Take a fresh look at your lifestyle.

త్యాగాల మట్టిలో అణు విధ్వంసానికి తావు లేదు

భూగర్భం నుంచి బయటకు తీసిన యురేనియం ప్రాణాంతకమైనదని యురేనియం అణుధార్మిక రసాయనిక మూలకంపై పరిశోధన చేసిన ప్రపంచ శాస్త్రవేత్తలే చెబుతున్నప్పుడు అనేక దురాగతమైన అనుభవాలు కండ్ల ముందే మెదిలాడుతున్నప్పుడు అభివృద్ది పేరిట యురేనియం వెలికితీయడం సమంజసమేనా.! మానవాళిని, జీవకోటిని కార్పొరేట్‌ ‌శక్తుల ప్రయోజనాల కోసం తా••ట్టుపెట్టడం అభివృద్దా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ది ప్రజలకోణంలో జరుగదా.? ప్రజాభిప్రాయానికి ప్రాముఖ్యత ఇవ్వరా.. ప్రభుత్వాలకు ఎవరి ప్రయోజనాలు ముఖ్యం.? ప్రజలవా.? కార్పోరేట్‌ ‌శక్తులవా.?

సకల జీవరాసులకు నిలయమై, విభిన్న రకాల జీవ వైవిధ్యతను కలిగి, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ అనేక రకాల చారిత్రక ఆనవాళ్ళను కలిగి హిమాలయాల తరువాత దక్షిణ భారత దేశంలో పవిత్రతను సంతరించుకున్న ప్రాంతం నల్లమల. నల్లమల తల్లిని రక్షించుకోవడంతో పాటు ఆ తల్లి ఒడిలో సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్న ఆదివాసుల, గిరిజనలు జీవితాలను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ విపత్కర పరిస్థితుల్లో బుద్ది జీవులైన ప్రతి ఒక్కరిపై ఉన్నది. సమాజ అభివృద్ది పరిణామ క్రమంలో అభివృద్ధి పేరి• ప్రతిసారి అధిక శాతం నిరాశ్రయులైతున్నవారు ఆదివాసులే. అట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునాసాగర్‌ ‌ప్రాజెక్టు నిర్మాణం కోసం, టైగర్‌ ‌రిజర్వ్ ‌ప్రాజెక్ట్ ‌కోసం, జంట నగరా) త్రాగునీటి కోసం తమ భూములను, పచ్చని పల్లెలను త్యాగం చేసిన త్యాగధనులు నల్లమల, నల్లగొండ ప్రజ)నేది చారిత్రక వాస్తవం. ఇలా పదే పదే నిరాశ్రయతకు గురౌతున్న క్రమంలో ప్రజలు తమ పోరాటానికి పదును పెట్టి దేశ అత్యున్నత శాసన వ్యవస్థ అయిన పార్లమెంట్‌ ‌ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం, వన్యమృగాల రక్షణ కోసం, ఆదివాసి  హక్కుల రక్షణ కోసం అనేక చట్టాలను రూపొందించుకోవడం జరిగింది.  ప్రజాపోరాటాల ఫలితంగా రూపొందించుకున్న చట్టాలను ఆ చట్టాల రూపకల్పనలో పాలుపంచుకున్న ప్రజా ప్రతినిధులే ఉల్లఘించడం పరిపాటిగా మారిపోయింది. అట్లాంటి చట్టాల ఉల్లంఘనకు గురయ్యే జాబితాలో నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేర్చబోతున్నాయి.

1945లో జపాన్‌లోని హిరోషిమా నాగసాకి నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లి వరకు ఏడు దశాబ్దాలుగా ఈ ప్రపంచంలో యురేనియం అణుధార్మికత మహమ్మారి భారిన పడుతున్న జీవకోటి లక్షల్లోనే అని అనేక శాస్త్రీయమైన నివేదికలు ఉన్నాయి.  ఇదే వరుస క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987,1995,2003,2005, 2006,2007,2009,2011, 2012 లలో యుసిఐఎల్‌ అనే ప్రభుత్వ సంస్థ, డిబీర్స్ అనే ప్రైవేట్‌ ‌సంస్థలు బంగారం, వజ్రాలు, యురేనియం వెలికితీతకు అనేకమార్లు నల్లమల లోని నాగార్జునాసాగర్‌, ‌పెద్దగట్టు, లంబాపూర్‌, ‌చింత్రియాల, అమరాబాద్‌ ‌వంటి ప్రాంతాలలో ప్రయత్నం చేసి అక్కడి ప్రజలు ప్రాణాలకు తెగించి చేసిన పోరాటంతో వెనుదిరిగినవి. సీమాంధ్రలో 2007లో మాత్రం రాజకీయ పార్టీల ప్రేక్షకపాత్ర వల్ల, పౌరసమాజం నిష్క్రియాశీలత వల్ల, కొంత ప్రజాఉద్యమం వైఫల్యం చెందడంతో ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండడంతో కడప జిల్లా తుమ్మలపల్లిలో యురేనియం ప్రాజెక్టు అవతరించింది. అక్కడ జరుగుతున్న నష్టాన్ని చూసిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం యురేనియం సంస్థకు షోకాజ్‌ ‌నోటీస్‌ ఇచ్చిన విషయం విధితమే.  2009,2010,2011,2012 లలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో యుసిఐఎల్‌ ‌సంస్థ నల్లమలలో సర్వే జరుపడానికి, యురేనియం శాంపిల్స్ ‌కోసం చేసిన ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో అక్కడి ఆదివాసి, గిరిజన ప్రజలతో కలిసి ప్రజాసంఘాలు, దాదాపుగా అన్ని పార్టీలు మరియు ఉద్యమ పార్టీగా ఉన్న తెరాస పోషించిన పాత్ర క్రియాశీలకమైనదే.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ అధికార వ్యామోహంతో జీవ వినాశకారి యురేనియం వెలికి తీయడానికి యథేచ్ఛగా అన్ని రకాల అనుమతులిస్తూ స్థబ్దంగా కేంద్ర ప్రభుత్వంతో మమేకమై రాజ్యాంగంలోని 21 అధికరణతో పాటు 15(4),16(4),16(4ఎ),46, 48/ఎ,51/ఎ/జి,243-డి,243-టి,244,335 మొదలగు అధికరణలతో పాటు 5,6వ షెడ్యూ ళ్ళను మరియు పెసా చట్టం, 1/70 చట్టం, వన్య ప్రాణి సంరక్షణ చట్టం (1972), సహజ వనరుల హక్కు చట్టం 1972, కేంద్ర కాలుష్య నియంత్రనమండలి చట్టం 1974, అడవుల సంరక్షణ చట్టం 1980, అటవీ పరిరక్షణ చట్టం 1980, అటవీ పర్యావరణ శాఖ 1985, ఎకోమార్క్ 1991, ‌పర్యావరణ ట్రిబ్యునల్‌ 1995, ‌జీవవైవిద్య చట్టం 2002, అటవీ హక్కుల చట్టం 2006 మరియు యల్‌టిఆర్‌ ‌చట్టంతో పాటు సమత జడ్జిమెంట్‌ను పాలకులుగా తమకేమి వర్తించనట్లు వాటిని ధిక్కరిస్తూ ముందుకు పోతున్నవి.

ఎన్నో ప్రజా ఉద్యమాల ఫలితంగా ఈ దేశపార్లమెంట్‌ ‌రూపొందించిన చట్టాలను ఉల్లంఘిస్తూ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా ప్రజా (యురేనియం) సమస్యపై ద్వంద్వం వైఖరిని అనుసరించడం వామపక్షాలు పార్టీలు మినహా మిగతా అన్ని పార్టీలకు ఆనవా యితీగా మారి పోయింది.  ఇందుకు మార్చి 9, 2006 లో యురేని యంపై అసెంబ్లీలో జరిగిన చర్చా రికార్డే అన్ని పార్టీల వైఖరికి సజీవ సాక్షం.

భూగర్భం నుంచి బయటకు తీసిన యురేనియం ప్రాణాం తకమైనదని యురే నియం అణ •ధార్మిక రసాయనిక మూల కంపై పరి శోధన చేసిన ప్రపంచ శాస్త్రవేత్తలే చెబు తున్నప్పుడు అనేక దురాగతమైన అనుభవాలు కండ్ల ముందే మెదిలాడుతున్నప్పుడు అభివృద్ది పేరిట యురేనియం వెలికితీయడం సమంజసమేనా.! మానవాళిని, జీవకోటిని కార్పొరేట్‌ ‌శక్తుల ప్రయోజనాల కోసం తా••ట్టుపెట్టడం అభివృద్దా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ది ప్రజలకోణంలో జరుగదా.? ప్రజాభిప్రాయానికి ప్రాముఖ్యత ఇవ్వరా.. ప్రభుత్వాలకు ఎవరి ప్రయోజనాలు ముఖ్యం.? ప్రజలవా.? కార్పోరేట్‌ ‌శక్తులవా.? చారిత్రక పరిణామాలన్ని చూస్తుంటే ప్రజల జీవించే హక్కును కాలరాస్తూ విధ్వంసక అభివృద్ధి నమూనాను రూపొందిస్తూ ప్రభుత్వాలు ముందుకుసాగుతున్నాయి.

ప్రపంచంలో అణుశక్తిని విరమించుకుంటున్న క్రమంలో పరిణతి చెందిన భారతీయ సమాజానికి యురేనియం వెలికితీత అవసరం లేదు.  అందుకే తెలంగాణ సమాజం అనేక ఉద్యమాల వెలుగులో చైతన్యవంతమై యురేనియం త్రవ్వకాలకు చోటివ్వకుండా నల్లమల, నల్లగొండ ప్రజానీకం ఉద్యమిస్తుంది. ఈ ఉద్యమానికి పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు, పత్రికలు, బుద్ధి జీవులు బాధిత ప్రజలకు మద్ధతుగా కదం తొక్కుతున్నారు.  ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌ ‌పార్టీ యురేనియంపై స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇప్పటికే కార్యక్షేత్రంలోకి ప్రవేశించి ప్రజాందోళనలో పాలుపంచుకుంటున్నవి.  పవన్‌ ‌కళ్యాణ్‌, ‌శేఖర్‌ ‌కమ్ముల, విజయ్‌ ‌దేవరకొండ లాంటి సినీ స్టార్లు నల్లమల ప్రజలకు మద్ధతుగా నిలుస్తున్నారు.

తెలంగాణ సమాజం యురేనియం వెలికితీయొద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికి అధికార తెరాస. పార్టీ నేడు నోరు మెదకపోవడం దారుణం. భవిష్యత్తు తరాలకు బంగారు తెలంగాణ అందిస్తామని హామీ ఇచ్చిన పార్టీ తెలంగాణ వినాశకారి యురేనియంను కోరుకోవడం దుర్మార్గం. ఈ విషయములో ఎంఐఎం పార్టీ స్పందిచకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రజాందోళనలు గమనించి తెలంగాణ అమెజాన్‌ అయిన నల్లమలను, తెలంగాణ జలవనరులను విషతుల్యం చేసే యురేనియం వెలికితీతను అడ్డుకుంటూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేయాలి, ఈ త్యాగాల మట్టిలో అణువిధ్వంసానికి తావులేదని చాటాలి. నల్లమలను కాపాడుకునేందుకు ప్రజలు చేస్తున్న ఉద్యమంపై అక్రమ నిర్భంధాలను మానుకోవాలి.

– పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
15-09-2019

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy