వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

దేశంలో వర్షాలు తక్కువున్నా వరదలు?

September 10, 2019

‌గ్రీన్‌ ‌హౌస్‌ ‌గ్యాస్‌లు, ఉద్గారాలతో వాతావరణ పరిస్థుతుల్లో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలకూ, జీవన పరిస్థితులకూ హానికరంగా తయారయ్యాయి.చరిత్రలో అత్యధికంగా నమోదైన వేసవి తీవ్రత తర్వాత ఆలస్యంగా ప్రారంభమైన రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాలలో వరదలు ముప్పేట దాడి చేశాయి. అసోం, ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తగా, ఆ తర్వాత మహారాష్ట్ర, కేరళలను ఆగస్టు మధ్యలో చుట్టుముట్టినయి. అటుపిమ్మట మధ్య భారతంలో వరద బీభత్సం సంభవించింది. మధ్య భారతంలో1950 నుంచి 2015 వరకూ వర్షాలు వరదలు మూడింతలు నష్టపర్చాయని పూణేలోని వాతావరణ సంస్థ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వర్షాలు, వరదల వల్ల మొత్తం 825 మిలియన్‌ ‌మంది ప్రదలు అవస్థలకు గురయ్యారు. 17 మిలియన్ల మంది నిర్వాసితులయ్యారు. 69 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే మాదిరి వర్షాలు, వరదలు రానున్న కాలంలో మరింతగా సంభవించే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి భూతాపంపై అధ్యయనానికి ఏర్పడిన అంతర్‌ ‌ప్రభుత్వ కమిటీ జరిపిన అధ్యయనంలో వాతావరణంలో మార్పు ఏటా ఒక డిగ్రీ పెరగడంతో సంభవిస్తోందని తెలిపింది. మొత్తం వర్షపాతంలో మార్పు లేదు. అయితే, వర్షపాతంలో ఉధృతి పెరగడం వల్ల వరదలు సంభవిస్తున్నాయిని బెంగళూరుకు చెందిన దివేచా సెంటర్‌ ‌ఫర్‌ ‌క్లైమేట్‌ ‌చేంజ్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు జె శ్రీనివాసన్‌ ‌తెలిపారు. 2019లో భారత్‌లో ఒక శాతం వర్షపాతం ఎక్కువ నమోదు కావచ్చని ఆయన అన్నారు.
భారత్‌లో తలసరి నీటి లభ్యత 1,544 క్యుబిక్‌ ‌మీటర్లు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్‌ ‌సింగ్‌ ‌షెఖావత్‌ ‌గత జూలైలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 2001లో దేశంలో తలసరి నీటి లభ్యత 1,816 క్యుబిక్‌ ‌మీటర్లు ఉందని చెప్పారు. సగటున తక్కువ మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల తలసరి నీటి లభ్యత 3,013 క్యుబెక్‌ ‌మీటర్లు. ఈ దేశాల కూటమిలో భారత్‌ ‌కూడా ఉంది. మన తలసరి నీటి లభ్యత ప్రపంచంలోనే అతి తక్కువ. అందువల్ల మనం నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని శ్రీనివాసన్‌ అన్నారు. 72 ఏళ్ళ క్రితం భారత జనాభా 35 కోట్లే. అందువల్ల అప్పుడు ఆ అవసరం రాలేదు.
అసంబద్ద వాతావరణం
వాతావరణంలో అసంబద్ధత ఏర్పడుతోంది. వేసవి కాలంలో వడగాడ్పులు పెరిగాయి. వాయు వొత్తిడి తగ్గింది. గాలిలో తేమ ఉండటం లేదు. ఆ తేమే వర్షంగా కురుస్తుంది. శీతాకాలంలో ఈ ప్రక్రియ తిరగబడుతోంది. వార్షిక గాలి మార్పిడి వాతావరణాన్నే రుతుపవనాలు అంటాం. మన దేశమే కాదు, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ అమెరికాలలోనూ గ్రీన్‌ ‌హౌస్‌ ‌గ్యాస్‌లు, ఉద్గారాలతో వాతావరణ పరిస్థుతుల్లో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలకూ, జీవన పరిస్థితులకూ హానికరంగా తయారయ్యాయి. ఇదే పరిస్థితి. మన దేశంలో ఏటా 85 శాతం రుతుపవనాలు ఉంటాయి. భారత ఉప ఖండం, హిందూ మహాసముద్రంలో ఉష్ణ మండల గాలుల ప్రభావం వల్ల వాతావరణంలో తేడా కనిపిస్తోందని కెనడాలోని వాంకోవర్‌లో వాషింగ్టన్‌ ‌స్టేట్‌ ‌యూనివర్శిటీ వాతావరణ విభాగం ప్రొఫెసర్‌ ‌దీప్తీసింగ్‌ అన్నారు. మన దేశంలో ఏటా నాలుగు మాసాల పాటు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన ఎనిమిది మాసాలలో వర్షపాతం ఉండదని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. రుతుపవనాలు అసంబద్ధంగా ఉంటాయా లేదా అనే విషయమై శాస్త్రజ్ఞుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారత దేశంలో రుతుపవనాలను పరిశీలిస్తే అంతర్‌ ‌సంవత్సర తేడా పది శాతం ఉంటుందని శ్రీనివాసన్‌ అన్నారు. ఇలాంటి వైరుధ్యాలతో మన సమాజం వేల సంవత్సరాల నుంచి గడుపుతోందని ఆయన అన్నారు. అసమగ్రమైన జల సంరక్షణ విధానాలతో మనం ఇబ్బందులకు గురి కావల్సి వస్తోంది. మన దేశంలో రుతుపవనాలు తరచూ మార్పులకు గురవుతున్నాయి. మొత్తం మీద రుతుపవనాలు బలహీనమవుతున్నాయని దీప్తీ సింగ్‌, ఆమె సహచరులు పేర్కొన్నారు. జనవరిలో పరిస్థితిపై వారు సమీక్ష జరిపారు. 1950 నుంచి మధ్య భారతంలో వర్షపాతం తగ్గుతూ వస్తోంది. అయితే, ఇటీవల రాజస్థాన్‌ ఉత్తర పశ్చిమ ప్రాంతంలో పెరుగుతూ వర్షపాతం నమోదు అవుతోంది. మధ్యలో పొడి వాతావరణం కూడా ఏర్పడుతోంది. సగటు వర్షపాతం స్థిరమైన హద్దులలోనే ఉంది. ఈ పొడి వాతావరణం మరింతగా పెరగవచ్చని, అయినప్పటికీ పరిస్థితిని తట్టుకోవచ్చని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.
వర్షపాతం అనేక అంశాలపై ఆధారపడి ఉంది. స్థానికమైన కారణాలు కొన్ని, అంతర్జాతీయ కారణాలు మరి కొన్ని. ఎయిరో సోల్‌ ‌వల్ల గాలిలో ఉండే తేమ, ఘన పదార్ధాలను బలహీనపరుస్తాయి. వీటి కారణంగా వర్షపాతం నమూనాలు మారిపోతుంటాయని ఇండియా స్పెండ్‌ ‌గత మార్చిలో పేర్కొంది. కాలుష్యం వల్ల వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా, వర్షపాతం తగ్గడానికి కాలుష్యం కారణమని 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గ్రీన్‌ ‌హౌస్‌ ‌గ్యాస్‌ల వల్ల, ఎయిరోసోల్‌ ఎమిషన్స్ ‌వల్ల వాతావరణంలో మార్పులు వస్తుంటాయని సింగ్‌ ‌తెలిపారు. 20వ శతాబ్దం మధ్యలో ఎయిరో సోల్‌ ‌వల్ల వాతావరణంలో మార్పు కనిపిస్తోందని వాతావరణ శాస్త్రవేత్త మాధవన్‌ ‌రాజీవన్‌ అన్నారు. వాతావరణ మార్పు వల్ల రుతుపవనాల వరవడిలో మార్పు వస్తోందని ఆయన అన్నారు. వరదల వల్ల నష్టాలు, మానవ తప్పిదాల వల్ల వాతావరణంలో మార్పులు ప్రకృతిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన అన్నారు. అలాగే, వరదలు వచ్చినప్పుడు డ్యాంల నుంచి విడుదల చేసే నీటి నిల్వల వల్ల కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు.
కేరళలో ఆగస్టులో వరదలకు 76 మంది మరణించారు. ఆగస్టు 8 నుంచి నాలుగు రోజుల వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయి. 28 మంది కొండచరియలు విరిగి పడటం వల్ల మరణించారు. పశ్చిమ కనుమల్లో జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం వల్లనే వర్షాలు అధికమవుతున్నాయి. అనిశ్చిత స్థితి వల్ల కొంత చెడు జరుగుతోందని భూతాపంపై ప్రపంచ పరిశోధనా సంస్థకు చెందిన నమ్రత జినోయా అన్నారు. ఒక వంక వర్షాలు, వరదల వల్ల కొన్ని ప్రాంతాలు ఇబ్బందులకు గురవుతుంటే మరో వంక కర్నాటకలోని కోలార్‌, ‌గుల్బర్గా, రాయచూర్‌ ‌జిల్లాలు అనావృష్టి వల్ల నష్టాలకు గురవుతున్నాయి. రుతుపవనాల మార్పులు భారత్‌కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. 1998 నుండి 2017 వరకూ ప్రపంచంలో తీవ్రమైన వాతావరణ సమస్యలను ఎదుర్కొన్న దేశాల్లో భారత్‌ ఒకటి. ప్రపంచంలో అతి శీతల ప్రాంతం అయిన మేఘాలయలోని చిరపుంజి ఇప్పుడు నీటి కొరతను ఎదుర్కొంటోంది. సుదూర ప్రాంతాల విషయమే అలా ఉంటే కర్నాటకలోని కొన్ని ప్రాంతాలలో నీటి కొరత వల్ల వలసలు పెరుగుతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి.

– ‘స్క్రోల్‌.ఇన్‌’ ‌సౌజన్యంతో..