వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తెలంగాణ సోయి…. ప్రాతస్మరణీయుడు..పాలెం సుబ్బయ్య

April 24, 2019

మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా నాగర్‌ ‌కర్నూల్‌ ‌తాలూకాలో పన్నెండు వందల జనాభా ఉన్న పాలెం ఒక కుగ్రామం. పౌరో హిత్యం, వ్యవ సాయం చేసు కునే ఒక సామాన్య బ్రాహ్మ ణుడు 40 సంవత్స రాలు పరిశ్ర మించి ఆ కుమ్రాన్ని సకల సదుపాయాలతో స్వర్గధామం చేశా డంటే నమ్మశక్యం కాదు . అందరూ పాలెం సుబ్బయ్యగా పిలుచుకునే తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ వ్యక్తి కాదు శక్తి ! ఒక్క సంస్థ కాదు అనేక సంస్థలు, వ్యవస్థలూ. ఆయన ఇచ్ఛాశక్తి బలవత్తరమైనది. విద్యతో సహా అన్ని రంగాల్లో వెనుకబడి, శాశ్వత కరువుతో ఆకలితో అలమటించి వలస జిల్లాగా పేరు మోసిన మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా ఆయన మనసును ఆవేదనకు గురిచేసింది. గ్రామ స్వరాజ్య సిద్ధాంతంపై తన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని తనకున్న వస్తు, ధన, భూములను నిస్వార్ధంగా కోటి రూపాయలకు పైగా వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వేంకటేశ్వర దేవాలయం, సైన్సు కళాశాల, ఓరియంటల్‌ ‌కళాశాల, రక్షిత మంచినీటి సరఫరా, తంతి తపాలా కార్యాలయం, టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌, ‌యూనియన్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా, పౌల్ట్రీ, డైరీ పరిశ్రమలు, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఆర్టీసి బస్సు స్టేషన్‌లతో పాటు అనేక పరిశ్రమలు నెలకొల్పాడు. 1977 మార్చిలో ఇందిరా గాంధీ ఎన్నికల్లో ఓడిపోవడంతో విమానాశ్రయం తప్పిపోయింది.ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వేలాది మంది విద్యార్థులు ఉద్యోగులుగా, ఉన్నతోద్యోగులుగా, శాస్త్రజ్ఞులుగా, డాక్టర్లుగా, అడ్వకేట్లుగా, ఇంజనీర్లుగా, ప్రొఫెసర్లుగా, ఎంఎల్‌ఏలుగా, అమెరికాలో సైతం ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఆ త్యాగమూర్తి ఫోటోకు ఇప్పటికీ దండలు వేసి, హారతి ఇచ్చి, నివాళులర్పించే వాళ్ళు అనేకులు !!
ఆదర్శమూర్తి సుబ్బయ్య గారు 1926 ఏప్రిల్‌ 23‌న మధ్య తరగతి వైదిక బ్రాహ్మణ కుటుం బంలో సత్యమూర్తి, భగీర థమ్మ దంప తులకు జన్మిం చారు. నేను నీ కోసం, నీ పిల్లల కోసం పుట్టలేదు అని తనతో అనే సుబ్బయ్య గారు ప్రజల కోసం పుట్టాడనే సీతారా మమ్మ ఆయన అర్ధాంగి. అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా, అన్ని కార్యక్రమాల్లో నీడలా అను• •రించిన తమ్ముడు రామేశ్వర శర్మ ఆయన ఆత్మ! ‘నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్ర తుల్యము’ అన్నట్లు ఆయన మనసు వెన్న, మాట కఠినం. కొంత కాఠిన్యం లేకపోతే ఇన్ని వ్యవస్థల అజమాయిషీ సాధ్యం కాదు గదా !
కాలక్రమేణా వచ్చిన మార్పులతో కాలేజీలు, దేవాలయం ప్రభుత్వపరం చేయాల్సి వచ్చింది. తన మిత్రులు తన శత్రువులయ్యారు. తాగుబోతు రాజకీయాలు ఆయనను నిర్లక్ష్యం చేశాయి. స్వార్థం జడలు విప్పింది. ఈ మానసిక ఆఘాతానికి ఆయన మంచం పట్టాడు. కోటి రూపాయలపైన వెచ్చించినా ఆయన నయాపైసా నష్టపరిహారం ఆశించలేదు. ఏ ఒక్క నిర్మాణంపైన తన పేర శిలాఫలకం వేయించ లేదన్నదే ఆయన త్యాగశీల వ్యక్తిత్వానికి గొప్ప తార్కాణం! మనోవ్యథతో సుబ్బయ్యగారు 60 సంవత్సరాల 60 రోజుల వయసులో సార్థక జీవనం గడిపి 1986 జూన్‌ 23‌న కీర్తిశేషులయ్యారు. ఆయన మరణించిన సంవత్సరం తర్వాత 22 జూన్‌ 1687‌న ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాడు పున్నమి చంద్రునిలా వైభవోపేతంగా వెలిగిన పాలెం నేడు పట్టించుకునే నాథుడు లేక కళావిహీనమై అమావాస్యను తలపిస్తున్నది. ఆ మహానుభావునికి శిరసా నమామి !!!

– యాదగిరి గుండోజు,
పాలమూరు జిల్లా (9440339917)