వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తుమ్మిడిహట్టితో ఖర్చు బాగా తగ్గేది

August 24, 2019

టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణాలను టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తప్పుబట్టారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదిత ప్రాణహిత బ్యారేజి స్థలాన్ని కోదండరాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డియాతో మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్ట్ ‌డిజైన్‌ ‌మార్చడం ద్వారా వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆరోపించారు. కాళేశ్వరం కన్నా తుమ్మిడిహట్టి బ్యారేజీ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేదని చెప్పారు. ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల జిల్లాలకు సాగునీరు అందక పోవడం దారుణమని, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహితపై బ్యారేజీ నిర్మించాలని కోదండరాం డిమాండ్‌ ‌చేశారు.