Take a fresh look at your lifestyle.

దేశంలో స్వల్పంగా తగ్గిన కొరోనా కొత్త కేసులు

దేశంలో కొరోనా కొత్త కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాక విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం శనివారం 42,618 మంది కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 45 వేలపై చిలుకు కేసులతో  పోల్చితే 6 శాతం తక్కువని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో 330 మందికి కొరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కొరోనా బారిన పడిన వారి సంఖ్య 3,29,45,907కు చేరుకోగా…4.4 లక్షల మందికి పైగా మహమ్మారికి బలయ్యారు.
కొత్తగా 36,385 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3,21,00,001 మంది మహమ్మారి బారి నుండి బయటపడ్డారు. రికవరీ రేటు 97.43 శాతంగా ఉంది. 4,05,681 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. క్రియాశీల రేటు 1.23 శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58 లక్ష మందికి టీకా పంపిణీ చేశారు. దేశంలో ఇప్పటివరకు 67,72,11,205 కొరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

Leave a Reply