వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

త్వరలోనే మహిళలందరికి ఉచిత వైద్య పరీక్షలు మీ ఆరోగ్యంలోనే… నా ఆనందం

August 28, 2019

దత్తత గ్రామం ఇబ్రహీంపూర్‌ ‌లో సామూహిక  గృహ ప్రవేశాల కార్యక్రమంలో హరీష్‌ ‌రావు

మీ ఆరోగ్యంలోనే… నా ఆనందం ఉంది.! మీరు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా కోరిక.! నా కోసం రోజున ఒక్క అరగంట సమయం ఇవ్వండి.! ప్రతి రోజూ పొద్దున్నే యోగ ప్రాణాయామం చేయండి.! మీకు అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ప్రతీ రోజు నేను చేస్తున్నా.. నేను చేయడం గొప్పతనం కాదని., నా ప్రజలు చేసి ఆరోగ్యంగా ఉండటమే తనకు కావాలని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ఇబ్రహీంపూర్‌ ‌ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియాకే ఆదర్శమై ప్రయోగ శిక్షణ కేంద్రంగా పేరొందిన
ఇబ్రహీంపూర్‌ ‌గ్రామం మరో సరికొత్త పరిపాలనకు సంకల్పించిందని., పలు కీలక సంస్కరణల ప్రారంభోత్సవాల వేడుకకు శ్రీకారం చుట్టిందని చెప్పుకొచ్చారు. సిద్ధిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలోని ఎమ్మెల్యే దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌ ‌లో గురువారం ఉదయం ముందుగా రూ.5లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ స్వాగత ముఖద్వారం, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులకు ఉదయం పూట టిఫిన్లు, సాయంత్రం పూట ట్యూషన్‌ ‌క్లాసులు చెప్పించే కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ప్రారంభోత్సవం చేశారు. రూ.1.25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌సామూహిక గృహా ప్రవేశాలు జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ.5లక్షల రూపాయల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రారంభించారు. ఆ తర్వాత రూ.15లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ ‌భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎస్సీ కాలనీలో నిర్మించనున్న డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గొర్రెల హాస్టల్‌ ‌ను సందర్శించారు. రూ.5లక్షల రూపాయల వ్యయంతో గ్రామ యువత కోసం ఓపెన్‌ ‌జిమ్‌ ‌ను ప్రారంభించారు. నాట్కో ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్‌ ‌క్యాంపును ప్రారంభించి, నాట్కో మొబైల్‌ ‌హెల్త్ ‌క్లినిక్‌ ‌వాహనంలో మెడిసిన్స్ ‌పరిశీలించి మెడికల్‌ ‌క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని అక్కడికి వచ్చిన గ్రామస్తులను కోరారు.ఆ తర్వాత గ్రామంలోని ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో రూ.35లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డైనింగ్‌ ‌హాల్‌, ‌కిచెన్‌ ‌రూమ్‌ ‌నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో ఏర్పాటు చేసిన సభ సమావేశంలో హరీశ్‌ ‌రావు మాట్లాడుతూ.. గ్రామం అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందంటే.. మీ ఇబ్రహీంపూర్‌ ‌ప్రజల గొప్పతనమని అభినందించారు. ఈ గ్రామానికి దేశంలోని, రాష్ట్రంలోని 23 వేల మంది ప్రతినిధులు వచ్చి చూసి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ, జాయింట్‌ ‌సెక్రెటరీలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, స్వచ్ఛ కార్యక్రమాలను చూసి నేర్చుకున్నారు. గొర్ల షెడ్లు నిర్మించుకున్న 41 మందికి త్వరలోనే వర్మీ కంపోస్టు పిట్స్ ‌ప్రారంభం చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని., నిఘా నీడలో ఇబ్రహీంపూర్‌ ‌గ్రామం ఉంటుందని దొంగలనే కాదు., గ్రామాన్ని పరిశుభ్రంగా నిలిపేలా, చెట్లను కాపాడేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని.. తన ఫోన్‌ ‌ద్వారా గ్రామాన్ని పరిశీలిస్తానని వివరించారు.
దోమలు, ఈగలను ఈ ఊరి పొలిమేరల్లో తరిమికొట్టిన గ్రామమని, ఈ వాన కాలంలో
గ్రామంలో ఒక్కరికి కూడా జ్వరాలు రాలేదని,
ఇబ్రహీంపూర్‌ ‌గ్రామంలో ఒక్కరికీ కూడా జ్వరం రాలేదని, టార్చిలైట్‌ ‌పెట్టి వెతికినా దోమలు, ఈగలు దొరకని పరిస్థితి ఈ గ్రామంలో ఉన్నదని, అలాగే గ్రామంలో ఇంటికో వేప చెట్టు నాటి సంరక్షించాలని, బర్రెలకు, ఆవులకు షెడ్లు నిర్మించి ఆ షెడ్ల నిర్వహణ బాధ్యతను గ్రామ మహిళా సంఘాలకు అప్పగిస్తామని., బర్రెలు, ఆవులకు ఏదైనా రోగమొస్తే.. పశు వైద్య అధికారి షెడ్లకు వచ్చి చూసి పోతారని, షెడ్డు కట్టి మెయింటెనెన్సు కోసం మహిళా సంఘాలకు అప్పగిస్తామని
సవివరంగా చెప్పుకొచ్చారు. పిల్లలను మంచిగ శ్రద్ధగా చదివించాలనే కోరిక తల్లితండ్రులకు ఉంటుందని, కానీ ప్రస్తుత కాలంలో పిల్లల చదువులు శ్రద్ధగా చదవలేకపోతున్నారంటూ.. తల్లితండ్రులు కూడా టీవీ సీరియల్స్ ‌లో నిమగ్నమై.. ఉంటున్న క్రమంలో తాను ఓ ఆలోచన చేశానని., ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు టిఫిన్‌ ‌పెట్టి సాయంత్రం పూట 4.30గంటల నుంచి 6.30గంటల వరకు అదనపు బోధన- ట్యూషన్స్ ‌చెప్పించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇందు కోసం ఈ ఊర్లోనే బీఈడీ చదివిన వారికి రూ.5వేల రూపాయలు జీతాలు ఇస్తూ వారిచే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ట్యూషన్లు చెప్పించనున్నట్లు పేర్కొన్నారు.
– నా మనస్సులో ఏమున్నదో చెబితే రూ.5116 బహుమానం
గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా చేయడానికి కావాల్సింది., నేను చేస్తానని.. కానీ నాకు మీ నుంచి ఓ కోరిక కోరుతున్నానని.. సభ సమావేశంలో పాల్గొన్న ప్రజల నుంచి తాను కోరే విషయాన్ని రాబాట్టేలా.. నా మనస్సులో ఏమున్నదో చెబితే బహుమానం ఇస్తానని తెలుపగా., పలువురు మద్యపాన నిషేధం., ఇతరత్రా అంశాలను చెప్పుకొచ్చారు. అంతలోనే భాగ్యమణి అనే మహిళ యోగ చేయాలని చెబుతావ్‌.. ‌సార్‌ అం‌టూ బదులు చెప్పడంతో అక్కడికక్కడే ఆమెకు రూ.5116 బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా యోగ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని, యోగ టీచర్‌ ‌ను తాను పంపిస్తామని, రోజున ఒక అరగంట సమయం తన కోసం ఇవ్వాలని కోరుతూ.. ప్రస్తుత కాలంలో మగవారు ఫోన్లు, ఆడవాళ్లు టీవీ సీరియల్స్ ‌లో బిజీగా మారిపోయారని ఆరోగ్యం పై శ్రద్ధ వహించాల్సిన అవశ్యకతను వివరించారు.
– సిద్ధిపేటలో మహిళలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు
సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలోని 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయస్సులో ఉన్న మహిళలకు బ్రెస్ట్ ‌క్యాన్సర్‌ ‌వస్తుందని, డాక్టర్‌ ‌రఘరామ్‌ ‌సహకారంతో సిద్ధిపేటలోని ఏఎన్‌ఎం, ఆశా వర్కర్స్ ‌లతో మహిళలందరికీ స్క్రీనింగ్‌ ‌చేస్తారని, మొదటి దశలోనే గుర్తిస్తే.. ఆ బ్రెస్ట్ ‌క్యాన్సర్‌ ‌బారిన పడే మహిళల ఆరోగ్యాన్ని కాపాడిన వారమవుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం మోడల్‌ ‌గా సిద్ధిపేట నుంచే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ ‌రఘురాం మాట్లాడుతూ.. గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వడమే ఆశీర్వాదంగా భావిస్తున్నానని, ఇక్కడ జరిగే కొత్త ఆలోచనలు దేశ వ్యాప్తంగా గర్వంగా, ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత మీ నాయకుడు హరీశ్‌ ‌రావు, సహకరించిన గ్రామ ప్రజలదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ట్యూషన్‌ ‌ఖర్చులు భరిస్తానని, గొర్రెల షెడ్ల తరహాలోనే పశువులకు హాస్టల్స్ ‌నిర్మాణంలో సహకరిస్తానని పేర్కొన్నారు. అనంతరం నాట్కో ఫార్మ సంస్థ ప్రతినిధి సదాశివరావు మాట్లాడుతూ.. ఈ గ్రామంలో 10సార్లు పర్యటించి ఇక్కడి విషయాలను నేర్చుకుని మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలోని తమ స్వంత గ్రామంలో ఈ గ్రామ తరహాలో మార్పు చేసుకున్నామని తెలిపారు. రోగాలు లేని గ్రామంగా ఇబ్రహీంపూర్‌ ఉం‌డటం అనిర్వచనీయమని చెప్పుకొచ్చారు. ఈ మేరకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌గృహా ప్రవేశాలు చేసిన అర్హులైన 10 మంది లబ్ధిదారులకు పట్టా పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్‌ ‌రఘురాం, నాట్కో ప్రతినిధి సదాశివరావులను శాలువతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, ఎంపీపీ బాలమల్లు, జెడ్పీటీసీ కుంబాల లక్ష్మీ, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.