వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తువ్వాలలు,నోట్ పుస్తకాలతో శుభాకాంక్షలు..

September 18, 2019

ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపుకు అనూహ్య స్పందనబొకేలు, శాలువాలకు స్వస్తి పలకాలని మంత్రి హరీశ్ రావు పిలుపుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తన్నీరు హరీశ్ రావుకు సిద్ధిపేటలోని తన నివాసంలో బుధవారం రాత్రి తువ్వాలలు, నోట్ పుస్తకాలు ఇచ్చి సిద్ధిపేట గీతా పారిశ్రామిక సంఘ నేతలు, ప్రతినిధులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గీతా పారిశ్రామిక సంఘ పలువురు నేతలు మాట్లాడుతూ.. తమ అభిమాన జనం మెచ్చిన నాయకుడు హరీశ్ రావు ఇచ్చిన పిలుపు మేరకు చేనేతలు నేసిన తువ్వాలలు, పేద విద్యార్థులకు ఉపయోగమయ్యేలా నోట్ పుస్తకాలను ఇచ్చి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపినట్లు గీతా పారిశ్రామిక సంఘ నేతలు, ప్రతినిధులు వెల్లడించారు. ప్రత్యేకించి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థినీ, విద్యార్థులకు నోట్ పుస్తకాలు ఇవ్వాలని, చేనేత కార్మికులకు బాసటగా నిలిచేలా వారు నేసిన తువ్వాలలు ఇవ్వడంతో వారికి ఇతోధికంగా దోహదపడిన వారమవుతామని ముందు చూపుతో తమకు దిశానిర్దేశం చేసిన నాయకుడు హరీశ్ రావు బాటలో మేము సైతమని ముందుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గీతా పారిశ్రామిక సంఘ నేతలు సత్యం గౌడ్, ఇతర నాయకులు పలువురు పాల్గొన్నారు.