Take a fresh look at your lifestyle.

దేశ ఆర్థిక వ్యవస్థలో… వ్యవసాయానిదే కీలకపాత్ర

ఫోటో: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌రాజన్‌
ఫోటో: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌రాజన్‌

కేంద్ర, రాష్ట్రాలు వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తున్నాయి
గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌రాజన్‌
దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే కీలక పాత్ర అని, యువత దృష్టి వ్యవసాయ రంగంవైపు మరల్చేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌విశ్వవిద్యాలయంలో రెండు రోజుల వర్క్‌షాప్‌ను ఆమె సోమవారం ప్రారంభించారు. కార్యక్రయువత వ్యవసాయ రంగం వైపు చూపు మరల్చేలా ప్రోత్సహించాలని గవర్నర్‌ ఈ ‌సందర్భంగా కోరారు. వ్యవసాయం లాభదాయకం అయితేనే వారు ఇటువైపు అడుగులు వేస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాయన్నారు. దేశ ఆర్ధిక రంగంలో వ్యవసాయానిదే కీలక పాత్ర అని వెల్లడించారు. జనాభాలో 54.6 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో 60 శాతం మంది గ్రాణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని గవర్నర్‌ ‌తమిళిసై ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ, సబ్సిడీ విత్తనాలు, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ ప్రయోజనాల కోసం నిరంతరాయంగా విద్యుత్‌ ‌సరఫరా. రైతుబంధు, రైతు బీమా వంటి అనేక సహాయ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మిషన్‌ ‌కాకతీయతో చెరువులను పునర్నిర్మించి చిన్ననీటి పారుదల వ్యవస్థను క్రమబద్దీకరించడం జరిగిందని తమిళిసై వెల్లడించారు. ప్రతి మండలానికి ఒక వ్యవసాయాధికారిని, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించి రైతులకు సేవలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం పంట కాలనీలను ప్రోత్సహిస్తోందన్నారు. అయితే వ్యవసాయం వైపు యువత ఆసక్తి క్షీణిస్తుండడం విచారకరమన్నారు. వ్యవసాయ రంగ శ్రేయస్సు కోసం యువత సహకారం తప్పనిసరి అని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం వైపు యువతను ఆకర్షించడం ఇప్పుడు ప్రధానమయిన అంశమని స్పష్టం చేశారు. వ్యవసాయంతోపాటు పాడి వ్యవసాయం, తేనెటీగ సంస్కతి, పుట్టగొడుగుల సాగు, సెరికల్చర్‌, ‌చేపల పెంపకం వంటి వ్యవసాయానికి సంబంధించిన రంగాలను ప్రోత్సహించడం ద్వారా యువతను ఈ రంగం వైపు ఆకర్షించగలుగుతామని పేర్కొన్నారు. వ్యవసాయాధారిత ఉత్పాదక యూనిట్లను, వనరుల లభ్యతను తెలుసుకునేందుకు పంచాయతీ స్థాయిలో గ్రాణ యువతకు శిక్షణనివ్వాల్సిన అవసరముందని గవర్నర్‌ ‌పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటి అని భావిస్తే గ్రాణ యువత దీనిని వృత్తిగా స్వీకరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వివిధ విజయవంతమైన వ్యవసాయ సంబంధిత క్షేత్రాలను యువతకు పరిచయం చేయడం, వర్క్‌షాపులు నిర్వహించడం ద్వారా యువతను వ్యవసాయం వైపు ప్రేరేపించాలని సూచించారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిది కీలకపాత్ర. ఇక్కడి జనాభాలో 54.6శాతం మంతి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో ఉన్నారు. రాష్ట్రం జనాభాలో 60శాతం గ్రాణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. రైతు బంధు, రైతుబీమా పథకాలతో పాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నాం. మిషన్‌కాకతీయతో చెరువులను పునర్‌నిర్మించి చిన్ననీటి పారుదల వ్యవస్థను క్రమబద్దీకరించడం జరిగింది. ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌రంగానికి చేయూతనిచ్చేందుకు పంటకాలనీలు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy