వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తొలితరం ఉద్యమకారుడుకొమర్రాజు మురళీధర్‌ ‌రావు కన్నుమూత

August 24, 2019

నిజాం వ్యతిరేక పోరాటం, బ్రిటీష్‌ ‌ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలలో చిన్న యవసులోనే పొల్గొన్న కొమర్రాజు మురళీధర్‌ ‌రావు (87) శనివారం రామగిరిలోని వారి నివాసంలో కన్నుమూసారు. వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తి రీత్యా సత్యవాది. వారి ఇల్లు ఎన్నో రాజకీయ అంశాల వారధి. ఉర్దు ప్రధాన భాషగా చదువుకొన్న తరం ఆయనది. ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌, ‌నేరెళ్ళ వేణుమాధవ్‌ ‌లాంటి అనేక మంది ప్రముఖులతో కలిసి చదువుకుని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. గాంధీజీ ఆలోచనలతో ప్రభావితం అయి, బాల్యంలోనే పికెటింగుల్లో పాల్గొన్నారు. తరువాత కాలంలో రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా ప్రభావంతో లోక్‌నాయక్‌ ‌జయప్రకాష్‌ ‌నారాయణ్‌ ‌నడిపిన ఉద్యమంలో పాల్గొని ‘పార్టీ రహిత ప్రజాస్వామ్య’ (పార్టీలెస్‌ ‌డెమోక్రసీ) తరుపున ఎన్నికలలో పోటీ చేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఖర్చుల వివరాలను ప్రజలముందు ఉంచి రాజకీయాలు ‘నీతి వంతమైనవని’ నిరూపించారు. ‘ప్రతిధ్వని’ ప్రాంతీయ పక్ష పత్రికను నడిపి, అనేక సమస్యలను బట్టబయలు చేశారు. ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచిన, సాదాసీదా జీవితం గడిపారు. మారుతున్న రాజకీయ పరిణామాల పట్ల, తరిగిపోతున్న విలువల పట్ల నిరసన తెలియజేసేవారు. వారికి భార్య, నలుగురు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు, మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు.