Take a fresh look at your lifestyle.

దోచుకునే ఆసుపత్రులను ఫినిష్‌ ‌చేయండి

మానవత్వం లేని వారిని చీడ పురుగులుగా చూడండి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ,మే 27 : ప్రస్తుత కోవిడ్‌ ‌విపత్కర పరిస్థితుల్లో కొందరు చీడపురుగుల్లా మారి దోచుకోవడం దారుణమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. శవాల ద డబ్బులు ఏరుకొనే సంస్కారహీనులను అధికారులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బలా దోచుకు తినే ఆస్పత్రులను అధికారులు ఫినిష్‌ ‌చేయాలని ఆదేశించారు. ఇటువంటి ఆస్పత్రులను క్షమిస్తే, భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లవుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆలోచించాలని పేర్కొన్నారు. రోగులను దోచుకునే ఆసుపత్రులపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలని నాని సూచించారు.

గురువారం గుడివాడ పట్టణంలోని క్యాంప్‌ ‌కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఏఎం‌డీ ఇంతియాజ్‌ అధ్యక్షతన కోవిడ్‌ ‌పై జరిగిన డివిజన్‌ ‌స్థాయి సక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ఉధృతి నేపథ్యంలో వైద్యులు కూడా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయినప్పటికీ వైద్యులపై నమ్మకంతో వచ్చే రోగులను కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు. దురదృష్టవశాత్తూ కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా కోవిడ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. కరోనా సోకిన రోగులు వైద్యం కోసం వస్తే వారికి ఐదారు రోజుల పాటు ఒక ఆక్సిజన్‌ ‌బెడ్‌ ‌ను కేటాయిస్తున్నారని, నెగిటివ్‌ ‌వస్తే ఇంటికి పంపుతూ, ఆక్సిజన్‌ ‌లెవల్స్ ‌తక్కువగా ఉంటే ఒక సిలిండర్‌ను ఏర్పాటు చేసుకుని •మ్‌ ఐసోలేషన్లో ఉండాలని బలవంతంగా పంపేస్తున్నా రన్నారు.

ఐదారు రోజుల పాటు వైద్యం చేయించుకున్న రోగులు చచ్చినా, బతికినా తమకే సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు ఒక్కో బెడ్‌ ‌కు నలుగురైదుగురు కరోనా సోకిన రోగులకు వైద్యం అందిస్తూ బాధితులు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇంటికి పంపించేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయిల్లో కలెక్టర్లు, జాయింట్‌ ‌కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్న దృక్పథంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఇంకో వైపు సమాజంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా కొంత మంది వైద్యులు వైద్యం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు.

ఇప్పుడున్న విపత్కర పరిస్థితులను అడ్డం పెట్టుకుని దోచుకోవడమే మార్గంగా పెట్టుకున్న మానవత్వం లేని వ్యక్తులను ఈ సమాజం చీడ పురుగులుగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా విపత్తు తొలగిన తర్వాత కుక్క కాటుకు చెప్ప దెబ్బలా అటువంటి వారిని ఫినిష్‌ ‌చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాకుండా వారిని క్షమిస్తే రాబోయే తరాలకు ద్రోహం చేసిన వారమవుతామని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌కే మాధవీలత, గుడివాడ ఆర్డీవో జీ శ్రీసుకుమార్‌, ‌మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌పీజే సంపత్‌ ‌కుమార్‌, ‌డీసీహెచ్వో జ్యోతిర్మయి, డిప్యూటి డీఎంహెవో సుదర్శన్‌ ‌బాబు, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ఎస్‌ ఇం‌దిరాదేవి, మండల తహసీల్దార్‌ శ్రీ‌నివాస్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply