Take a fresh look at your lifestyle.

తరతరాల రాజరికం తలవంచిన వేళ…

భారత సైనిక దళాల పురోగమనాన్ని నిజామ్‌ ‌ప్రభుత్వ సైన్యం మతోన్మాది ఖాసిమ్‌ ‌రజ్వీ రజాకార్‌ ‌మూకలు ఎంత మాత్రం ప్రతిఘటించలేక పోయాయి. సెప్టెంబర్‌ 17‌వ తేదీ నాటికి నిజామ్‌ ‌సైన్యం కుప్పకూలి ప్రతిఘటనను నిలిపివేసింది; ‘మహా ఘనత వహించిన’ హైదరాబాద్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలని ఎన్నో కలలుగన్న ఏడవ ఆసఫ్‌ ‌జాహి నిజామ్‌ ‌మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌బహద్దుర్‌ ‌గత్యంతరం లేక తలవంచి ఆ రోజు లొంగిపోయాడు. తన ప్రధానమంత్రి లాయక్‌ అలీ చేత రాజీనామా చేయిస్తున్నట్లు, భద్రతా మండలి నుంచి తన ఫిర్యాదును ఉపసంహరిస్తున్నట్లు నిజామ్‌ ‌తక్షణమే తన సైన్యాధిపతి మేజర్‌ ‌జనరల్‌ ఎల్‌.ఎ‌ద్రూస్‌ ‌ద్వారా కె.ఎమ్‌.‌మున్షీకి ఒక సందేశం పంపించాడు. విచిత్రమయిన విషయం ఏమిటంటే మోయిన్‌ ‌నవాజ్‌ ‌జంగ్‌ ‌ద్వార నిజామ్‌ ‌భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంపిన ఫిర్యాదును భద్రతా మండలి (ఐక్యరాజ్యసమితి) సెప్టెంబర్‌ 16‌వ తేదీన స్వీకరించింది. ఆపరేషన్‌ ‌పోలో ప్రారంభించడానికి ముందు భారత యూనియన్‌ ‌గవర్నర్‌ ‌జనరల్‌ ‌సి.రాజగోపా)చారి 1948 ఆగస్టు 31వ తేదీన ఒక లేఖ రాసి నిజామ్‌కు చివరి అవకాశం ఇవ్వడం జరిగింది.
త్యాగాలు, సమరాల ఫలంగా..

దేవులపల్లి ప్రభాకర్‌ ‌రావు.

ఈ విలీనానికి, హైదరాబాద్‌ ‌విముక్తికి క్రమంగా దారి తీసిన నేపధ్యాన్ని, దాదాపు నూటా యాభయి సంవత్సరాల వెనుకటి చరిత్రను ఈ సందర్భాన విస్మరించడానికి వీలు లేదు. పందొమ్మిదవ శతా్ద•ం ప్రాంభం నుంచే నిజామ్‌ ‌రాజులు తిరుగుబాటుదారులను ఎదుర్కోవలసి వచ్చిందనడానికి పలు చారిత్రక సాక్ష్యాధారాలున్నాయి. అరవై ఆరు సంవత్సరాల కిందట హైదరాబాద్‌ ‌సంస్థానంలో, విశేషించి తెలంగాణంలో అదొక చారిత్రాత్మక, మహత్తర సంఘటన. రెండు వందల నలభై నాలుగు సంవత్సరాల కిందట 1724వ సంవ త్సరంలో అవతరించిన అసఫ్‌ ‌జాహి రాజ్యం అంతరించింది; ఏడు తరాల అసఫ్‌ ‌జాహి పాలన అంతమయింది. హైదరాబాద్‌ ‌సంస్థానంపై 1948 సెప్టెంబర్‌ 13‌వ తేదీన నాలుగు దిశల నుంచి ప్రారంభమయిన ఆపరేషన్‌ ‌పోలో (పోలీస్‌ ‌చర్య) ఎవరూ ఊహించని విధంగా అయిదు రోజులలో, 17వ తేదీ నాటికే విజయవంతంగా ముగిసింది.
ఆపరేషన్‌ ‌పోలో
భారత యూనియన్‌ ‌సైన్యం లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌మహారాజ్‌ శ్రీ ‌రాజేంద్ర సింఘ్‌జీ మార్గదర్శకత్వంలో ఆపరేషన్‌ ‌పోలోను 13 వ తేదీ సోమవారం సూర్యోదయానికి ముందే ప్రారంభించింది. మేజర్‌ ‌జనరల్‌ ‌జయంత్‌నాధ్‌ ‌చౌదరి నాయకత్వంలో ప్రధాన సైనిక దళాలు షోలాపూర్‌ – ‌హైదరాబాద్‌ ‌మార్గంలో (186 మైళ్ల మార్గం) పురోగమించాయి. బొంబాయి సెక్టారు నుంచి కదిలిన దళాలకు మేజర్‌ ‌జనరల్‌ ‌డి.ఎస్‌.‌బ్రార్‌, ‌మద్రాసు సరిహద్దుల నుంచి ముందుకు వచ్చిన దళాలకు మేజర్‌ ‌రుద్ర, బెరార్‌ – ‌సెంట్రల్‌ ‌ప్రావిన్సెస్‌ ‌దిశ నుంచి రంగంలో ప్రవేశించిన దళాలకు బ్రిగేడియర్‌ ‌శివదత్తసింగ్‌ ‌నాయకత్వం వహించారు. వైమానిక బలంతో ఏర్‌వైస్‌ ‌మార్షల్‌ ‌ముఖర్జీ అండగా నిలిచారు. భారత సైనిక దళాల దాడి గురించి తెలియగానే నిజామ్‌ ‌ప్రభుత్వం హైదరాబాద్‌లో భారత ప్రభుత్వం ఏజెంటు జనరల్‌గా ఉన్న కె.ఎమ్‌.‌మున్షీని లేక్‌వ్యూ గెస్ట్ ‌హౌస్‌లో నిర్బంధించింది. భారత సైనిక దళాల పురోగమనాన్ని నిజామ్‌ ‌ప్రభుత్వ సైన్యం మతోన్మాది ఖాసిమ్‌ ‌రజ్వీ రజాకార్‌ ‌మూకలు ఎంత మాత్రం ప్రతిఘటించలేక పోయాయి. సెప్టెంబర్‌ 17‌వ తేదీ నాటికి నిజామ్‌ ‌సైన్యం కుప్పకూలి ప్రతిఘటనను నిలిపివేసింది; ‘మహా ఘనత వహించిన’ హైదరాబాద్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలని ఎన్నో కలలుగన్న ఏడవ ఆసఫ్‌ ‌జాహి నిజామ్‌ ‌మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌బహద్దుర్‌ ‌గత్యంతరం లేక తలవంచి ఆ రోజు లొంగిపోయాడు. తన ప్రధానమంత్రి లాయక్‌ అలీ చేత రాజీనామా చేయిస్తున్నట్లు, భద్రతా మండలి నుంచి తన ఫిర్యాదును ఉపసంహరిస్తున్నట్లు నిజామ్‌ ‌తక్షణమే తన సైన్యాధిపతి మేజర్‌ ‌జనరల్‌ ఎల్‌.ఎ‌ద్రూస్‌ ‌ద్వారా కె.ఎమ్‌.‌మున్షీకి ఒక సందేశం పంపించాడు. విచిత్రమయిన విషయం ఏమిటంటే మోయిన్‌ ‌నవాజ్‌ ‌జంగ్‌ ‌ద్వార నిజామ్‌ ‌భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంపిన ఫిర్యాదును భద్రతా మండలి (ఐక్యరాజ్యసమితి) సెప్టెంబర్‌ 16‌వ తేదీన స్వీకరించింది. ఆపరేషన్‌ ‌పోలో ప్రారంభించడానికి ముందు భారత యూనియన్‌ ‌గవర్నర్‌ ‌జనరల్‌ ‌సి.రాజగోపా)చారి 1948 ఆగస్టు 31వ తేదీన ఒక లేఖ రాసి నిజామ్‌కు చివరి అవకాశం ఇవ్వడం జరిగింది. రజాకార్‌ ‌సంస్థను రద్దు చేసి సంస్థానంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని రాజగోపాలచారి ఆ లేఖలో చేసిన సూచనను నిజామ్‌ ‌తిరస్కరించాడు! ఈ తిరస్కరణకు ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది.  సెప్టెంబ్‌ర 17 ఉదయం లాయక్‌ అలీ రాజీనామా ఇచ్చాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు నిజామ్‌ ‌హుటాహుటిన మున్షీ ద్వారా భారత ప్రభుత్వానికి సందేశం పంపించాడు. యుద్ధ విరమణకు, రాజాకార్ల సంస్థ రద్దుకు తాను ఆదేశించినట్లు తెలియజేస్తూ, నిజానికి నిజామ్‌ ‌సైన్యం భారత సైన్యంతో ఏ రంగంలోను గట్టిగా ఘర్షణ పడలేక పోయింది. 17వ తేదీ సాయంత్రం నిజామ్‌ ‌రేడియోలో ప్రసంగిస్తూ తాను లొంగిపోయినట్లు ప్రకటించాడు. అదేరోజు సాయంత్రం ఎడ్రూస్‌ ‌నాయ కత్వాన గల నిజామ్‌ ‌సైన్యం లొంగిపోయింది. 1948 సెప్టెంబర్‌ 18 ఉద యం భారత సైనిక దళాలు మేజర్‌ ‌జనరల్‌ ‌జె.ఎన్‌.‌చౌదరి నాయకత్వాన హైదరాబాద్‌ ‌నగరంలో విజయోత్సాహంతో ప్రవేశించాయి. సెప్టెంబర్‌ 18 ‌సాయంత్రం 4 గంటలకు మేజర్‌ ‌జనరల్‌ ఎల్‌ ఎ‌డ్రూస్‌ ‌బేషరతుగా భారత సైన్యపు మొదటి సాయుధ డివిజన్‌ ‌కమాండర్‌ ‌మేజర్‌ ‌జనరల్‌ ‌చౌద•రి ముందు లొంగిపోయాడు. మేజర్‌ ‌జనరల్‌ ‌చౌదరి హైదరాబాద్‌ ‌సంస్థాన మిలటరీ గవర్నర్‌గా నియుక్తులయ్యారు. 1949 డిసెంబర్‌ ‌వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. తరువాత 1950 జనవరి 26వ తేదీన హైదరాబాద్‌ ‌సంస్థానం భారత యూనియన్‌లో విలీనమయింది.
ఉద్యమాల నేపధ్యం
ఈ విలీనానికి, హైదరాబాద్‌ ‌విముక్తికి క్రమంగా దారి తీసిన నేపధ్యాన్ని, దాదాపు నూటా యాభయి సంవత్సరాల వెనుకటి చరిత్రను ఈ సందర్భాన విస్మరించడానికి వీలు లేదు. పందొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నుంచే నిజామ్‌ ‌రాజులు తిరుగుబాటుదారులను ఎదుర్కోవలసి వచ్చిందనడానికి పలు చారిత్రక సాక్ష్యాధారాలున్నాయి. తమ రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడు కోవడానికి నిజామ్‌ ‌రాజులు పలు సందర్భాలలో ఫ్రెంచి, బ్రిటిష్‌ ‌సైనిక బలగాల, మీద ఆధారపడ్డారు. 1857లో ఉత్తర భారతదేశంలో ప్రధమ స్వాతంత్య్ర సమరం జరిగినప్పుడు దాని ప్రభావం హైదరాబాద్‌ ‌సంస్థానంలో, ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలో గూడ కన్పించింది. 1857 జూలై 17వ తేదీన హైదరాబాద్‌ ‌నగరంలో వందల మంది రోహిలాలు చెలరేగి తుర్రె బాజ్‌ఖాన్‌, ‌మౌల్వీఅల్లాఉద్దీన్‌ ‌నాయకత్వంలో సుల్తాన్‌బజార్‌లోని బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ ‌మీద దాడి చేసారు. 1857 నుంచి 1859 వరకు హైదరాబాద్‌లో కొందరు ఉత్తర భారతదేశంలో స్వాతంత్య్ర సమర నాయకులలో ఒకరయిన తాంతియాతోపేతో సంబంధాలు పెట్టుకున్నారు. నిజామ్‌ ‌ప్రభుత్వం ఎన్ని ఆంక్షలను పెట్టి నిర్భంద చర్యలను అమలు జరిపినా ప్రజల ప్రయో•నాలను కాపాడడానికి, పౌరసత్వాలను కోరడానికి గొంతు విప్పిన నాయకులు కొందరు లేకపోలేదు. ప్రజాభిప్రాయన్ని ప్రతిధ్వనించడానికి కొందరు
సాహసవంతంగా ప్రయత్నించారు. నిజామ్‌ ‌ప్రభుత్వం రూపొందించిన చాందా రైల్వే పథకానికి వ్యతిరేకంగా 1883లో డాక్టర్‌ అఘోరనాధ్‌ ‌చటోపాధ్యాయ (సరోజనీ నాయుడు తండ్రి), ముల్లా అబ్దుల్‌ ‌ఖయ్యూమ్‌, ‌దస్తూ ఆసగి హోషాంగ్‌ ‌తదితరులు ఒక ఉద్యమం నడిపారు. ఈ పథకం ప్రజల ప్రయో జనాలకు భంగం కల్గిస్తుందని ఈ మేధావులు భావించారు. నిజామ్‌ ‌ప్రభు త్వం ఆగ్రహించి చటోపాధ్యాయను, హోషాంగ్‌ను సంస్థానం నుంచి కొంత కాలం పాటు బహిష్కరించింది. వారిద్దరు రెండు సంవత్సరాల తరువాత తిరిగి హైదరాబాద్‌ ‌నగరానికి వచ్చి వివిధ కార్యకలాపాలు నిర్వహించారు. బొంబాయిలో 1885లో భారత జాతీయ కాంగ్రెసు స్థాపనను హైదరాబాద్‌ ‌మేధావులు చటోపాధ్యాయ తదితరులు హర్షించారు. జాతీయ భావాలను ప్రచారం చేస్తూ హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ను లోకల్‌ ‌సీజర్‌ అని విమర్శించినందుకు ‘హైదరాబాద్‌ ‌రికార్డ్’ ‌పత్రికను 1892లో నిజామ్‌ ‌ప్రభు త్వం నిషేధించింది. ‘షౌకతుల్‌ ఇస్లామ్‌’ అనే పత్రిక నిజామ్‌ ‌ప్రభుత్వ నిర్బంధ చర్యలను ప్రతిఘటించింది.
ముఖ్య ఘటన
సంస్థానం ప్రజలలో సామాజిక, రాజకీయ, సాంస్క•తిక చైతన్యం కల్గిం చడానికి, నిజామ్‌ ‌నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పడానికి గత శతాబ్ది చివరనే, అనగా వంద సంవత్స రాల కిందటనే కొందరు ప్రయత్నిం చారు. హైదరాబాద్‌ ‌నగరంలో 1892వ సంవత్సరంలో ఆర్య సమాజ్‌ ‌స్థాపక ఒక ముఖ్య ఘటన. క్రమంగా ఆర్య సమాజ్‌ ‌ప్రభావం సంస్థానమంతట ప్రసరించింది. పందొమ్మిదవ శతాబ్ది ప్రారంభంలో తెలంగాణంలో గ్రంథా లయోద్యమం, సాంస్క•తిక పునరుజ్జీవన కార్యక్రమాలు  ప్రారంభమయినా యి.  విద్యా సంస్థల స్థాపనతో విద్యా వ్యాప్తి కృషి ప్రారంభమయింది. మొదటి హైదరాబాద్‌ ‌విద్యా మహాసభ 1915లో జరిగింది. తత్ఫలితంగా 1919 ఆగస్టు 28వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపితమయింది. వరం గల్లు, నల్లగొండ నగరాల నుంచి తెలుగు పత్రికల ప్రచురణ ప్రారంభ మయింది. హైదరాబాద్‌ ‌నగరం నుంచి గోలకొండ పత్రిక వెలువడింది. అప్పటికే గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ప్రభావం, ఖిలాఫత్‌ ఉద్యమ ప్రభావం హైదరాబాద్‌ ‌సంస్థానంలో స్పష్టంగా కన్పించాయి.
ఆంధ్ర మహాసభ అంకురార్పణ
హైదరాబాద్‌ ‌నగరంలో 1921 నవంబర్‌ 11, 12 ‌తేదీలందు మహర్షి కార్వే అధ్యక్షతన జరిగిన సాంఘిక సంస్కరణల మహాసభలో ఒక తెలుగు తీర్మానం ప్రతిపాదనకు అనుమతించకపోవడంతో, తెలుగు వక్తను అవమా నించడంతో అదేరోజు రాత్రి మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామ కృష్ణారావు, మందుముల నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు తదిత రులు ‘ఆంధ్ర జనసంఘం’ ఏర్పాటు చేసారు. ఆ సంఘం మొదటి సమావేశం 1922 ఫిబ్రవరి 14వ తేదీన హైదరాబాద్‌ ‌నగరంలో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ‘నిజామ్‌ ‌రాష్ట్ర ఆంధ్ర జనసంఘ్‌’ ‌గా దాని పేరు మార్చి మాడపాటి హనుమంతరావును కార్యదర్శిగా నియమించారు. తెలం గాణ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, సాంస్క•తిక పునరుజ్జీవనం, పునర్వి కాసం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థ ప్రోత్సాహంతో 1930 సంవ త్సరంలో వరంగల్లులో కాకతీయుల చరిత్రపై ఒక మహాసభ ఏర్పాటయింది. ఆంధ్ర జనసంఘ్‌ ‌పుస్తక ప్రచురణను గూడ ప్రారంభించింది. అనతి కాలం లోనే తెలంగాణ అంతట పలు కార్యక్రమాలలో విస్తరించిన ఆంధ్ర జన సంఘ్‌ 1930‌లో, మెదక్‌ ‌జిల్లా జోగిపేటలో నిర్వహించిన మహాసభతో తెలం గాణ ఆంధ్ర మహాసభగా అవతరించింది. ఆంధ్ర మహాసభ తీవ్ర రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని నిజామ్‌ ‌ప్రభుత్వంలోని కొందరు ఉన్నతా ధికారులు, 1927లో స్థాపితమయిన ఇత్తెహాదుల్‌ ‌ముసల్మీన్‌ ‌నాయకులు అనుమానించారు. తరువాత సంవత్సరాలలో వారి అనుమానం నిజమ యింది. 1937లో నిజామాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశం మొదటిసారి రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. బాధ్యతాయుత ప్రభు త్వం ఏర్పాటు కావాలని నిజామాబాద్‌ ఆం‌ధ్రమహాసభ తన ఈ రాజకీయ తీర్మానంలో డిమాండు చేసింది. 1930 నుంచి 1947 వరకు పదిహేడు సంవత్సరాల కాలంలో తెలంగాణంలోని తొమ్మిది జిల్లాలలో ఏడింటిలో మొత్తం పదమూడు ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల నిర్వ హణతో తెలంగాణంలో కలిగిన సామాజిక, రాజకీయ, సాంస్క•తిక చైత న్యం అపారమయినది. నిజామ్‌ ‌ప్రభుత్వం ఆంధ్ర మహాసభల నిర్వహణకు, దాని కార్యకలాపాలకు అనేక అవరోధాలు కల్గించింది. 1944లో భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన పదకొండవ ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టులు ప్రాబల్యం వహించడంతో చీలిక ఏర్పడింది. కాంగ్రెస్‌ ‌వాదుల ప్రాబల్యంలో గల ఆంధ్ర మహాసభ 1946లో హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌లో విలీనం కావడానికి నిర్ణయించింది.
అపూర్వ చైతన్యం
హైదరాబాద్‌ ‌సంస్థానంలో, 1938వ సంవత్సరంలో నిర్వహించిన సత్యా గ్రహాలు, వందేమాతరం ఉద్యమం గణనీయమయినవి. అదే సంవత్సరం హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌ ఏర్పాటు కాగానే నిజామ్‌ ‌ప్రభుత్వం దానిని నిషేధించింది. 1938లో నిర్వహించిన మొదటి సత్యాగ్రహ ఉద్యమంతో హైదరాబాద్‌ ‌సంస్థానమంతట అపూర్వమయిన రాజకీయ చైతన్యం ఏర్ప డింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్లలో వందేమాతరం గీతాలాపనపై నిజామ్‌ ‌ప్రభుత్వం నిషేధం విధించింది. అదే సంవత్సరం జూన్‌లో లాతూర్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌నగరం వచ్చిన స్వామి రామానంద తీర్థ కాంగ్రెసు కార్యకలాపాలను ప్రారంభించారు. 1942 ఆగస్టులో, బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెసు క్విట్‌ ఇం‌డియా తీర్మానాన్ని ఆమెదించడానికి ఒకరోజు ముందు స్వామి రామానందతీర్థ ప్రత్యేకంగా గాంధీజీతో మాట్లాడారు. హైదరాబాద్‌ ‌సంస్థానంలో గూడ క్విట్‌ ఇం‌డియా ఉద్యమం నిర్వహించడానికి గాంధీజీ అనుమతి ఇచ్చారు. బొంబాయి నుంచి హైదరాబాద్‌ ‌రాగానే నిజామ్‌ ‌ప్రభుత్వం స్వామిరామానందతీర్థను అరెస్టు చేసింది. 1947 మే నెలలో హైదరాబాద్‌ ‌వచ్చిన జయప్రకాష్‌ ‌నారాయణన్‌ను నిజామ్‌ ‌ప్రభుత్వం బహిష్కరించింది. స్వామి రామానందతీర్థ నాయకత్వంలో స్టేట్‌ ‌కాంగ్రెసు సరిహద్దు శిబిరాలను నిర్వహించింది. ఆంధ్ర మహాసభను కైవసం చేసుకున్న కమ్యూనిస్టులు 1945 నుంచి నిజామ్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం ప్రారంభించారు. ఆంధ్ర మహాసభ-కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యాన 1951 వరకు ఆరు సంవత్సరాల పాటు తీవ్ర స్థాయిలో కొనసాగిన సాయుధ పోరాటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. రాజరికపు నియంతృత్వాన్ని, భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల సామాజిక, రాజకీయ, సాంస్క•తిక ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం కొనసాగిన ఆ సాయుధ పోరాటంలో నాలుగు వేలమంది ప్రాణాలర్పించారని అంచనా. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన కొందరికి నిజామ్‌ ‌ప్రభుత్వం విధించిన ఉరిశిక్షలు 1952 వరకు రద్దు గాకుండా కొనసాగడం విచిత్రం. 1927లో స్థాపితమయిన ఇతైహాదుల్‌ ‌ముసల్మీన్‌ ‌ఖాసిం రజ్వీ నాయకత్వంలో నిజామ్‌ ‌రాజును కీలు బొమ్మగా మార్చి సంస్థానమంతట, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అరాజకత్వాన్ని సృష్టించింది. రజ్వీ నాయకత్వంలో రజాకార్లు నరరూప రాక్షసులుగా ప్రవర్తించారు. భారత యూనియన్‌తో నిజామ్‌ ‌రాజు యధాతధ ఒప్పందం (స్టాండ్‌ ‌స్టిల్‌ అ‌గ్రిమెంట్‌) ‌కుదుర్చు కోకుండా రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డుపడ్డారు. చివరికి ఆ ఒప్పందం కుదిరినా అది అమలు కాలేదు. పర్యవసానంగా హైదరాబాద్‌ ‌సంస్థానంలో అరాజక  పరిస్థితి అదుపు తప్పడం, వేలాది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం, పోలీసు చర్య అనివార్యం కావడం అనంతర పరిణామాలు. హైదరాబాద్‌ ‌సంస్థానంలోని నిజామ్‌ ‌నిరంకుశ రాజరిక వ్యవస్థ శృంఖలాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి కొనసాగిన ఒక్కొక్క సామాజిక, రాజకీయ ఉద్యమం చరిత్ర ఒక బృహద్గ్రంథమవుతుంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy