వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తలసేమియా వ్యాధిని తరిమికొట్టాలి

May 8, 2019

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి
డివైఎస్‌ఓ ‌సత్యవాణిప్రాణాంతకరమైన తలసేమియా వ్యాధిని తరిమికొట్టాలని డివైఎస్‌వో సత్యవాణి పిలుపునిచ్చారు. నేడు జరిగే ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఇండియన్‌ ‌రెడ్‌‌క్రాస్‌ ‌సొసైటి ఆధ్వర్యంలో 2కె రన్‌ను నిర్వహించారు. స్టేడియం మైదానం నుండి ప్రారంభమైన 2కె రన్‌ను సత్యవాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ స్టేడియం మైదానం నుంచి ప్రారంభమైన కొత్త బస్టాండ్‌, అం‌బేద్కర్‌ ‌చౌరస్తా, న్యూటౌన్‌ ‌మీదుగా తిరిగి స్టేడియం మైదానం చేరుకుంది. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ తలసేమియాతో బాధపడుతున్న పిల్లలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. క్రీడాకారులు, క్రీడా సంగాల బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసి తలసేమియా బాధితులను ఆదుకుంటామని తెలిపారు. రెడ్‌‌క్రాస్‌ ‌చైర్మన్‌ ఎ.‌నటరాజు మాట్లాడుతూ జిల్లాలో 172 మంది పిల్లలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. వారికి ప్రతినెలకు ఒక సారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. తలసేమియా పిల్లలకు అవసరమైన రక్తంను రెడ్‌‌క్రాస్‌ ‌ద్వారా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మానవత్వంతో ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు. వైస్‌ ‌చైర్మన్‌ ‌డా.శ్యాముల్‌ ‌మాట్లాడుతూ తలసేమియా వ్యాధి లక్షణాలు వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈకార్యక్రమంలో కోశాధికారి ఎస్‌.‌జగపతిరావు, మేనేజింగ్‌ ‌కమిటి సభ్యులు రమణయ్య, జూనియర్‌ ‌రెడ్‌‌క్రాస్‌ ‌కో ఆర్డినేటర్‌ అశ్విని చంద్రశేఖర్‌, ‌మేనేజర్‌ ‌గాంధీ, యూత్‌ ‌రెడ్‌‌క్రాస్‌, ‌జూనియర్‌ ‌రెడ్‌‌క్రాస్‌ ‌వాలింటర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.