Take a fresh look at your lifestyle.

తెలంగాణ సీఎస్‌, ‌ముఖ్య కార్యదర్శికి… లోక్‌సభ ప్రివిలేజ్‌ ‌కమిటీ నోటీసులు

ఫిబ్రవరి 3న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,•జనవరి 22 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ‌లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫిర్యాదుపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్‌ ‌కమిటీ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 3న తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, డీజీపీ, కరీంనగర్‌ ‌సిపి, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్‌ ఇన్స్‌పెక్టర్‌లకు కూడా ప్రివిలేజ్‌ ‌నోటీసులు జారీ చేసింది. జీవో 317కు వ్యతిరేకంగా కరీంనగర్‌లోని ఎంపి కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగారు. అయితే, కొరోనా నిబంధనల కారణంగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై బండి సంజయ్‌పై లోక్‌సభ ప్రివిలేజ్‌ ‌కమిటీ ముందు తన వాదనలు వినిపించారు.

కరీంనగర్‌లో దీక్ష సందర్భంగా పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారనీ, కార్యాలయం తలుపులు పగులగొట్టి అకారణంగా దాడి చేశారని ఆరోపించారు. లోక్‌సభ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారనీ కమిటీకి వివరించారు. గ్యాస్‌ ‌కట్టర్లు వినియోగించి తన ఎంపి కార్యాలయం తలుపులు బద్దలు కొట్టారనీ, కొరోనా నిబంధనలు పాటించి దీక్ష చేస్తానని ప్రకటించినా వినకుండా అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని బండి సంజయ్‌ ‌ప్రివిలేజ్‌ ‌కమిటీకి వాంగ్మూలం ఇచ్చారు. సంజయ్‌ ‌స్టేట్‌మెంట్‌ ‌నేపథ్యంలో ప్రివిలేజ్‌ ‌కమిటీ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.

Leave a Reply