Take a fresh look at your lifestyle.

దాష్టీకం

రాత్రంతా
చిట్టి చేతులతో
అమ్మను
తడిమి తడిమి
బోసి నవ్వులతో
బోలెడు కబుర్లు

రవికను ఒక చేత్తో
పవిటను మరో చేత్తో
తొలగించాలనే ప్రయత్నంలో
అమ్మ చనుబాలతో
ఆకలితీర్చుకుంటూ
ఎన్నెన్నో ఆటలు

కన్నులు
మూతలు పడుతుండగా
మధ్య మధ్యలో ఉలిక్కిపాటు
అమ్మ ఉందొ లేదోనని
చనులపైన చిట్టి చేతులు
తారాడుతూ భరోసాగా
మగత నిద్రలో

అర్ధరాత్రి
మానవమృగాల వేట
డేగల సంచారం
తల్లి పొత్తిళ్లనుండి
చిట్టితల్లిని ఎత్తుకెళ్లిన
ఓ మానవ మృగం

అమ్మ స్పర్శ
దూరమయ్యేసరికిజి
తల్లడిల్లిన బంగారు తల్లి
కెవ్వుమన్న కేక రాకుండా
ఆదిమిపట్టి
మర్మాంగంపై మానవ
మృగం దాడి

అమ్మా! అమ్మా!!
అంటున్న
అరణ్యరోదనలోనే
చిన్నారిని చిదిమేశాడు
చీమను నలిపేసినట్టు

మామిడి పిందెను
కొరికి నమిలి ఊసినట్లు
మాటలే రాని
బోసి నవ్వుల
బంగారు తల్లిని
గొంతు నులిమాడు

వెంపలి చెట్లకు
నిచ్చెనల వలయం
పాపం పుణ్యంలో
పాపిష్టి దాస్టీకం
పసికూనలపై పాశవికం

ఇప్పుడు
మనం ఎక్కడున్నాం?
మానవ సమాజంలోనా?
ఆటవిక లోకంలోనా?
ఎంత అనాగరికం
ఏమిటీ వైపరీత్యం
చుట్టూ వైతరని నదీ ప్రవహమేనా?

– కట్టెకోల చిన నరసయ్య
జర్నలిస్ట్
9951260316

(‌హన్మకొండలో 9నెలల చిన్నారిని కామాంధుడు ప్రవీణ్‌ ఎత్తుకెళ్ళి చిదిమేసిన దారుణ సంఘటనకు స్పందన)

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy