- గుజరాత్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ తుదిశ్వాస
- సంతాపం ప్రకటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఉత్తరాది నదీ జలాల కోసం దేవాదాయ శాఖ ఉద్యోగులు గత నెలలో గుజరాత్ వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 24న సోమనాథ ఆలయానికి వెళ్తుండగా ద్వారక్ వద్ద ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో అడిక్‌మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్‌బజార్ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమణ అక్కడికక్కడే మరణించారు. వెంకటేశ్వర శర్మ, ఈవో సత్యనారాయణ, క్లర్క్ కేశవరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అహ్మదాబాద్‌లోని హోప్ దవాఖానకు తరలించారు. కాగా, పరిస్థితి విషమించడంతో వెంకటేశ్వర శర్మ శుక్రవారం కన్నుమూశారు. తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
వెంకటేశ్వర శర్మ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు. వెంకటేశ్వర శర్మ పద్మారావు నగర్ పోల్ బాల్ హనుమాన్ దేవాలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 24న గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ ఆలయానికి వెళ్తుండగా దోల్కా జిల్లా మోతి బోర్ వద్ద ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అడిక్‌మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్‌బజార్ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమణ అక్కడికక్కడే మరణించారు. ఈవో సత్యనారాయణ ఇటీవలే మృతి చెందగా.. అహ్మదాబాద్‌లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకటేశ్వర శర్మ కూడా తుదిశ్వాస విడిచారు.