Take a fresh look at your lifestyle.

దంచికొడుతున్న వానలు.. సర్వం జలమయం

సుబేదారి, జూలై 22, (ప్రజాతంత్ర విలేకరి) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా వర్షాల వల్ల ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా మొత్తం తడిసి ముద్దయింది. నర్సంపేట, ములుగు, ఏటూర్‌ ‌నాగారం మహబూబాబాద్‌, ‌జనగామ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు సమాచారం. అయితే గ్రామీణ ప్రాంతాల రాక పోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరం ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతానికి వెళ్లే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు పరీక్షల కోసం వచ్చిన విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షలు నిర్వహిస్తుండగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా నుండి నగరానికి వస్తున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండే భారీ వర్షం కురవడంతో విద్యార్థులు నగరానికి రావడానికి ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా వ్యాప్తంగా చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. రహదారులన్నీ జలమయంతో నిండిపోయి రాకపోకలకు అనేక ఇబ్బం దులు ఎదురయ్యాయి.వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు కాలినడకన పోయె ప్రజలు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం వర్తమానం పంపింది. మహబూబాద్‌, ‌ములుగు, జయ శంకర్‌ ‌భూపాలపల్లి, జనగామ జిల్లా కలెక్టర్లకు కూడా ప్రజలను అప్రమత్తం చేసే దిశగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రభుత్వంచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిం చింది. ఇందులో భాగంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా రెవెన్యూ అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా తగు చర్యలు చేపడుతున్నట్టు రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు,

జంటనగరాల్లో జలమయం:
హన్మకొండ, వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో లొతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మురుగునీటి పారుదల డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు నీరు అంతా రోడ్డుమీదికి రావడం వల్ల నగర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. సమ్మయ్య నగర్‌,  ‌హంటర్‌ ‌రోడ్డు, జూ పార్క్, ‌నయిమ్‌ ‌నగర్‌, ‌వరంగల్‌, ‌శివనగర్‌ ‌ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ప్రజలను అప్రమత్తం చేసే దిశగా నగరంలోని మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ అధికారులు కేవలం టోల్‌ ‌ఫ్రీ నెంబర్లు ఇప్పుడే తప్ప నెంబర్లకు ఫోన్‌ ‌చేసి చెప్తే పట్టించుకునే నాధుడే లేడు. కాజీపేట ప్రధాన రహదారి ఆర్‌ఇసి వద్ద పెద్ద ఎత్తున రోడ్డు మీదు నుండి వరద నీరు ప్రవహించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతే అయినప్పటికీ దీనికి శాశ్వత పరిష్కారం పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు నగర ప్రజలు ఆరోపించారు. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ అధికారులు ప్రాంతాలలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం ముఖ్యంగా హనుమకొండ నడిబొడ్డులో ని విద్యుత్‌ ‌నగర్‌ ‌ప్రాంతాలలో రోడ్లమీద నే వర్షం నీరు నిర్మాణం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రజలు వాహనదారులు ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే దీన్‌ ‌దయాల్‌ ‌నగర్‌ ‌ప్రాంతంలో పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రానున్న రోజులలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా కలెక్టర్‌ ‌రెవెన్యూ అధికారులు మున్సిపల్‌ ‌శాఖ సిబ్బంది లోతట్టు ప్రాంతాలకు వెళ్లి కావలిసిన తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply