Take a fresh look at your lifestyle.

దేశంలో యువతరం జర్నలిస్టును నేను. నాపై ఎంజే అక్బర్ లైంగిక దాడి చేశారు.

  • ఇదీ నా కథ
    పల్లవీ గగోయి ఎన్ పిఆర్ కు చీఫ్ బిజినెస్ ఎడిటర్

ఎడిటర్స్ నోట్ః  మేం ఎంజె అక్బర్ న్యాయవాది సందీప్ కపూర్ వ్యాఖ్యల కోసం సంప్రదించాం. వాటిని ఇందుతో జత పర్చాం. నా కక్షిదారుడు తనపై వచ్చిన ఆరోపణలన్నీ అభూత కల్పనలని ఖండించినట్టు కపూర్ చెప్పారు.

ఎంజె అక్బర్ ఏషియన్ ఏజ్ ఎడిటర్ ఇన్ చీఫ్ గా నాకు తెలుసు. ఆయన చాలా అద్భుతమైన, మేధో సంపన్నమైన జర్నలిస్టు. నా జీవితంలో అత్యంత దుర్భరమైన, స్మృతులను మీతో పంచుకుంటున్నాను. 23 ఏళ్ళ పాటు ఆ స్మృతులను నా గుండెల్లో దాచుకున్నాను.
రెండు ఆదివారాల క్రితం అమెరికాలో మా ఇంట్లో ఉన్నాను. ఎంజె అక్బర్ ఏళ్ళ క్రితం తమ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పలువురు జర్నలిస్టులు వినిపించిన కథ విని విస్తపోయాను. అక్బర్ ఇటీవల వరకూ భారత విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యానికి విదేశాంగ విధానాన్ని అమలు జేశారు. . ఆయన ఇప్పటికీ పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. అధికార పార్టీలో సభ్యుడు.

భారత దేశంలో నా స్నేహితురాళ్ళతో మాట్లాడినప్పుడు నా తల తిరిగి పోయింది. ఇద్దరూ కూడా నాకు మంచి స్నేహితురాళ్ళు. ధైర్యంగా మాట్లాడగల సత్తా ఉన్నవారు. అక్బర్ గురించి వారు చెబుతుంటే నాకు మతి పోయింది. నా కథను నా భర్తకు చెప్పాను. ఆయనను కలుసుకున్న కొద్ది వారాల తర్వాత జరిగింది ఇది. ఆయనకు నా కథ చెబుతున్నప్పుడు దుఃఖం తన్నుకు వచ్చింది.

ఏషియన్ ఏజ్ లో జర్నలిస్టుగా చేరినప్పుడు నా వయసు 22 సంవత్సరాలు.. ఆ పత్రికలో అధికులు మహిళలే. మాలో చాలా మంది కాలేజీ చదువు పూర్తి కాగానే వచ్చి చేరిన వారే. అప్పట్లో మాకు జర్నలిజంలో ప్రాథమిక విషయాలు తెలియవు. అక్బర్ వద్ద పని చేయడం వల్ల మేం కూడా ప్రసిద్ధి చెందాం.అప్పటికే ఆయనకు మంచి పేరు ఉంది. మంచి పేరున్న సంపాదకునిగానే కాకుండా,. రెండు మంచి పుస్తకాలు కూడా రాశారు.ఒక దశాబ్దం వ్యవదిలో ఆయన మంచి పేరు పొందిన సన్డే మ్యాగజైన్, టెలిగ్రాఫ్ పత్రికలను ప్రారంభించడంలో తోడ్పడ్డారు. ఏషియన్ ఏజ్ అంతర్జాతీయ పత్రిక ఇప్పుడు ఆయన నడుపుతున్న తాజా పత్రిక
అక్బర్ వయసు అప్పట్లో 40 ఏళ్లు అనుకుంటాను. జర్నలిజంలో అత్యున్నతమైన నైపుణ్యం ఆయన సొంతం. ఆయన మేం రాసిన వ్యాసాలను మౌంట్ బ్లాంక్ ఎర్రరంగు సిరా పెన్నుతో దిద్దేవారు. మా కాపీలను చుట్టచుట్టి చెత్తబుట్టలో పడేసేవారు. ఆయన గట్టిగా అరవని రోజు లేదు.
ఆయన ఉపయోగించే భాష నన్ను కట్టి పడేసేది. ఆయన తనలా మేము రాయాలని కోరుకునే వారు. అందుకే ఆయన ఎన్ని అన్నా మారు మాట్లాడేవాళ్ళం కాదు. అప్పట్లో మేం ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాం.

23వ ఏట నేను ఏషియన్ ఏజ్ ఒపెడ్ పేజ్ ( సంపాదకీయం పేజీకి ఎదురుగా ఉండే పేజి)కి ఎడిటర్ ని అయ్యాను అగ్రశ్రేణి కాలమిస్టులు, రాజకీయాల్లో అతిరథులతో మాట్లాడుతూ ఉండేదాన్ని. జశ్వంత్ సింగ్ వంటి రాజకీయ వేత్తలు, అరుణ్ శౌరీ వంటి జర్నలిస్టులతో మాట్లాడుతూ ఉండేదాన్ని అంత చిన్న వయసులో పెద్ద బాధ్యతలను అప్పగించారు.
నేను ఎంతో ఇష్టపడి చేస్తున్న వృత్తికి త్వరలోనే ప్రతిఫలాన్ని అందుకున్నాను. నా స్నేహితురాలు తుషిత ఇప్పటికీ ఆ సంగతి గుర్తు చేస్తుంటారు. అదేమంటే, తొలిసారి అక్బర్ నాపై చేయి చేసుకున్నారు. 1994లో బహుశా అది వసంతం వెళ్ళే సమయమో, వేసవి ప్రవేశించే సమయమో కావచ్చు. నేను ఆయన ఆఫీసు గదిలోకి వెళ్ళాను. ఆయన ఆఫీసు గది తలుపు ఎప్పుడూ మూసిఉంటుంది. ఒపెడ్ పేజ్ ని తయారు చేసి చూపిద్దామని తీసుకుని వెళ్ళాను. మంచి హెడ్డింగ్ లు పెట్టానని అనుకున్నాను. నా కృషిని ఆయన మెచ్చుకున్నారు. వెంటనే చించేశారు. ఆ సమయంలో నా ముఖం ఎలా ఉందో తుషిత చెబుతుంటే బాధ కలిగింది. ఏం జరిగిందని ఆమె నన్ను ప్రశ్నించింది. జరిగిందంతా ఆమెకు చెప్పాను. నా బాధను ఆమెతోనే పంచుకున్నాను.

కొద్ది నెలల తర్వాత రెండో సంఘటన జరిగింది. ముంబాయిలో ఒక మ్యాగజైన్ తీసుకుని రావడంలో తోడ్పడేటందుకు నన్ను రమ్మన్నారు. కాజ్ హోటల్ లో ఆయన నన్ను తన గదిలోకి పిలిచారు. పేజి లే అవుట్ లు చూపించడం కోసం రమ్మన్నారు. ఆయన ముద్దు పెట్టేందుకు నా దగ్గరగా వచ్చారు. ఆయనను తోసేసి బయటకు పరిగెడతూ వచ్చేశాను. నా ముఖం మీద చారికలు చూసి ఒక స్నేహితురాలు అడిగితే పడిపోయానని చెప్పాను. ఢిల్లీ తిరిగి రాగానే తనను అడ్డుకుంటే ఉద్యోగంలోంచి తీసేస్తానని అక్బర్ బెదిరించారు. అయితే, నేను ఆ పత్రికలో మానేయలేదు.

నేను ఉదయం 8 గంటలకు రోజూ వచ్చేదాన్ని. మిగిలిన జర్నలిస్టులందరి కన్నా ముందుండేదాన్ని, 11 గంటలకల్లా ఒపెడ్ పేజిని సిద్దం చేయాలన్న ప్రణాళికతో వచ్చేదాన్ని. మిగిలిన సమయాల్లో ఆపీసును వదిలి పెట్టి రిపోర్టింగ్ కి వెళ్ళేదాన్ని . ముంబాయి సంఘటన తర్వాత ఒక కథ నన్ను ఢిల్లీకి వందలాది మైళ్ళ దూరం తీసుకుని వెళ్ళింది. వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు ఉరి వేసుకున్న ఘటన గురించి వివరాలు సేకరించేందుకు వెళ్ళాను. నాకు అప్పగించిన పని జైపూర్ లో పూర్తి అయింది.ఆ సమయంలో అక్బర్ జైపూర్ లో హోటల్ లో తన గదికి ఈ కథ గురించి వినేందుకు రమ్మన్నారు.

ఆయన హోటల్ గదిలో ఆయన నన్ను వివస్త్రను చేసి లైంగిక దాడి చేశారు.ఆయన శారీరక సౌష్టవం గలవాడు. అవమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎవరితోనూ దీనిని గురించి చెప్పలేదు. ఇందుకు నన్ను నే్నే నిందించుకున్నాను. ఆయన హొటల్ రూం కి వెళ్ళడం వల్లనే కదా ఇలా జరిగిందని బాధ పడ్డాను. ఆ తర్వాత ఆయన నాపై ఎన్ని సార్లు విరుచుకుని పడినా అడ్డుకోలేదు. నా అశక్తురాలిననిపించింది. ఆయన నన్ను బలవంతం చేస్తూనే ఉన్నారు కొద్ది నెలల పాటు ఆయన నన్ను మానసికంగా, భౌతికంగా వేధిస్తూనే వచ్చారు. నేను మగ జర్నలిస్టులతో మాట్లాడుతుంటే గట్టిాగ అరిచే వారు. చాలా భయమనిపించేది.

అప్పట్లో నేను ఎందుకు ఆయనతో పోరాడలేదు నా జీవితంలో మిగిలిన అన్ని విషయాల్లోనూ నేను పోరాడూతూనే ఉండేదాన్ని . ఆయన నాపై అంత చొరవ ఎందుకు తీసుకున్నారో,ఎలా తీసుకున్నారో ఇప్పటికీ నేను చెప్పలేను. అప్పట్లో ఆయన నా కన్నా చాలా బలవంతుడనా .. పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియకనా.. ఉద్యోగం పోతుందనే భయమా .. ఎక్కడో దూరంలో ఉన్న నా తల్లితండ్రులకు ఎలా చెప్పాలో తెలియకనా.. అప్పట్లో నామీద నాకే అసహ్యం వేసేది. రోజూ చస్తూ బతికాను.

ఎక్కడైనా దూరప్రాంతాల్లో రిపోర్టింగ్ బాధ్యతలు అప్పగిస్తారేమోనని ఎదురు చూసేదాన్ని 1994 ఎన్నికలేలో ఢిల్లీకి చాాల దూరంగా కర్నాటక ఎన్నికలలో కవరేజ్ కి వెళ్ళాాను. అప్పట్లో పెద్ద రాజకీయ వేత్తల ను ఇంటర్వ్యూ చేశాను. ర్యాలీలకు హాజరయ్యాను, గ్రామీణులతో మాట్లాడాను. ఈ అనుభవాలతో ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగానే అంచనా వేసాను. ఆ తర్వాత నేను అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ వంటి ఇతర దేశాలకు కూడా వెళ్ళాను. ఈ రెండు దేశాల్లో పని వీసాలను సంపాదించాను. నేను ఎక్కడికి వెడితే అక్కడికి వచ్చేవాడు. నా సహచరులంతా పనులు ముగించుకుని వెళ్ళిన తర్వాత ఆయన నన్ను కొట్టేవాడు కాగితాలు, పేపర్ వెయిట్ లు విసిరేసే వాడు. నేను పారిపోయి హైడ్ పార్కులో దాక్కున్నాను. ఎవరితోనూ చెప్పుకోలేకపోయేదానిని. అయితే, సుషితతోనూ, సుపర్ణలతోనూ నా గోడు చెప్పుకున్నాను. అక్బర్ అప్పటికీ మా పత్రిక ఇన్ చార్జిగా ఉండేవారు. ముంబాయి రమ్మనమనే వారు.
ముంబాయి వెళ్ళాను ఈసారి మంచే జరిగింది. న్యూయార్క్ లో డౌ జోన్స్ వద్ద రిపోర్టింగ్ అసిస్టెంట్ గా చేరాను. ఇప్పుడు నేను అమెరికన్ పౌరురాలిని. నాను గృహిణిని, తల్లిని.. నా జీవితాన్ని పైకి తెచ్చిన జర్నలిజం అంటే నాకు ప్రేమ. అభిమానం. కష్టపడి నిజాయితీగా పని చేయడం వల్ల నేను డౌ జోన్స్ నుంచి వేరు పడి అసోసియేటెెడ్ ప్రెస్, సిఎన్ఎన్ లకు పని చేశాను. ఈరోజు నేషనల్ పబ్లిక్ రేడియో లీడర్ ని. నేను అవమానాలకూ, దౌష్ట్యాలకూ తట్టుకోవడం వల్లే నిలబడగలిగానని నాకు తెలుసు. అక్బర్ తో వాదనలు వేసుకోలేదు. ఆయన ఎ్పపుడూ చట్టానికి అతీతంగా ఉండాలనుకుంటాడు. తనకేమీ వర్తించవని అనుకుంటాడు.

రెండు వారాల క్రితం అక్బర్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఆరోపణలన్నీ నిరాధారమని ఆయన కొట్టివేశారు. తనపై ఆరోపణలు చేసిన జర్నలిస్టుల్ల ో ఒకరిపై దావా వేశారు. తాను చెప్పిందే నిజమన ఆయన వాదిస్తున్నారు. ఆ హక్కు ఆయనకు ఉంది.
ఇప్పుడు నేను ఏం చెప్పినా నాకు ఒరిగేది ఏమీ లేదు. నేను ిఇప్పుడు మాట్లాడితే నా సన్నిహితులంతా బాధ పడతారు. అక్బర్ వంటి బలవంతుల వల్ల బాధితురాలినని చెప్పడం కోసం ఈ నాలుగు వాక్యాలు రాస్తున్నాను.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy