వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

దేశవ్యాప్తంగా వరద బీభత్సం

August 12, 2019

169కి చేరిన వరద మృతుల సంఖ్య
సహాయక చర్యలు ముమ్మరం
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అమిత్‌షా, రాహుల్‌
భారతావని వరదలతో అతలాకుతలమవుతోంది. నీటిలో నానుతూ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. జనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా, కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక వరదలకు దేశ వ్యాప్తంగా 169 మంది వరకు దుర్మరణం చెందారు. వ్యాపారులకు రూ. 40 నుంచి 50లక్షల నష్టం
వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. కూటకన్ను ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. మరోవైపు దక్షిణాది రాష్టాల్ల్రో వరద విలయతాండవం చేస్తుంది. కేరళలో 72మంది మృతి చెందగా, 52మంది గల్లంతయ్యారు. 2.51లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలో 40మంది వరద తీవ్రతతో మృతిచెందారు. కాగా రాష్ట్రంలోని 17జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. బుతుపవన వర్షాలతో దేశవ్యాప్తంగా జనజీనవం స్తంభించింది. కేరళ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలను మరింత సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు కేరళ ప్రభుత్వం మిలటరీ సాయం కోరింది. వైమానిక దళ సాయంతో ఆహారపొట్లాలను జారవిడుస్తున్నారు. సుమారు 2 లక్షల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. వయనాడ్‌ ఎం‌పీగా ఉన్న రాహుల్‌ ‌గాంధీ అక్కడకు చేరుకుని వరద సహాయక కార్యక్రమాలు సక్షిస్తున్నారు. వర్షాలు తగ్గడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో విదేశాలకు వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలిగింది. వరుసగా రెండో ఏడాది వరదల కారణంగా కేరళలో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. కర్ణాటకలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పలు జిల్లాల్లో వరదలు పొటెత్తుతున్నాయి. తుంగభద్ర బ్యాక్‌ ‌వాటర్‌ ఇళ్లల్లోకి వస్తుండడంతో జనజీవనానికి తీవ్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తాయి. సీఎం యడుయూరప్ప ఎప్పటికప్పుడు పరిస్థితిని సక్షిస్తున్నారు. 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 15 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు కర్ణాటకలో ఆనకట్టలన్నీ నిండిపోయాయి.
ముంబైలో వర్ష బీభత్సం..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు మహారాష్ట్రని ముంచెత్తాయి. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలతో జనజీవనం స్థంభించింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాజాగా వరద నీరు కొల్హాపూర్‌ ‌ని తాకింది. నేషనల్‌ ‌హైవే-4 పై వరద నీరు ప్రవహిస్తోంది. ప్రమాదం అని తెలిసినా నేషనల్‌ ‌హైవే పై రాకపోకలు కంటిన్యూ చేస్తున్నారు. భారీ వాహనాలు, ఎస్వీయూల కోసం కొల్హాపూర్‌-‌సంగ్లీ పాటా దగ్గర జాతీయ రహదారిని ఓపెన్‌ ‌చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ముంబైలో ఇంకా చాలావరకు నేషనల్‌ ‌హైవేలు డేంజర్‌ ‌లోనే ఉన్నాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కుండపోత వర్షాలతో ముంబై ప్రజలు విలవిలలాడిపోతున్నారు. కొన్ని రోజులుగా నీళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాలకు సతారా, సాంగ్లీ, కొల్లాపూర్‌ ‌జిల్లాల్లో వారం రోజుల్లో 30 మంది చనిపోయారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను సీఎం ఫడ్నవిస్‌ ‌పర్యవేక్షించారు. బాధితులతో మాట్లాడారు. ఈ వానలు.. 2005లో మహారాష్ట్రను అతలాకుతలం చేసిన వర్షాలకన్నా రెండింతలు ఎక్కువ అన్నారు. అటు ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వానలతో నదులు మాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు విపత్తు సహాయక బృందాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. బీఎంసీ(బృహన్‌ ‌ముంబై మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌) ‌సిబ్బంది రెడీగా ఉన్నారు. ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి.