Take a fresh look at your lifestyle.

దిల్లీ దూర్ హై ..!

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చం దంగా ఉంది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పరిస్థితి. రాష్ట్రంలో కమలం వికసించడానికి కావ ల్సినంత స్కోప్‌ ఉన్నప్పటికీ… పార్టీ ఎదగడానికి కావల్సినన్ని వనరులూ ఉన్నాయి. పార్టీ పటిష్టతకు విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబివిపి, బిఎంఎస్‌ ‌వంటి అనుబంధ సంఘాలే కాకుండా అనేక ధార్మిక సంస్థలు, హిందూ వాహిని సంస్థలు అండగా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఏ పార్టీకి లేనంతగా ఒక భారతీయ జనతా పార్టీకి ఎదగడానికి అనేక మార్గాలున్నాయి. కానీ, రాష్ట్రంలో కమలం వికసించాల్సినంతగా విక సించిన దాఖలాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు.పార్టీలో నరేంద్రమోదీ, అమిత్‌ ‌షా ద్వయం వచ్చాక… దేశ పగ్గాలతో పాటు, దేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరవేస్తూ వస్తున్నారు. కానీ, తెలంగాణకు వచ్చే సరికి ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో కాషాయ జెండాను ఎగర వేయడం మాటుంచితే…ఇప్పుడున్న 5 ఎమ్మెల్యే స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడమే కష్టంగా ఉందనీ ‘ప్రజాతంత్ర న్యూస్‌ ‌నెట్‌వర్క్’ ‌నిర్వహించిన సర్వేల తో పాటు కేంద్ర నిఘా వర్గాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ (ఒక భువనగిరిలో మాత్రం యువ ఇంటి పార్టీ నాయ కుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి) చేస్తున్నది.

ఉత్తర భారతంలో జోష్‌ ‌మీద ఉన్న కమలం… దక్షిణ భారతంలోనూ వికసించాలనీ మోదీ, షా ద్వయం ఉవ్విళ్లూరుతున్నది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తెలంగాణ గడ్డపై కాషాయజెండాను ఎగరవేయా లనీ ఎన్నో కలలు కన్నారు. కానీ, మోదీ, షా కలల్ని రాష్ట్ర నాయకులు కలగానే చేస్తున్నారనీ తాజా పరిణామాలు తేట తెల్లం చేస్తున్నాయి. ‘ఒక వోటు-రెండు రాష్ట్రాలు’ అని బిజెపి నినదిం చింది మొదలుకుని ఇప్పటి వరకు కేంద్రంలో దశాబ్దంకు పైగా కేంద్రంలో అధికారంలో ఉంది. గతంలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పొత్తు పుణ్యమా అని కరీం నగర్‌, ‌మెదక్‌, ‌సికింద్రాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌మల్కాజిగిరి, హన్మంకొండ తదితర ఎంపి స్థానా లను కూడా బిజెపి కైవసం చేసుకుంది. గత సార్వత్రిక ఎన్నికలలోనూ తెలుగుదేశం పొత్తు పుణ్యంగానే సికింద్రాబాద్‌ ‌లోక్‌సభ స్థానం, 5 ఎమ్మెల్యేలను గెలుచుకున్న బిజెపి రాష్ట్ర శాఖ… పార్టీ రాష్ట్రంలో ఎదగడానికి పెట్టాల్సిన దృష్టిని ఏ మాత్రం పెట్టకపోగా… బిజెపి పార్టీ అంటే హైదరాబాద్‌ ‌వరకే పరిమితం అన్నట్లుగా గడిచిన కొన్నేండ్ల పార్టీ చరిత్రను బట్టి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యావత్‌ ‌దేశం మొత్తంలో ఒక రోజు కషాయ జెండాను రెపరెపలాడించాలని మోదీ, అమిత్‌ ‌షా ద్వయం చేయని ప్రయత్నం అంటూ లేదు. అది అక్రమ మార్గమా? సక్రమ మార్గమా? అని తేడా లేకుండా…మోదీ, షా ఇద్దరూ అన్ని రాష్ట్రాలలో కాషాయ జెండాను ఎగరవేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

తెలంగాణలోనూ కాషాయజెండాను ఎగరవేయడం కోసం గత కొన్ని నెలలుగా ప్రత్యేక దృష్టిని పెట్టారు. పార్టీ పటిష్టతకు కావల్సిన అన్ని వనరులను సమకూరుస్తున్నారు. రాష్ట్రంలో బిజెపిని ఎదగడం కోసం మోదీ, అమిత్‌షా ఎన్ని చేయాలో అన్ని చేశారు. చేస్తున్నారు కూడా. కానీ, ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తున్నది. పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులలో కొందరు తాము ఎమ్మెల్యేలుగా గెలిస్తే చాలూ…మిగతా ప్రాంతంలో పార్టీ ఉన్నా ఒక్కటే. లేకున్నా ఒక్కటే అన్న భావంలో ఉండి హైదరాబాద్‌ను దాటి పల్లెలు, జిల్లాలు, మండలాలకు రాలేకపోయారు. ఫలితం కమలం వికసించాల్సినంతగా వికసించడం లేదు. నేతల తీరు వల్ల కమలం మసకబారుతూ వాడిపోయే ప్రమాదంలో ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాషాయజెండాను ఎగరవేయడమే ఏకైక )క్ష్యంగా 119 అసెంబ్లీ స్థానాలలోనైతే బిజెపి పోటీ చేస్తుంది. కానీ, గెలిచే స్థానాలు, వోట్ల శాతం మాత్రం చాలా గణనీయంగా పడిపోయినట్లు చేసిన సర్వేలు, కేంద్ర నిఘా వర్గాలు బహిర్గతం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో బిజెపికి గరిష్టంగా 11శాతం మాత్రమే వోట్లు లభించే అవకాశం ఉందనీ, ఈ వోట్ల శాతంను బట్టి ఎమ్మెల్యేల సంఖ్య 5 నుంచి 3కు పడిపోయిన ఆశ్చర్యం లేదనీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలో మోదీ వచ్చాక పేద ప్రజల నడ్డీ విరిచే ఒక మాటలో చెప్పాలంటే పేదల బతుకులను ఆర్థికంగా చిన్నా భిన్నం చేసేటు వంటి పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలతో ఇప్పటికే పేద ప్రజలు కోలుకోవడం లేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికలలో పేదల నడ్డీ విరిచిన పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ గురించి ఏ రాజకీయ పార్టీలో చర్చ జరగడం లేదు.

ప్రజలూ ఈ విషయాలనే ప్రస్తావించడం లేదు. ఈ రెండు నిర్ణయాలను గనుక ప్రజలు ప్రస్తావించినా, తమకు జరిగిన ఇబ్బందులను గుర్తుపెట్టుకున్నా…బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. విచిత్రమమేమిటంటే ప్రజలెవరూ పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ గురించి మాట మాత్రం కూడా ప్రస్తావన చేయడం లేదు. ఇది, బిజెపికి కలిసి వచ్చిన పెద్ద అదృష్టంగానే చెప్పాలి. మరోవైపు చూస్తే.. ప్రస్తుతం కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. అంగబలం, ఆర్థిక బలానికి కొదవనే లేదు. రాష్ట్ర నాయకులకు ఎలాంటి ‘సాయం’ కావాలన్నా కేంద్రం చేయడానికి సిద్ధంగా ఉంది. అయినా, రాష్ట్ర నాయకత్వం ప్రజల ఆదరణను చూరగొనకపోవడం పూర్తిగా రాష్ట్ర నాయకత్వం వైఫల్యంగా చెప్పాలి. ఓ వైపు దేశంలో మోదీ, అమిత్‌షా ద్వయం విజయదుందింబిని మోగిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బిజెపి పార్టీ తన అస్థిరత్వాన్ని కోల్పోయే అంచున ఉన్నట్లు తాజా సర్వే వివరాలు, కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీలో సీఎం సీటులో కూర్చోవడానికి మ్యాజిక్‌ ‌ఫిగరైన 60 సంఖ్యకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బహుత్‌ ‌దూర్‌మే ఉన్నట్లు చెప్పాలి. దీనికి అంతటి కారణం రాష్ట్ర నాయకత్వమే ఏకైక కారణమనీ, నాయకత్వ లోపమే అన్ని విధాలుగా వనరులు, అర్థిక బలం, అంగబలం, మద్దతు ఉన్నప్పటికీ బిజెపి ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్యను కాపాడుకోలేకపోతుంది! అయితే, మేజిక్‌లు చేసే మోదీ, షా ద్వయం తెలంగాణలో మ్యాజిక్‌ ‌ఫిగర్‌కు ఎలాంటి మేజిక్‌ ‌చేస్తారో చూడాలి మరి!

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!