Take a fresh look at your lifestyle.

దుఃఖం లేనోడు..

చెట్లకు నీళ్ళుపోషేందుకు పొయిన యాదిగాన్ని పాము కర్షిందట సొర్‌! అనంగనె ఇంతెత్తు ఎగిరిన అఫీసర్‌ ‌సారు ‘‘ఇంత సీరియస్‌గ మొక్కల గురించి మాట్లాడుతాంటే పాము కర్శిందన్న విషయం చెపుతున్నవు యూ ! ఫూల్‌ ! ‌మొక్కలు బతుకుడెంత ముఖ్యమో తెల్వదా? రోజు మొక్కలకు ఫై టైం నీళ్ళుపోయండి? మళ్ళచ్చే వారానికి మొక్కల లెక్క బరాబరుండాలె. వస్తం!’’ అని కార్లెక్కె. కారెనుక కారు పదికార్లచ్చి పాయె. లెక్క జూస్తె పెట్టిన మొక్కలల్ల సగమే బతికినయి. సర్పంచ్‌ ‌పోస్ట్ ‌పోవుడు ఖాయమైటట్టున్నది. మరి మనుషుల పాణాలే పోబట్టె! గీ సర్పంచ్‌ ‌పదవో లెక్కనా!సర్పంచ్‌ ‌గీ మద్దెనేందో కతల పడ్తాండనే ముచ్చట ఊర్లె జోరందుకున్నది. ‘‘బాయి కాడికి గిట్ల పోతానట్టున్నదే!’’ అని కొందరనె. ‘‘చీకటి పడ్డంక కావలుండేందుకు కోతలు గిట్లయ్యె కాలమాన్ర? అనొకడు లా పాయింటు గుంజె. ముచ్చట అట్లిట్ల ఇంట్ల దాక రానే వచ్చె. గీయవ్వారమెట్లో వున్నదని అనుమానం తోని ‘‘ఏంది సంగతి? ఏందేందో ఇనవడబట్టె ? అని ఇంటామె అడిగెట్యాలకు గాపొద్దు పొట్టుపొట్టు లొల్లయిందట. నాలుగు దంచిండట సూత కోపమచ్చి. ఆమె వూకుంటాదా! అలిగి తల్లిగారింటికి బొయి తోడబుట్టినోల్లందరికి ఫిర్యాదైందట. ఛల్‌ ! ‌గిదేంది కత అని మంటరమంటర బామ్మార్ధులచ్చి బావకు జర గట్టిగనే మైలపోలు తీషిండ్లు.
‘‘గాలికి బోయే కంప లాగుకు తగిలించుకున్నట్టున్నది’’. వున్న రొండెకురాలేందో దున్నుక బతికెటోన్ని.కులపోళ్ళ మాటలిని సర్పంచ్‌ ఎలచ్చన్ల దిగితిని, ఓడినా పీడబోవు! గెలుసుడే నా గండానికచ్చింది.’’ అని సర్పంచ్‌ ‌బాధ పడబట్టె. వున్న బంగారమంత గిరివి పెట్టిన్నని పెళ్ళాం అలిగి తల్లి గారిం
టికి పోయె. బామ్మార్ధులచ్చి మైలపోలు తీషిండ్లని వూరంత తెల్షిపాయె. ఇజ్జతేమున్నదింక. ‘‘గవ్వ రాకిడి లేదు, ఘడియ రికాంలేదు’’. రాత్రిపూట పక్కల పంటె సూత మొక్కలే యాదికి రాబట్టె. రాత్రి గిట్లొరుగుతామంటె గుబులు కాబట్టె! పొద్దంత కాలువలు పొంటె తిరుగుడైతాండె. చీకటి పడంగనె బుక్కె
డంత తిని, వూరంత తిరిగి, మొక్కలు లెక్కబెట్టి వాటిసంగతి అర్సుకునే సరికె తెల్లారబట్టె. పంచాయితీ ఆఫీస్‌ ‌కాడ్నుంచి బస్టాండ్‌ ‌దాంక రోడ్డు పక్కల పెట్టిన మొక్కలన్ని పైలంగ జూసుకోవాలె. బొడ్రాయి కాడ పెట్టిన యాప మస్త్ ‌పైలంగ జూసుకోవాలె. గుట్ట దిక్కు బెట్టినయే ఎండుకపోబట్టినయి. పొద్దుకు నాలుగు మలుకల నీల్లు పొయిండ్రా వారీ అంటే బట్టెబాజిగాండ్లు పోషినమని ఒట్టి ముచ్చట్లు జెపుతరు. గుడి కమాను కాడి మొక్కలన్ని యాకయ్య గాని మేకల మంద మేషినయట. జూడబోతె ఒక్క మొక్కలేదాడ. యాకయ్య గానికి మొన్ననె పదివేల జుల్మానేషినా బుద్దిరాలే. థూ..నీ యవ్వ! ఏం బతుకిది! ఎట్టి బతుకైంది..పంచాయితీ పని తీరు మీద నిగ్రాని కోసం ఓ బుడ్డర పటేలాసోంటి గ్రామ స్పెషలాఫీసర్‌ ‌సారు కొత్తంగచ్చిండు. దేనికి వంకలు బెట్టుడు తప్ప ఇంకో పన్లేదాసారుకు. ఆ సార్‌ ‌గిట్ల కోపం జేషి రిపోర్ట్ ‌గీకి పెట్టిండంటె సర్పంచ్‌ ‌పదవి వూసుడే. పైనుంచి కలెక్టర్‌ ‌సార్లు సూతచ్చి సూషి రిపోర్ట్ ‌రాసుక పోతరట దేముడా! ఏందిది! ‘‘దుఃఖం లేనోడు బర్రెను కొన్నట్టున్నది’’ సర్పంచెన్నికల్ల అవ్వల్‌ ‌మెజారిటీతోని గెలిషిన సంబురమే లేదు. పంచాయితీ ఆఫీసుల సర్పంచంటె గౌరవమేలేదు. కొత్తల ముచ్చటసలే గతి లేదు. పంచాయితీ ఆఫీసుల కూసుందామంటే కుర్చీలు సూత లేవు. మోరి గద్దెల మీద కూసునుడైతాంది. వాడలన్నీ వాసన రాబట్టె. మోరీలు తీయమంటె సఫోయోళ్ళ జవాన్‌ ఏడింటాండు! వాళ్ళకు సంవత్సరం సంది రూపాయి జీతం సూత రాకపాయె. ‘‘పాతబాకీ జీతాలియ్యుండ్లి ముందుగాల!’’అని వుల్టా అడుగబట్టె. సర్పంచ్‌ ‌జీతమే రాలకపాయె! ఇంక మీయెక్కడ తేవాలె? మోరీలు సాఫ్‌ ‌జేయకుంటె నీళ్ళు నిలిషి డెంగీ, మలేరియా, రోగాలచ్చే దోమలుమోపుగాబట్టె. మోరీలన్ని గలీజ్‌ ‌పాడువడ్డయని గుబులు గాబట్టె. కార్యదర్శికి ఫోన్‌ ‌గొడితె ఎత్తడాయె. మనిషేమో చిక్కడు, దొరకుడు.
ఊర్లె ఇంటింటికి జరాలచ్చె. ఊరి దావఖాన్ల మందులు కరువాయె, డాక్టర్లెప్పుడత్తరో ఎవరికెరుకైతలేదు. గోలి మందులిచ్చేందుకు కనీసం నర్స్ ‌సూత గతిలేదు. పట్నం పోదామంటె యూత్‌ ‌రోడ్డంత నాట్లేషి పేసుబుక్కుల పోటోలేసుకుంటాండ్లు. నుల్క మంచంమీద పుట్టెడు జరంతోని పన్నోళ్ళను పల్కరించేందుకు ఒక్క లీడరన్న రాకపాయె! పెద్ద పెద్ద ఆపీసర్లు కార్లల్ల రాబట్టె. పోలీసోళ్ళు, ఫారెస్టోల్లు సూత ఎనుకబడత్తాండ్లు. మొత్తం పెట్టిన మొక్కలెన్ని? పొయిన శుక్లారం నుంచి ఇయ్యాటికి ఎంత పొడుగు పెరిగినయి? ఎన్ని కొత్త కొమ్మ లేషినయి? రోజు పొద్దటి సంది సాయంత్రం దాక ఎన్ని బిందెల నీళ్ళు పోత్తాండ్లు? ఏ మొక్కలు ఎన్నెండి పోతానయి? ఏ వార్డు లెన్ని మొక్కలు ఎండుక పొయినయి? మేకలు తిన్నయెన్ని? గొర్రెలు తిన్నయెన్ని? బర్లు తొక్కితె సచ్చినయెన్ని? మొక్కలకు పోసే నీళ్ళను ఇంట్ల వాడుకున్న్నోళ్ళ మీద ఎన్ని కేసులు బుక్కయినయి? యాప మొక్క ఆకులెందుకు బలంగా కానత్తలేవో అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్ ‌పెట్టి పైఆపీసర్లతోని చర్చలు చేయబట్టిండ్లు. గామొక్కలు తిన్న మేకల యజమానులందరికి జుల్మానా, అవి కట్టశాతకాకుంటె వారిని అరెస్ట్ ‌చేసుడు. వారానికో పారి రిపోర్ట్ ‌రాసి సర్పంచ్‌ ‌సంతకం తీస్కునుడు. జోరుగున్నది కత! పెద్దాఫీసర్లచ్చిండ్లు కదా అని వూర్లె జరాలు, రోగాల గురించి చెప్పబోతె గింత సూత పట్టించుకోకపాయె. ఊర్లె ఆఫీసర్లచ్చి తిరిగిన రోజే గొల్లోల్ల యాదిగాడు పాము గుట్టి గిలగిల లాడె. వూర్లె దావఖాన కేసుకపోతే పాము సూదిమందేడిది? లేదుపో! అన్నదా డాక్టరమ్మ. కండ్లముందే యాదిగాని పాణంబాయె. వచ్చిన ఆఫీసర్లమో ‘‘యాభయి దాంక మొక్కలు చచ్చినయి, వాటీస్‌ ‌దిస్‌? ‌నాన్సెన్స్..‌మొదటి వారంలనే ఫెయిలయినవు. ఇది 30 రోజుల ప్రోగ్రాం. మిగతా ఏం మానిటరింగ్‌ ‌చేస్తానవు’’? అని విలేజ్‌ ‌మానిటరింగ్‌ ఆఫీసర్‌ను చెడ్డరమడ్డర తిట్టబట్టె. చెట్లకు నీళ్ళుపోషేందుకు పొయిన యాదిగాన్ని పాము కర్షిందట సొర్‌! అనంగనె ఇంతెత్తు ఎగిరిన అఫీసర్‌ ‌సారు ‘‘ఇంత సీరియస్‌గ మొక్కల గురించి మాట్లాడుతాంటే పాము కర్శిందన్న విషయం చెపుతున్నవు యూ ! ఫూల్‌ ! ‌మొక్కలు బతుకుడెంత ముఖ్యమో తెల్వదా? రోజు మొక్కలకు ఫై టైం నీళ్ళుపోయండి? మళ్ళచ్చే వారానికి మొక్కల లెక్క బరాబరుండాలె. వస్తం!’’ అని కార్లెక్కె. కారెనుక కారు పదికార్లచ్చి పాయె. లెక్క జూస్తె పెట్టిన మొక్కలల్ల సగమే బతికినయి. సర్పంచ్‌ ‌పోస్ట్ ‌పోవుడు ఖాయమైటట్టున్నది. మరి మనుషుల పాణాలే పోబట్టె! గీ సర్పంచ్‌ ‌పదవో లెక్కనా! వారంల ఎనిమిది మంది దాక జరాలతోని సచ్చె! ఎండే మొక్కలను అర్సుకోవాల్నా? సచ్చే మనుషులను కాపాడు కోవాల్నా? మనుషుల పాణాలు మొక్కలపాటి ఇలువ జేయావా ఏంది? అని బాధవడుకుంట సర్పంచ్‌ ‌మోరి గద్దె మీద కూలబడ్డడు.
సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్ ! ఇం‌టివి కదా! ఏంజేయాల్నో తెల్వక మోరి మీద కూసున్న సర్పంచ్‌ ‌నీగ్గిట్ల ఫోన్‌ ‌కొడ్తే ఏం సమ్జాయిస్తవో జర చెప్పాలె? అనడిగె భేతాళ్‌. ‘‘ఊర్లకూర్లు జరాల్‌, ‌రోగాలతోని మంచమెక్కె. సావుల సంఖె పెరుగుతాందని తెలిషి సూత, గామాభివృధ్ధి పేరిట 30 రోజుల పోగ్రాం కొత్త బాగోతమాడుడే! రోగాలత్తె సూదిమందు దిక్కులేదు కని, మొక్కలు సస్తే నౌఖర్లు వూడగొడ్తనన్నడు కద! మరి రోగాలచ్చి మనుషులు చస్తే ఎవరి
నౌఖర్లూడ గొట్టాలె? అని జనం మర్లబడుడొక్కటే మిగిలిందని జెప్త’’. అని మనుసులనే అనుకొని ఇక్రమార్కుడు నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు.
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy