Take a fresh look at your lifestyle.

తెలంగాణ రెవిన్యూ విధానంలో ఏముంది?

తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం ద్వారా వొచ్చింది. అయితే, అదే ప్రజాస్వామ్యం భ్రష్టు పడుతోందని ఆందోళన వ్యక్తం చేసేవారున్నారు. తెలంగాణలో రాజకీయాల పరిణామాలను బట్టి ఆందోళన వ్యక్తం చేసేవారున్నారు. చట్టబద్దమైన పాలన పట్ల ప్రభుత్వం పట్టించుకోవడం లేదనిపిస్తోంది. అందుకు ఈ ఘోరోదంతమే నిదర్శనం. ప్రజాస్వామ్య సమాజం ఇలాంటి ఘటనలను హర్షించదు. పాలనలో ప్రజాస్వామ్య సూత్రాల సంకేతాలేవీ కనిపించడం లేదు. రాష్ట్రంలో ఫ్యూడలిస్టు పాలన జరుగుతోందన్న అభిప్రాయం జనానికి ఏర్పడుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఫ్యూడలిస్టు పాలనకు వ్యతిరేకంగా వినిపించిన గొంతులు మూగబోయాయి.నిజం ఏమంటే, మనమంతా కపటత్వాన్ని పాటిస్తున్నాం, ఊహాస్వర్గంలో జీవిస్తున్నాం. తెలంగాణలో అబ్దుల్లాపూర్‌ ‌మెట్‌ ‌మండల రెవిన్యూ అధికారణి • విజయారెడ్డిపై పెట్రోల్‌ ‌పోసి సజీవ దహనం చేసిన సంఘటనపై చేసిన వ్యాఖ్యలను మనం సమర్థించుకుంటున్నాం. రెవిన్యూ వ్యవస్థలో లోపాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడాన్ని కూడా సమర్థించుకుంటాం. ఈ విషాద సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నది మన అభిలాష. •అవినీతి అన్నది రెవిన్యూ వ్యవస్థలోనే లేదు. •ఇలాంటి •ఘోరం జరిగినప్పుడు ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని కోరుకోవడం సహజమే. •ఒక అధికారిణిపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించడం •క్షమార్హం కాని మాట నిజమే. ఇలాంటి సంఘటనను ప్రతి ఒక్కరు ఖండించడాన్ని అర్ధం చేసుకోగలం.• అయితే, వీరెవరూ కూడా ప్రభుత్వ జోక్యం మంచిది కాదని అనరు. వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఈ చట్టాలు సరిపోవని కూడా అనరు. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటం ద్వారా వొచ్చింది. అయితే, అదే ప్రజాస్వామ్యం భ్రష్టు పడుతోందని ఆందోళన వ్యక్తం చేసేవారున్నారు. తెలంగాణలో రాజకీయాల పరిణామాలను బట్టి ఆందోళన వ్యక్తం చేసేవారున్నారు. చట్టబద్దమైన పాలన పట్ల ప్రభుత్వం •పట్టించుకోవడం లేదనిపిస్తోంది. •అందుకు ఈ ఘోరోదంతమే నిదర్శనం. ప్రజాస్వామ్య సమాజం ఇలాంటి ఘటనలను హర్షించదు. పాలనలో ప్రజాస్వామ్య సూత్రాల సంకేతాలేవీ కనిపించడం లేదు. రాష్ట్రంలో ఫ్యూడలిస్టు పాలన జరుగుతోందన్న అభిప్రాయం జనానికి ఏర్పడుతోంది. తెలంగాణ ఉద్యమంలో •ఫ్యూడలిస్టు పాలనకు వ్యతిరేకంగా వినిపించిన గొంతులు మూగబోయాయి. •గందరగోళంలో ఊగిసలాడుతున్నాయి. •ఫ్యూడల్‌ ‌పాలనను వ్యతిరేకించాలా లేదా అని సందేహిస్తున్నాయి.•అక్రమాల లక్షణాలన్నీ రెవిన్యూ వ్యవస్థలో ఉన్నాయి. ఫూడల్‌ •పాలన నుంచి ఇవి సంక్రమించినవి. తెలంగాణ సేనానినని చెప్పుకునే కేసీఆర్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వం •ప్రజల్లో ఉండే భయ సందేహాలను తొలగించే ప్రయత్నం చేయడం లేదు. రెవిన్యూ వ్యవస్థ అవినీతినీ, ఈ దారుణ సంఘటనను ఖండించడంలో మనం ఓ ముఖ్యమైన విషయాన్ని మరిచిపోతున్నాం. కేసీఆర్‌ ‌నేతృత్వంలో ఫ్యూడల్‌ ‌తరగతి •రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారం రాష్ట్రం ఏర్పడిందనేది మరిచి పోతున్నాం. ఈ తరగతి తన పూర్వ వైభవాన్ని నిలబెట్టుకోవడానికి •తెలంగాణ డిమాండ్‌ ‌ముసుగులో ప్రజల ముందుకు వచ్చింది.•కేసీఆర్‌ ‌ప్రభుత్వం •భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినప్పుడు భూస్వాముల హక్కులను పునరుద్ధరించే చర్య అని అర్థం చేసుకోలేకపోయాం. పీపుల్స్ ‌వార్‌ ‌గ్రూపు విప్లవకారుల పోరాటం కారణంగా ఈ వర్గం తమ భూములను బలవంతంగా కోల్పోవల్సి వచ్చింది.• తెలంగాణ డిమాండ్‌ని సమర్థించిన మావోయిస్టులు కూడా •తెలంగాణ డిమాండ్‌ ‌ముసుగులో భూస్వాములు తిరిగి •తెరమీదికి వస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయారు. భూములపై హక్కులను కాపాడుకుంటూ ఈ ఫ్యూడల్‌ ‌వర్గం ఆర్థిక, రాజకీయ రంగాల్లో పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నించింది. ఇప్పటికీ ప్రయత్నిస్తోంది. సీమాంద్ర వలసపాలకుల పాలనకు బదులుగా సాగుతున్న పాలన ఇది. నిజానికి తెలంగాణ ఉద్యమం •ఇద్దరు వ్యక్తుల అహంపై జరిగిన పోరాటం. పెట్టుబడిదారి ప్రతినిధి అయిన నారా చంద్రబాబునాయుడు, ఫూడలిస్టుల ప్రతినిధి అయిన కేసీఆర్‌ ‌మధ్య •జరిగిన •ఆధిపత్య పోరాటం తెలంగాణ ఉద్యమానికి •ప్రాతిపదిక అయింది. ఫూడల్‌ ‌వ్యవస్థ ప్రతినిధులు అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. ఆ వర్గం మరింత బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల భూమి రికార్డులు దిద్దుబాట్ల అన్నీ ఫ్యూడలిస్టు వర్గాలకు మేలు చేశాయి. రెవిన్యూ రికార్డులను పరిశీలిస్తే •అవినీతికి సంబంధించి ఎన్నో ఫిర్యాదులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ ‌లైన్‌లో కనిపిస్తాయి. ఇటీవవల జరిగిన ఈ కార్యక్రమం ద్వారా తెలిసిందేమంటే రెవిన్యూ శాఖలో అవినీతి పెచ్చుమీరిందని. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఎన్‌ ‌ఫోర్స్ ‌మెంట్‌ ‌శాఖ నివేదికలే ఇందుకు నిదర్శనం. ఇది ప్రజలు కోరుకున్న తెలంగాణ కాదు. •ప్రజలు పోరాడింది దీని కోసం కాదు. బహుశా •తెలంగాణ ఉద్యమం ఫ్యూడల్‌ ‌నియంత పాలన కోసం, అవినీతి వ్యవస్థ కోసం జరిగిందేమో.•- ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy