Take a fresh look at your lifestyle.

నగర జలాశయాల అభివృద్ధ్దికి పక్కా ప్రణాళిక

సహజత్వం దెబ్బతినకుండా చర్యలు
హెచ్‌ఎం‌డీఏ కార్యక్రమాలపై సక్షలో మంత్రి కెటిఆర్‌
నగరంలోని ప్రధాన జలాశయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ ‌సూచించారు. సహజత్వం దెబ్బతినకుండా వాటిని అభివృద్ధ్ది చేయాలని అన్నారు. గురువారం ఆయన హెచ్‌ఎం‌డీఏ కార్యక్రమాలపైన సక్ష నిర్వహించారు. బుద్దభవన్‌లో జరిగిన ఈ సక్షా సమావేశంలో హెచ్‌ఎం‌డీఏ చేపట్టిన కార్యక్రమాల పురోగతిని, ప్రణాళికలను చర్చించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న ప్రధాన సరస్సులైన హూస్సేన్‌ ‌సాగర్‌, ‌దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్ధ్దిపైన ఈ సమావేశంలో చర్చించారు. పలువురు కన్‌స్టలెంట్లు తయారు చేసిన మాస్టర్‌ ‌ప్లాన్ల్లను ఈసందర్భంగా పరిశీలించారు. ముఖ్యంగా హూస్సేన్‌ ‌సాగర్‌, ‌గండిపేట చెరువుల అభివృద్ధ్ది కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను కన్సల్టెంట్లు వివరించారు. జలాశయాల సహజత్వాన్ని కాపాడుతూ, నగర ప్రజలకు అహ్లాదం పంచేతీరుగా ఈ మాస్టర్‌ ‌ప్లానింగ్‌ ఉం‌డాలని ఈ సందర్భంగా మంత్రి సూచన చేశారు. గండిపేట వద్ద పార్కు కోసం హెచ్‌ఎం‌డీఏ తయారు చేసిన ప్రణాళికలకు అమోదం తెలిపిన మంత్రి, త్వరలోనే అక్కడ పనులు ప్రారంభించాలని అదేశించారు. దీంతోపాటు గండిపేట జలాశయం చుట్టురా సూమారు 40 కిలోటర్ల మేర వాకింగ్‌ ‌ట్రాకులు, సైక్లింగ్‌ ‌ట్రాకులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ప్రారంభించాలని, ఇందుకోసం జిల్లా యంత్రాంగం, నీటి పారుదల శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. హెచ్‌ఎం‌డీఏ కోకాపేటలో అభివృద్ది చేయనున్న లేఅవుట్‌ ‌పైన మంత్రి సక్ష చేశారు. ఇప్పటికే కోకాపేట, కొల్లూర్‌ ‌లాంటి ప్రాంతాల్లో జన సాంద్రత పెరగడం, పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్న భవన సముదాయాలు, కార్యాలయాల నేపథ్యంలో అక్కడ విస్తరించాల్సిన రవాణా మౌలిక వసతుల కల్పనపైన చర్చించారు. దీంతోపాటు హెచ్‌ఎం‌డీఏ లాజిస్టిక్స్ ‌పార్కుల ఏర్పాటుపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే హెచ్‌ఎం‌డీఏతోపాటు ప్రైవేట్‌ ‌సంస్ధలతో కలిసి పలు లాజిస్టిక్‌ ‌పార్కులను అభివృద్ది చేస్తున్నదని, అయితే పెరుగుతున్న లాజిస్టిక్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, హెచ్‌ఎం‌డీఏ స్వయంగా ఏర్పాటు చేసే పార్కులు, ప్రస్తుతం ఉన్న వాటి కన్నా పెద్దవై ఉండాలని, కనీసం 50 ఎకరాల పైన ఉండాలని సూచించారు. లాజిస్టిక్‌ ‌పార్కుల ఏర్పాటులో మల్టి మోడల్‌ ‌లాజిస్టిక్‌ ‌పార్కుల ఏర్పాటుపైన దృష్టి సారించాలన్నారు. హెచ్‌ఎం‌డీఏ నిర్మించ తలపెట్టిన హైదరాబాద్‌ ‌హబిటాట్‌ ‌సెంటర్‌ ‌ప్రతిపాదనలపైన మంత్రి సక్షించారు. హైదరాబాద్‌ ‌నగరంలోని కళలు, సంస్క•తికి అద్దంపట్టేలా, వాటిని ఊతం ఇచ్చేలా ఈ సెంటర్‌ ఉం‌డాలని సూచించారు. దీంతోపాటు హైటెక్స్, ‌హెచ్‌ ఐసిసి మాదిరి నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ కన్వెన్షన్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని హెచ్‌ఎం‌డీఏ సూచించారు. ఉప్పల్‌, ‌మేడ్చెల్‌ ‌లాంటి సిటీ పరిసర ప్రాంతాలతోపాటు సెంట్రల్‌ ‌సిటీ ప్రాంతాల్లోనూ ఈ కన్వేషన్‌ ‌సెంటర్లను నిర్మించేందుకు అందుబాటులో ఉన్న ప్రాంతాల గుర్తింపుపైన అయా జిల్లాల యంత్రాంగాలతో చర్చించాలని అదేశించారు. హెచ్‌ఎం‌డీఏ అర్బన్‌ ‌పారెస్టీ కార్యలాపాలపైన ఈ సమావేశంలో అధికారులు మంత్రికి వివరాలు అందించారు. హెచ్‌ఎం‌డీఏ పరిధిని 20 యూనిట్లుగా విభజించి, అయా ప్రాంతాల్లోని ఫారెస్ట్ ‌బ్లాకులను అభివృద్ది చేయాలన్నారు. అవుటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు ఇంటర్‌ ‌చేంజ్‌ ‌ప్రాంతాల్లో మరింత గ్రీనరీ అభివృద్దిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు. దీంతోపాటు హెచ్‌ఎం‌డీఏ పరిధిలోని అన్ని, గ్రామ పంచాయితీల అధికారులు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని ఫారెస్ట్ ‌డిపార్టమెంట్‌, అర్బన్‌ ‌ఫారెస్ట్ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ సమావేశానికి అటవీశాఖ మంత్రితో కలిసి హాజరవుతామని తెలిపారు. ఈ సమావేశంలో నగర మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్‌ ‌కూమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy