Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కాంగ్రెస్‌ అంగవైకల్యంగా తయారవుతుంది

మొదటి ప్రత్యామ్నాయం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయడం, సామాజిక వర్గాల నాయకత్వాలకు తగిన బాధ్యతలను అప్పగించడం, సామాజిక ఇంజనీరింగ్‌ని అధిష్ఠానం చేపట్టడం మొదలైన వాటిని పరిశీలించాల్సి ఉంది. సీనియర్‌ నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఎక్కడైతే ఉన్నారో వారికి అదే సరైన స్థానమని చెప్పాల్సిన సమయం వచ్చింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తే మంచిది. అయితే, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాత నాయకత్వం సారథ్యంలో పోరు సాగించడం చాలా కష్టం. వారిని నమ్ముకుంటే మళ్ళీ కేసీఆర్‌కి అవకాశం ఇచ్చినట్టే.! జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు కేసీఆర్‌ ఆశలకు బలాన్ని ఇచ్చినట్టే.


రాజకీయాల్లో ఏదీ కూడా యాదచ్ఛికంగా జర గదు.ఒకవేళ జరిగితే దానిని ప్రణాళికా బద్ధంగా అదే విధంగా ఎదుర్కోవచ్చు. పార్టీని పటిష్టం చేసేందుకు సైద్దాంతిక వ్యూహాలు, ఎత్తుగడలు ఎంత గొప్పవైనా, ఎంత ఆలోచించి రూపొందిం చినవైనా వాటిని పునశ్చరించవల్సిందే. అవి సమకాలీన రాజకీయ ప్రయోజనాలకు తగినవి కాకపోతే సవరిం చాల్సిందే.

మరో మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ, విధానపరమైన ఆలోచనల్లో సవాళ్ళకు వదిలి వేయకూడదు. పాత రాజకీయ పద్దతులనే పట్టుకుని వేళ్ళాడ కూడదు.అలా చేస్తే అంగవైకల్యంతో చక్రాల కుర్చీకి పరి మితం కావల్సి వస్తుంది.

తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తే అలాగే అనిపి స్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పొందిన తర్వాత ఇలాగే అనిపిస్తుంది.

నిరాశా నిస్పహలతో రాజకీయంగా అనుభవం లేక చెబుతున్న మాట కాదు. తెరాసతో పోరులో కాంగ్రెస్‌ నాయ కత్వం ఓటమి పాలైంది. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదుర్చుకోవడమే కాకుండా ఆయనను ముందు పెట్టుకుని ప్రచారం చేయడం ఘోరమైన నిర్ణయమని రుజువైంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేలవమైన నాయకత్వం తెరాసతో సమర్ధవంతమైన పోరు జరపడంలో విఫలమైంది. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం ఎంత తీవ్ర స్థాయిలో ప్రజల్లో నాటుకుని పోయిందో కాంగ్రెస్‌ నాయకత్వం అంచనా వేయలేక పోయింది.

గతంలో కాంగ్రెస్‌ ఓడిపోతుందనుకున్నప్పుడల్లా గాంధీ కుటుంబానికి ప్రజల్లో గల ఆకర్షణ శక్తిని ఉపయోగించుకునే వారు. ఈ సారి కూడా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం సోనియా గాంధీని తీసుకుని రావడమే కాకుండా ఆమె తెలంగాణ ఇచ్చింది ఇందుకా అని అనిపించారు. ఆమె త్యాగాలను నాయకత్వాన్ని పొగడటంలో చిక్కుకుని కేసీఆర్‌ ప్రచారాన్ని గమనించలేక పోయింది.

అయితే, ఈ సారి కేసీఆర్‌ ప్రచారం అంతా సోనియా గాంధీ తల్లిదనాన్ని, త్యాగాల గురించి కాకుండా తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నాయుడు పైనే కేంద్రీక రించారు.

దాదాపు అన్ని ర్యాలీల్లో ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వంపై దాడి చేశారు. వారి అవినీతి గురించి సీమాoధ్ర నాయకత్వం తెలంగాణను దోచుకున్న తీరు గురించి అన్ని ర్యాలీల్లో, సభల్లో కేసీఆర్‌ వివరించారు. కాంగ్రెస్‌కి వోటేస్తే సీమాంధ్రులకు బానిస అయినట్టే నని తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. తెలంగాణ నుంచి సీమాంధ్రుల పెత్తనం నుంచి విముక్తం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయితే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ చేయాల్సిందేమిటి? నాయకత్వం ఎలా ముందుకు పోవాలి?

మొదటి ప్రత్యామ్నాయం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయడం, సామాజిక వర్గాల నాయకత్వాలకు తగిన బాధ్యతలను అప్పగించడం, సామా జిక ఇంజనీరింగ్‌ని అధిష్ఠానం చేపట్టడం మొదలైన వాటిని పరిశీలించాల్సి ఉంది. సీనియర్‌ నాయకులుగా చెప్పుకుం టున్న వారు ఎక్కడైతే ఉన్నారో వారికి అదే సరైన స్థానమని చెప్పాల్సిన సమయం వచ్చింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తే మంచిది. అయితే, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాత నాయకత్వం సారథ్యంలో పోరు సాగించడం చాలా కష్టం. వారిని నమ్ముకుంటే మళ్ళీ కేసీఆర్‌కి అవకాశం ఇచ్చినట్టే.! జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు కేసీఆర్‌ ఆశలకు బలాన్ని ఇచ్చినట్టే.

పాత తరం కాంగ్రెస్‌ నాయకులను జాతీయ స్థాయిలో కేసీఆర్‌కి ప్రత్యామ్నాయంగా ప్రజలు అనుకోవడం లేదు. మరో ప్రత్యామ్నాయం జాతీయ స్థాయిలో బీజేపీని జనం ఇష్టపడతారు.అందువల్ల తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం మౌనాన్ని వీడి కేంద్రంలో కేసీఆర్‌కి సరైన ప్రత్యామ్నాయం తామేనని గట్టిగా చెప్పగలగాలి. కేసీఆర్‌ ఊహలు అల్లడంలో చతురుడు.. అవన్నీ కాగితాలకే పరిమితం. క్షేత్ర స్థాయిలో ఫలించవు, ఆయన రహస్య అజెండా లేకుండా పని చేయరు. కేసీఆర్‌ రాజకీయాల్లో మహాత్ముడు కాడు. జాతీయ పార్టీలు లేకుండా ఫ్రంట్‌ అనేది తెలంగాణ కోసం కేంద్రం నుంచి ఎక్కువ నిధుల కోసం బేరమాడటానికే. తెలంగాణలో ఉన్న 17 స్థానాలను గెలవాలన్నది ఆయన ఆకాంక్ష (ఒక స్థానం తన మిత్రపక్షమైన ఎంఐఎంకి విడిచి పెట్టి). నరేంద్ర మోడీ నేతత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్‌ నేతత్వంలోని మహా కూటమిల మధ్య పార్టీలు సమీకరణ అయ్యే అవకాశం ఉంది. అంతే కాక, కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిం చాలన్న సంకల్పంలో మరో లక్ష్యం కూడా ఉంది. తన కుమారుడు కెటి రామారావును రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయ డం. ఇప్పటికే ఆయన తగిన ప్రాతిపదికను ఏర్పాటు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో తన కుమారుణ్ణి నియమించారు. కేసీఆర్‌ ఎత్తుగడల పట్ల తెలంగాణ కాం గ్రెస్‌ నాయకత్వం ఉపేక్షిస్తుంది.ఈ లోగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లను తన వైపు తిప్పుకోవడానికి కేసీఆర్‌ ప్రయత్నాలు ప్రారం భించారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల ఆకాంక్షను కాంగ్రెస్‌ నాయకత్వం నిలదీయలేక పోతుంది.అయితే, కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలహీన పర్చేందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదాన్ని ఎత్తుకున్నారని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు.

కేసీఆర్‌ తాను కలుస్తున్న పార్టీలన్నీ కలిసినా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కాలేవన్న సంగతి కేసీఆర్‌కి తెలుసు. ఆ విధంగా కేసీఆర్‌ తాను వేసిన వలలోనే తాను చిక్కుకుంటున్నారు. ఆయన తన యత్నంలో విఫలమైతే ఆయనను అవకాశవాదిగా ప్రజలు విమర్శిస్తారు.

ఎందుకో తెలియదు కాంగ్రెస్‌ నాయకత్వం వింతైన స్వయం నియంత్రణ మౌనాన్ని పాటిస్తుంది.

ప్రతిపక్షాలు ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు. ఓట మిపై ఇంకా విశ్లేషణ చేసుకోలేదు.పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వెంటనే తప్పుకోవాలి.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకులు తయారు కావాలి.అందుకు అధిష్ఠానం ప్రోత్సహిం చాలి.

తిరిగి ప్రజల మద్దతు పొందేందుకు కాంగ్రెస్‌ తీవ్ర మైన చర్యలు తీసుకోవాల్సిందే. పైన పేర్కొన్న ప్రత్యామ్నా యాలన్నీ బొమ్మ బొరుసుల్లాంటి విషయం కేసీఆర్‌ రాష్ట్రాన్ని తనకు తోచిన రీతిలో నడుపుతుంటే ఆయనను అడ్డుకోవడానికి బలమైన ప్రతిఫక్షం అవసరం ఎంతైనా ఉంది.

అయితే, ఆ వైపు ప్రయత్నాలు సాగించకుండా కాంగ్రెస్‌ చక్రాల కుర్చీకి పరిమితమైన అంగవైకల్యంతో ఉన్నట్టు ఉంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy