వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తుమ్మడిహట్టి వద్ద నిర్మిస్తే ఖర్చు తగ్గేది

August 26, 2019

పిసిసి అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి
ప్రాజెక్ట్ ‌ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్‌ ‌బృందంతుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే.. తక్కువ ఖర్చుతో ప్రాణహిత జలాలు అందేవని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ ‌నిర్మించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ ‌ప్రతినిధుల బృందం సోమవారం పరిశీలించింది. నీటిపారుదల ప్రాజెక్టుల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ ‌చేశారు. సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ ‌ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్ ‌పూర్తి చేసివుంటే సాగు, తాగు నీటీ అవసరాలు తీరడమే కాకుండా 1.50 లక్షల కోట్లు ఆదా అయ్యేవని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ ‌నిర్మాణం చేసి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని సరఫరా చేసేందుకు వీలుగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం డిజైన్‌ ‌చేసిందని భట్టి గుర్తు చేశారు. ‘కాంగ్రెస్‌ ‌హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.38వేల కోట్ల అంచనాతో రూపొందించాం. రూ.10వేల కోట్ల విలువైన పనులు పూర్తిచేశాం. ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. రాష్ట్రంలోని 80 శాతం ప్రాంతాలకు తాగునీరు లభించేది. కానీ.. కషన్ల కోసం కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్‌ ‌లక్ష కోట్ల రూపాయల అంచనాతో రీడిజైనింగ్‌ ‌చేశారు’ అని ఆయన ఆరోపించారు. తాగునీటి అవసరాల కోసమంటూ రూ.50వేల కోట్లతో మిషన్‌ ‌భగీరథ పేరుతో మరో ప్రాజెక్టు చేపట్టారని దుయ్యబట్టారు. కేవలం కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు రాష్టాన్ని్ర దోచుకొనేందుకే ఈ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ ‌చేపట్టారని ఆరోపించారు. ఈ విషయాలను ప్రజలకు లెక్కలతో సహా వివరించేందుకే సోమవారం నుంచి కాంగ్రెస్‌ ’‌ప్రాజెక్టుల బాట’ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఈ బృందంలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, రేవంత్‌ ‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నేతలు విహెచ్‌, ‌షబ్బీర్‌ అలీ తదితరులు ఉన్నారు.