Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు.. 4,57,000

73,52,911 రక్త నమూనాలను పరీక్షించిన  ఐసీఎంఆర్‌  

కొరోనా మహమ్మారి దేశ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 4 లక్షల 57 వేలకు పైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. 14,500ల మంది చనిపోయారు. అయితే దేశంలో కరోనా విజృంభించినప్పటి నుంచి.. జూన్‌ 23 ‌వరకు 73,52,911 రక్త నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ ‌బుధవారం వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 2,15,195 నమూనాలను పరీక్షించినట్లు చెప్పింది. కొవిడ్‌ -19‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా మొత్తం వెయ్యి ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ఇందులో 730 ల్యాబ్‌ ‌లు ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో ఉండగా, 270 ప్రయోగశాలలు ప్రైవేటు ఆస్పత్రుల పరిధిలో ఉన్నట్లు పేర్కొంది. వీటిలో ఆర్టీ – పీసీఆర్‌ ‌ల్యాబ్స్ 557, ‌ట్రునాట్‌ ‌ల్యాబ్స్ 363, ‌సీబీఎన్‌ఏఏటీ ల్యాబ్స్ 80 ఉన్నాయి.

కరోనాను ఎదుర్కోవడంలో ఆదర్శంగా కేరళ అభినందించిన ఐక్యరాజ్య సమితి
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో… కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిన కేరళను ఐక్యరాజ్యసమితి కొనియాడింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజతో పాటు ఇతర నాయకుల సేవలను, కృషిని ఐరాస ప్రశంసించింది. మంగళవారం ’పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌డే’ను పురష్కరించుకుని కరోనాను ఎదుర్కోవటంతో ప్రపంచ వ్యాప్తంగా విశేష కృషి చేసిన వారిని ఐక్యరాజ్య సమితి అభినందించింది. ఆన్‌లైన్‌ ‌ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ మాట్లాడుతూ… నిఫా వైరస్‌, 2018-19 ‌లలో వచ్చిన రెండు వరదలను ఎదుర్కోవటంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించింది. ఆ అనుభవమే కోవిడ్‌-19 ‌నియంత్రించడంలోనూ ఉపయోగపడింది. వూహాన్‌లో కరోనా కేసులు నమోదైన వెంటనే కేరళ అప్రమత్తం అయింది. తగిన విధంగా చర్యలు తీసుకుంటూ వచ్చింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రేటు 12.5, మరణాల రేటు 0.6గా ఉందని మంత్రి శైలజ తెలిపారు.కరోనాను నియంత్రించడంలోనూ ఉపయోగపడింది.

Leave a Reply