Take a fresh look at your lifestyle.

దాతల సేవలు మరువలేనివి

సూర్యాపేట, మే 5, ప్రజాతంత్ర ప్రతినిధి) : పేదలను ఆదుకోవడంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందు ఉండాలని జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌డి. సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ‌కార్యాలయం నందు పది మంది హిజ్రా లకు బియ్యం, నిత్యావసర వస్తువులను ఎన్నారై జిల్లా కో ఆర్డినేటర్‌ ‌యానాల వెంకటరెడ్డి, స్టేట్‌ ‌కోఆర్డినేటర్‌ ‌సుధీర్‌లతో కలిసి వారికి అందజేశా రు. కార్యక్రమంలో జెడ్పిసిఈఓ విజయలక్ష్మి, పర్యవేక్షలు రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో…
ఖమ్మం అర్బన్‌,  ‌మే 5  (ప్రజాతంత్ర విలేకరి) : కరనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అములు అవుతున్న నేపధ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న 600 పేద కుటుంబాలకు మంగళవారం నిత్యా వసరాలను పంపిణీ చేసారు. 43వ డివిజన్‌లోని మౌంట్‌ఫోర్టు పాఠశాలలో జరిగిన ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిధిలుగా పువ్వాడ నాగేశ్వరరా వు, మేయర్‌ ‌గుగులోతు పాపాలాల్‌, ఎఎం‌సి మాజీ అధ్యక్షులు ఆర్జెసి కిష్ణ, 3 టౌన్‌ ‌సిఐ శ్రీధర్‌, ‌పాఠశాల ప్రధానోపాద్యాయులు హాజరయ్యారు. కరోనా వారియర్స్‌గా నిర్విరామంగా కృషి చేస్తున్న పోలీసు సిబ్బంది, వైద్య,పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ పోలీస్‌ ‌సిబ్బంది విశిష్ట సేవలకుగాను సిఐ శ్రీధర్‌పై పూలవర్షాన్ని కురి పించి హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఈ కార్యక్ర మంలో 43వ డివిజన్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌నాయకులు దండగల రాంబాబు, వెల్లంపల్లి వెంకటసుబ్బా రావు, పోతురాజు బాల, వెంపటి నాగేశ్వరరావు నాయుడు,కర్నాటి సాయి, ఏపూరి రాధిక, వెంపటి లత, మదు, నాగరాజు, చిన్న తదితరులు  పాల్గొన్నారు. 43వ డివిజన్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున ఈ వితరణ చేసినట్లు చెప్పారు..

సూర్యాపేటలో…
సూర్యాపేట, మే 5 ప్రజాతంత్ర ప్రతినిధి): పేదల కు నిత్యావసర వస్తువులు, దుస్తువులు సుమారు 80కుటుంబాలకు, మానసిక వికలాంగుల కేంద్రానికి క్వింటా బియ్యం, రెండు కూలర్లు జిల్లా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్‌ ‌సంక్షేమ ఆరై శ్రీనివాస్‌, ఎం‌పిఓ నర్సింహారావులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపధ్యంలో నిత్యావసర సరుకులు అందక ఇబ్బం ది పడుతున్న పేద వారు, మానసిక వికలాంగుల కు, వృద్దులకు, నిరాశ్రయులకు నిత్యావసర వస్తు వులను అందించి జిల్లా ఎస్పి సేవ గుణం చాటు కున్నారని కొనియాడారు.

రామన్నపేటలో…
రామన్నపేట, మే5(ప్రజాతంత్ర విలేకరి) కరోనా వైరస్‌తో లాక్‌ ‌డౌన్‌ ‌పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడం అభినందనీయమని స్థానిక ఎస్‌ఐ ‌సిహెచ్‌ ‌సాయిలు, నిర్నేముల సర్పంచ్‌ ‌ముత్యాల సుజాతరవి అన్నారు. మంగళవారం గ్రామ పంచాయితీ ఆవరణలో సర్పంచ్‌ ‌సుజాతరవి అధ్యక్షతన క్రీ,శే బద్దం వరమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు బద్దం నారాయణరెడ్డి ఆర్థికసహాయం తో కూతురు ఫైళ్ళ పద్మజాశేఖర్‌ ‌రెడ్డి, బందువులు సతీష్‌ ‌రెడ్డి, నిరంజన్‌ ‌రెడ్డి గ్రామంలోని నిరుపే దలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఊసర్పంచ్‌ ‌చల్ల అనితసత్యప్రకాశ్‌, ‌రాంరెడ్డి, లింగస్వామి పాల్గొన్నారు.

భూదాన్‌ ‌పోచంపల్లిలో…
భూదాన్‌ ‌పోచంపల్లి,మే5,(ప్రజాతంత్ర విలేకరి) కరోన వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్కుల ను తప్పనిసరిగా ధరించాలని రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మైల శ్రీశైలం అన్నారు. మంగ ళవారం భూదాన్‌ ‌పోచంపల్లి మండల పరిధిలోని రామలింగంపల్లి గ్రామంలో మైల శ్రీశైలం ఆధ్వ ర్యంలో హమాలీ కూలీలకు, రైతులకు మాస్కుల ను, పండ్లను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ‌రాములు నాయక్‌, ఉపసర్పంచ్‌ ‌మండల నరసింహ, వార్డు సభ్యులు బంటు నరసింహ,మైల మంజుల బీరప్ప, మంచాల హరికృష్ణ, నాయకులు మైల మల్లేష్‌, ‌బండారి ప్రభు, గంగాదేవి బాలకృష్ణ, రమావత్‌ ‌రాజు, బంటు మహేష్‌, ‌లింగస్వామి, విజయేందర్‌ ‌రెడ్డి,మైల సుధాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో…
వలిగొండ,మే5(ప్రజాతంత్ర విలేకరి) టిఆర్‌ఎస్‌ ‌పట్టణ అధ్యక్షుడు అయిటి పాముల రవీంద్ర సౌజన్యంతో మంగళవారం మండల కేంద్రంలో ని ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడు తూ కరోనా నియంత్రణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆశ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి పలుసం రమేష్‌, ‌పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌సురకంటి వెంకట్‌ ‌రెడ్డి, మామిళ్ల రత్నయ్య సుంకోజు చంద్రమౌళి బాల గోని లక్ష్మీనారాయణ కన్నెగంటి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు

గరిడేపల్లిలో…
గరిడేపల్లి, మే 5(ప్రజాతంత్ర విలేకరి) : మండ లంలోని పోనుగోడు గ్రామంలోని గ్రంధాలయం వద్ద లాక్‌డౌన్‌ ‌కారణంగా అనేకమంది పేదలు ఇండ్లకే పరిమితమై ఎలాంటి పనుల్లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు చందా మోహన్‌రెడ్డి విజయ కుమార్తెలు స్వప్నరెడ్డి, ఇందురెడ్డిలు ఇచ్చి న బియ్యాన్ని చందా విజయ మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ ‌మండలాధ్యక్షులు జోగు అరవింద్‌రెడ్డి, సర్పంచ్‌ ఆదూరి పద్మ కోటయ్య, ఎంపీటీసీ-2 మెళ్ళచెరు వు వెంకటరమణ, ఉపసర్పంచ్‌ ‌గండ్ర సైదిరెడ్డి, బత్తిని అంజయ్య, హరీష్‌, ‌రాచకొండ సందీప్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply