వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తల్లి, కూతుళ్ల ఆత్మహత్య పాలెం గ్రామంలో విషాద చాయలు

April 9, 2019

తల్లి, కూతుళ్ల ఆత్మహత్య సంఘటన సోమవారం నాడు వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని పాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటనకు పాల్పడినట్లు కొత్తకోట ఎస్సై రవికాంతరావు తెలిపారు. వివరాలలోకి వెళితే పాలెం గ్రామానికి చెందిన నిర్మల (32) సం।।లు కూతురు సింధు (8) సం।। బాలిక మృతి చెందారు. గ్రామంలో తల్లి కూతుళ్లు స్ప్రైట్‌లో పురుగుల మందును కలుపుకొని త్రాగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విధంగా బాలిక గొంతు దగ్గర కత్తికాట్లు ఉండడంతో ఈ సంఘటనపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన తల్లి, కూతురును పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. గ్రామంలో ఈ సంఘటనతో గ్రామస్తులు కుటింబికులు దుఖ సాగరంలో మునిగిపోయారు.