టులు లేరు అని ప్రకటిస్తూంటే ఇప్పుడు కొత్తగా నల్లమలలోనికి మావోయిస్టులు ఎప్పుడోచ్చారు,నిజంగానే మావోయిస్టులు ఉంటే బహుళజాతి కంపెనీలు నల్లమల ప్రాంతంలో యురేనియం తోవ్వకాలకు సంబంధించిన సర్వేలు చేసేవారా?ఇది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులు ఉన్నారనే నేప్పంతో నల్లమలను మరోసారి కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి అక్కడి ప్రజలను భయందోళనకు గురి చేసి, ప్రజలను హత్యలు చేయ పునుకుంటుంది. నల్లమల ప్రాంతంలో అక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమని బయటి ప్రపంచం నుండి వస్తున్న మద్దతును చూసి భయపడి ఇలాంటి పాశావికమైన హేయమైన చర్యలకు పాల్పడి అక్కడి ప్రజలను ఒంటిరిని చేసి దేబ్బ తియలని అనుకుంటుంది,మేధావులు,బుధ్ధిజీవులు,కవులు కాళాకారులు,రచయితలు, విద్యార్థులు, కార్మికులు, రైతులు నల్లమలలో యురేనియం తోవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమనికి మద్దతును తేలిజేస్తారని అక్కడ నివసిస్తున్న ప్రజలకు మేమున్నాం మీ వేంట అంటు భౌతిక మద్దతును ప్రకటించి ఈ ప్రాంతం ప్రజల అస్తిత్వం ఉద్యామనికి మీ యొక్క మానవ సహకారం అందిస్తారని కోరుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!