వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర … ప్రభుత్వాల అండదండ

December 3, 2019

ఫోటో: రాజ్‌భవన్‌లో వికలాంగులను ఆత్మీయంగా పలకరించిన గవర్నర్‌ ‌తమిళ సైసౌందర రాజన్‌
ఫోటో: రాజ్‌భవన్‌లో వికలాంగులను ఆత్మీయంగా పలకరించిన గవర్నర్‌ ‌తమిళ సైసౌందర రాజన్‌

రాజ్‌భవన్‌లో దివ్యాంగుల దినోత్సవం

రాష్ట్రంలో దివ్యాంగులకు రూ. 3,016 పిం ఛను ఇస్తున్న ఒకేఒక రాష్ట్రం :గవర్నర్‌
అం‌తర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌వికలాంగులను ఆత్మీయంగా పలకరించారు. వారి యోగ క్షేమాలు తెలుసుకున్న గవర్నర్‌ ఈ ‌సందర్భంగా మాట్లాడారు. దివ్యాంగులకు కేంద్రం అన్ని విధాల అండగా నిలుస్తుందని గవర్నర్‌ ‌తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్రం విశేషంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా గవర్నర్‌ ‌పేర్కొన్నారు. అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆమె అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు 3,016 రూపాయల ఫించను అందిస్తుందని గవర్నర్‌ ‌పేర్కొన్నారు. ఇంకా వారికి ప్రత్యేకంగా చాలా రాయితీలు అమలు చేస్తుందని గవర్నర్‌ ‌తమిళిసై తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌వికలాంగులనుద్ధేశించి.. రు మానసికంగా దృఢంగా ఉండాలనీ, వికలత్వం ఉందని భాద
పడకూడదని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారికి రాజ్‌ ‌భవన్‌ ‌సిబ్బంది పండ్లు, అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ‌తో పాటు, కార్యాలయ సిబ్బంది, భారీ సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు పెన్షన్‌ ‌పెంచిన ఘనత కెసిఆర్‌ది
మంత్రి మహ్మూద్‌ అలీ
సీఎం కేసీఆర్‌ ‌దివ్యాంగుల కొరకు అనేక కార్యక్రమాలు చేపడుతు న్నారని •ం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో అద్భుతంగా జరిగాయి. కార్యక్రమానికి మంత్రులు మహామూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌ ‌హజరయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల పెన్షన్‌ ‌రూ. 3,016కు పెంచామని మంత్రి అన్నారు. దివ్యాంగులకు అందరూ అండగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ‌దివ్యాంగులకు చేసిన సేవలకు గాను ఆయనకు అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్జీఓలకు, దివ్యాంగులకు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలియజేశారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి తెలిపారు. వారికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం 4 శాతం, అన్ని పథకాల్లోనూ 5 శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నట్లు మంత్రి అన్నారు. దివ్యాంగ యువతీ యువకులకు స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ప్రోగ్రాం ప్రారంభించి, ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు, సెక్రటరీ జగదీశ్వర్‌, ‌వికలాంగుల డైరెక్టర్‌ ‌శైలజ తదితరులు పాల్గొన్నారు.
నెక్లెస్‌ ‌రోడ్డులో దివ్యాంగుల అవగాహనా వాక్‌  ‌జెండా ఊపి ప్రారంభించిన స్పీకర్‌ ‌పోచారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నెక్లెస్‌ ‌రోడ్‌లోఅవగాహన నడక కార్యక్రమాన్ని చేపట్టారు. వికలాంగుల హక్కుల వేదిక, జీహెచ్‌ఎం‌సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ‌మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌డిప్యూటీ మేయర్‌ ‌బాబా ఫసీయుద్దీన్‌, ‌కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, దివ్యాంగుల జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, దివ్యాంగ హక్కుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్‌, ‌డిప్యూటీ కమిషనర్‌ ‌పట్నాయక్‌ ‌తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.