Take a fresh look at your lifestyle.

తెలంగాణ విమోచన దినాన్ని అధికారింగా నిర్వహించాలి

వనపర్తి,సెప్టెంబర్‌,11 (‌ప్రజాతంత్ర విలేకరి) :  ఈ నెల 17 న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని వనపర్తి జిల్లా బిజెపి శాఖ డిమాండు చేసింది. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు డిమాండు చేస్తు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంలో భాగంగా ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. శాంతియుతంగా కార్యక్రమాన్ని చేసినటువంటి బిజెపి నాయకులపై అక్రమంగా తెల్లవారుజామున 4 గంటలకు గృహనిర్భంధం చేసి పోలీస్‌ ‌స్టేషన్‌లకు తరలించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమ యంలో టిఆర్‌ ఎస్‌ ‌పార్టీ అధి కారం లోకి రాగనే తెలంగాణ విమో చన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పినప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. అప్రజాస్వామిక టిఆర్‌ఎస్‌ ‌పోకడలను బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని మజ్లీస్‌ ‌కు భయపడే పోటు బ్యాంకు రాజకీయాల కోసం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని పక్క రాష్ట్రాల్లో ఉన్న మహారాష్ట్ర కర్నాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని చెప్పారు.  కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మెన్‌ ‌బి.కృష్ణ, ఉపాధ్యక్షుడు సీతారాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నారాయణ, జిల్లా కార్యదర్శి పరుశురాములు, పట్టణ అధ్యక్షుడు రాము, బిజెపి నాయకులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply