వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష:జెసి

August 2, 2019

తల్లి పాల వారోత్సవాల సందర్భంగా జెండా ఊపుతున్న జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌వేణుగోపాల్‌

ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా స్థానిక బాలుర జూనియర్‌ ‌కళాశాల నుండి ర్యాలీ ప్రదర్శనను జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌వేణుగోపాల్‌ ‌జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌మాట్లాడుతు తల్లి పాలపై తల్లిదండ్రులకే కాకుండా ప్యామిలీ సభ్యులకు కూడా  కౌన్సిలింగ్‌ ‌నిర్వహించాలని బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు త్రాగించేవిధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైందని అన్నారు. తల్లి దండ్రులను శక్తివంతం చేయడం తల్లి పాలివ్వడాన్ని ప్రారంభించడంఅనే నినాదంతో ముందుకెళ్లాలని జిల్లా పోషకస్థితిని మెరుగుపరచడం  కేంద్రీకృత కౌన్సిలింగ్‌ ‌నిర్వహించడం ఇంటింటికి అంగన్‌వాడి పేరుతో గృహసందర్శనలు చేయడం ద్వా రా అవగాహన పెంచాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి డి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతు ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లా పోషక స్థితిగతులను పెంచవచ్చని పెంపొందించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత వుందన్నారు. తల్లిపాలు బిడ్డకు శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు. కార్యక్రమంలో అదనపు వైద్య అధికారి రవిశంకర్‌,‌సిడిపిఓలు శ్రావణి పుష్పవతి, లక్ష్మీ, కృష్ణచైతన్య, సూపర్‌వైజర్స్ ‌పోషణ్‌ అభ్యాయన్‌ ‌జిల్లా సమన్వయకర్త నాగిరెడ్డి, సిబ్బంది, వనజ, ప్రతీప్‌, ‌నవీన్‌, అం‌గన్‌వాడి కార్యకర్తలు, ఆశావర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, సూపర్‌వైజర్‌లు పాల్గొన్నారు.