Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోళ్లపై… పార్లమెంట్ లో ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి ..! టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్

  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజేపి నేతల మాటలపై నమ్మకం లేదు
  • ధాన్యం కొనుగోళ్ల అంశం ప్రాణ వాయువు వంటింది: కేకే

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ,డిసెంబర్ 1: ధాన్యం కొనుగోల్లపై బయట ఇస్తోన్న ప్రకటన లనే పార్లమెంట్ వేదికగా సంబంధిత మంత్రితో ఇప్పించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అప్పుడు కేంద్రం మాటల్ని నమ్ముతామన్నారు. చివరి గింజ వరకు కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజేపి నాయకులు అంటున్నారన్నారు. ఇదే అంశమని సంబంధిత శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో నాలుగు లైన్లు చెప్పించాలన్నారు. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నరేంద్ర సింగ్ తోమర్, ఇతర నేతలు నాలుగు రకాలుగా చెప్పి ప్రజల్ని గందరగోళంలో పడేస్తున్నారన్నారు. అందుకే ఈ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఇక పార్లమెంట్ లో తెల్చుకుందామని కల్లాలకు పోయిన ఎంపీలకు సవాల్ విసిరారు. పార్లమెంట్ లో ఒక్క స్టేట్మెంట్ ఇస్తే… అక్కడే బిజేపి నేతలకు దండేసి, దండం పెడతామన్నారు. లోక్ సభలో రెండు దినాలుగా రాష్ట్ర రైతాంగం కోసం ప్రొటెస్ట్ చేస్తుంటే, కొందరు పార్లమెంట్ అవాక్కులు, చెవాక్కులు పేలుతున్నారని లోక్ సభ పక్ష నేత నామా మండిపడ్డారు. పొద్దున 11 గంటల నుంచి నీళ్లు, ఆహారం లేకుండా పార్లమెంట్ లో తమ పార్టీ ఎంపీలు గొంతెత్తి అరుస్తున్నామన్నారు. రైతులతో రాజకీయం చేయోద్దని బిజేపి, కాంగ్రెస్ నేతలను కోరారు. తెలంగాణ రైతాంగ సమస్య అన్నారు. రైతులపై చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్ లో తమతో పాటు ధర్నాలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతులు, తెలంగాణ సమాజం నమ్ముతుందన్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి క్యాబినెట్ మంత్రి అయ్యారని చాలా సంతోష పడ్డామని, రాష్ట్ర సమస్యలపై తాను ముందుండి నడిపిస్తారని ఆశించినట్లు చెప్పారు.

గత యాసంగిలో మిగిలిన బాయిల్డ్ రైస్, ఈ ఏడాది వానాకాలం పండింన మొత్తం రైస్ ను కేంద్రం తీసుకోవాలని పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే, వచ్చే ఏడాది యాసంగి లక్ష్యాన్ని డిసైడ్ చేయాలని, పంట మార్పిడి కోసం కొంత టైం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. తెలంగాణ లో ధాన్యం కొనుగోలు సమస్య ప్రాణవాయువు వంటిదన్నారు. బాయిల్డ్ రైస్, ఇతర అంశాలపై తమిళనాడు, కేరళ, ఒడిసా జాయింట్ ఆందోళన చేస్తామన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పినందునే, సిఎం కేసీఆర్ మార్కెట్ యాసంగిలో కొనుగోలుసెంటర్లు పెట్టమని చెప్పారన్నారు.

లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన…
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల సేకరణ అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో మూడో రోజు ఆందోళన కొనసాగించారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ లో ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కే రాజ్య సభలో, నామా నాగేశ్వర్ రావు లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉదయం సభ ప్రారంభం కాగానే లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డు పట్టుకొని వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. మధ్యాహ్నం తర్వాత ఫ్లోర్ పై బైటాయించి వినూత్న రీతిలో ఆందోళన చేశారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అంతకు ముందు టీఆర్ఎస్ ఎంపీల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. పదే పదే సభకు అంతరాయం కలిగించడంపై మండిపడ్డారు. సభా మర్యాదలు పాటించాలని హితవు పలికారు. సభ్యులు మాట్లాడుతుంటే నినాదాలు చేయడం సరికాదని, సభ ప్రజల గొంతు వినపించేందుకు ఉందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు సభలో ప్రవర్తిస్తోన్న తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply