Take a fresh look at your lifestyle.

తమిళనాడు ఆటో రంగం ఊపిరితీస్తున్న ఆర్థిక మాంద్యం

తమిళనాడులో ఆటోమొబైల్‌ ‌రంగంలో పనిచేసే ఉద్యోగులు భీతితో ఉన్నారు. మీడియాతో ముచ్చటించేందుకు నిరాకరిస్తున్నారు. ఉద్యోగాల్లో కోత ఆలోచనల పట్ల నిరసన తెలుపుతున్నారు.ఆటో విడిభాగాలను ఉత్పత్తి చేసే చిన్న తరహా పరిశ్రమలు చాలా మటుకు మూసివేయడమో, లేక సిబ్బందిని తగ్గించడమో జరిగింది. పరిశ్రమ వర్గాల ప్రకారం 14 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. తమిళనాడులో 11 మాసాల్లో 80,000 నుంచి లక్ష మంది రిట్రెంచ్‌ ‌మెంట్‌కు గురి అయ్యారు. తమిళనాడు సెంటర్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌ట్రేడ్‌ ‌యూనియన్స్( ‌సిఐటియు) అధ్యక్షుడు ఎ సౌందర్‌ ‌రాజన్‌ ‌శ్రీపెరంబదూర్‌, ఒరగాడమ్‌ ‌ప్రాంతాల్లో ఐదువేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని చెప్పారు. గడిచిన మూడు, నాలుగు మాసాలలో ఆటోమొబైల్‌ అమ్మకాలు ఉన్నపళంగా తగ్గిపోయాయి. బిఎస్‌-‌విఐ వాహనాలపై ఉద్గారాల నిబంధనల కారణంగా కొనేవారు కనిపించడం లేదు.
చెన్నైలోని అంబత్తూరు పారిశ్రామిక వాడలో ఆటో విడిభాగాల తయారీ యూనిట్‌ను నిర్వహిస్తున్న ఎస్‌ అత్మానేశన్‌ ఆటో మొబైల్‌ ‌రంగంలో మందకొడి పరిస్థితులకు ఎంతో ఖిన్నులయ్యారు. తనకు ఇష్టం లేకపోయినా, ఆయన తన ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. అంబత్తూరు పారిశ్రామిక వాడలో 30 వేల చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 80 శాతం పరిశ్రమల్లో కాంట్రాక్టు ప్రాతిపదికగా కార్మికులను చేర్చుకుంటారు. ఈ పరిశ్రమల్లో చాలా మటుకు తమ పరిశ్రమలను విధిలేక మూసివేయాల్సి వచ్చింది. పనులకు సంబంధించి ఆర్డర్లు లేకపోవడం వల్ల మూసివేయాల్సి వచ్చినట్టు అత్మానివేశన్‌ ‌తెలిపారు. ఉద్యోగాలు కోల్పోవడంతో కార్మికులు ఇళ్ళకే పరిమితం కావల్సి వస్తోంది. కార్మికులకు పనిచెప్పేందుకు అవసరమైన ఆర్డర్లు రానందున పరిశ్రమలను మూసివేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. వస్తు, సేవా పన్ను( జిఎస్‌టి)ని ప్రవేశపెట్టిన తర్వాత తమ వ్యాపారం బాగా దెబ్బతిందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం వల్ల మరింత నష్టపోతున్నామని ఆయన అన్నారు. ఈ పరిశ్రమపై 28 శాతం జిఎస్‌టి విధిస్తున్నారనీ, ప్రపంచంలో ఎక్కడా ఇంత పన్ను లేదని ఆయన అన్నారు.
అంబత్తూర్‌ ‌పారిశ్రామిక వాడ చెన్నై శివారులో ఉంది. ఆటో రంగానికి చెందిన చిన్న విడిభాగాలను తయారు చేసే యూనిట్లు ఎన్నో ఉన్నాయి. ఈ యూనిట్లలో చాలా మటుకు తమ సిబ్బందిలో 80 శాతం వరకూ రిట్రెంచ్‌ ‌చేశారు(తొలగించారు). ఆత్మానివేశన్‌ ‌మాదిరిగా ఆటో విడిభాగాల తయారీ యూనిట్ల యజమానులంతా నిరాశనిస్పృహలతో, నిర్వేదంతో ఉన్నారు. చెన్నై ఆటో విడిభాగాల తయారీకి ఆసియా డెట్రాయిట్‌గా పేరొందింది. అమెరికాకు ఆటో రంగంలో డెట్రాయిట్‌ ‌మంచి పేరు తెచ్చింది. శ్రీ పెరంబదూర్‌, ఒరగాడమ్‌, ‌మారైమలై నగర్‌, ‌తిరువళ్ళూర్‌ ‌మొదలైన ప్రాంతాలన్నీ చెన్నై శివార్లలో ఆటోమొబైల్‌ ‌జోన్లుగా ప్రసిద్ధి. ఈ యూనిట్లలో లే ఆఫ్‌ ‌ప్రకటించడంతో కార్మికులంతా స్వస్థలాలకు తరలి వెళ్ళారు. తమ యాజమాన్యాల నుంచి తిరిగి పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. శ్రీపెరంబదూర్‌, ఒరగాడమ్‌ ఆటో తయారీ జోన్‌లలో కార్మికులు తమ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ఉద్యోగాల కోత అంతా కాంట్రాక్టు ఉద్యోగులలోనే ఉంది. మీడియాతో మాట్లాడినా, నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నా, తమకు తిరిగి కాంట్రాక్టు ఉద్యోగాలు రావని వారు భయపడుతున్నారు. తమ సంస్థల మానవ వనరుల విభాగం మేనేజర్లు నిరంతర నిఘా వేసి ఉంచుతున్నారని వారు చెప్పారు. బస్సుల తలుపులకు తాము గమ్య స్థానాలకు చేరేవరకూ తాళాలు వేస్తున్నారని వారు చెప్పారు. కంపెనీ బయట ఎవరూ ఎవరితోనూ మాట్లాడకూడదన్న ఆదేశాలున్నాయని వారు బెదురుగా చెబుతున్నారు.
తమిళనాడులో ఆటోమొబైల్‌ ‌తయారీ కేంద్రాలు ప్రపంచంలోనే అగ్రశ్రేణికి చెందినవి పదివరకూ ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఏటా 13 లక్షల కార్లు ఉత్పత్తి అవుతాయి. ముంబాయి రోడ్లపై తిరిగే కార్లలో 27 శాతం కార్లు ఇక్కడ తయారైనవే. నిమిషానికి మూడు కార్లను ఇవి ఉత్పత్తి చేస్తాయి. రెండు నిమిషాలకు ఒక ట్రక్కును తయారు చేస్తాయి. ఆరు సెకండ్లలో మోటారు ఒక సైకిల్‌ ‌తయారు చేస్తాయని ఈ పరిశ్రమకు చెందిన నిపుణులు తెలిపారు. ఆసియా మార్కెట్లలో వ్యాపార విస్తృతికి బిఎం డబ్ల్యు, అశోక్‌ ‌లేలాండ్‌, ‌ఫోర్డ్, ‌మహీంద్రా అండ్‌ ‌మహీంద్రా, హిందూస్తాన్‌ ‌మోటార్స్, ఇం‌టెగ్రెల్‌ ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీ, మితుసుబిసి, రాయల్‌ ఎన్‌ ‌ఫీల్డ్, ‌తదితర పేరొందిన సంస్థలు ఇక్కడ ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉన్నాయి. దేశంలో ఆటో విడిభాగాల ఉత్పత్తిలో 35 శాతం తమిళనాడులోనే జరుగుతోంది. దేశం ఎగుమతి చేసే మోటారు వాహనాల్లో 45 శాతం తమిళనాడు నుంచే జరుగుతోంది. ఇప్పుడు ఆర్థిక మందకొడి తనం పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రుణాలు ఇవ్వకుండా గట్టి ఆంక్షలు విధించాయి. ఆటో వాహనాల అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి.
ఆటో విడిభాగాలను ఉత్పత్తి చేసే చిన్న తరహా పరిశ్రమలు చాలా మటుకు మూసివేయడమో, లేక సిబ్బందిని తగ్గించడమో జరిగింది. పరిశ్రమ వర్గాల ప్రకారం 14 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. తమిళనాడులో 11 మాసాల్లో 80,000 నుంచి లక్ష మంది రిట్రెంచ్‌ ‌మెంట్‌కు గురి అయ్యారు. తమిళనాడు సెంటర్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌ట్రేడ్‌ ‌యూనియన్స్( ‌సిఐటియు) అధ్యక్షుడు ఎ సౌందర్‌ ‌రాజన్‌ ‌శ్రీపెరంబదూర్‌, ఒరగాడమ్‌ ‌ప్రాంతాల్లో ఐదువేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని చెప్పారు. గడిచిన మూడు, నాలుగు మాసాలలో ఆటోమొబైల్‌ అమ్మకాలు ఉన్నపళంగా తగ్గిపోయాయి. బిఎస్‌-‌విఐ వాహనాలపై ఉద్గారాల నిబంధనల కారణంగా కొనేవారు కనిపించడం లేదు. చాల కంపెనీలు తమ కాంట్రాక్టు కార్మికులను తగ్గించడమో, పనిదినాలు తగ్గించడమో చేశాయి. బిఎస్‌-‌విఐ లేదా భారత్‌ ‌స్టేజ్‌ ‌వాహనాలు తాజా ఉద్గారాల తగ్గింపు ప్రమాణాలకు చెందినవి. ఆటో పరిశ్రమ ఆర్థిక దుస్థితిని ఎదుర్కోవడానికి జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు ప్రధాన కారణాలని ఆటోమోటివ్‌ ‌కాంపోనెంట్‌ ‌తయారీదారుల సంఘం సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.
బెన్నీ ఆంటోనీ (23) గుడలూర్‌ ‌జిల్లాలో చిన్న షెడ్‌ను నిర్వహిస్తుతున్నారు. పాత ఆర్‌ఎక్స్-100 ‌యమహా మోటారు సైకిళ్ళను ఆయన రీమేక్‌ ‌చేస్తారు. ఒక్కొక్క బండి ద్వారా ఆయన 1500 నుంచి 2000 కమిషన్‌ ‌సంపాదించేవారు. 2017లో తన మిత్రుల సలహా మేరకు చెన్నైలో ఈ షెడ్‌ను ఏర్పాటు చేశారు. తాను ట్రయినీగా చేరాననీ, నెలకు 15,500 వరకూ సంపాదించేవాడిననీ, ఇప్పుడు ఆ అవకాశం కోల్పోయానని తెలిపాడు. ఒక బహుళ జాతి సంస్థలో 700 మంది కార్మికులు లేఆఫ్‌కు గురి అయ్యారు. ఒక రోజున తీవ్రమైన చెవిపోటు వచ్చింది. వెల్డింగ్‌ ‌విభాగంలో పడుకున్నానని, మా మేనేజర్‌ ‌వచ్చి బయటకు పొమ్మన్నాడని ఆంటోనీ చెప్పారు. ఆంటోనీ ప్రస్తుతం గుడలూర్‌లో ఒక గ్యారేజ్‌లో పని చేస్తున్నాడు. శ్రీపెరంబదూర్‌ ‌నుంచి ఒరగాడమ్‌ ‌జాతీయ రహదారిపై వెళ్తుంటే పెద్ద టెంట్‌ ‌కనిపిస్తుంది. ఆలిండియా సెంట్రల్‌ ‌కౌన్సిల్‌ ఆప్‌ ‌ట్రేడ్‌ ‌యూనియన్స్(ఎఐసిసిటియు) ఈ టెంట్‌ను ఏర్పాటు చేసింది. టాటా మోటార్స్, ‌మహింద్రా, మారుతి సుజికి, టయోటో కిర్లోస్కర్‌, ‌బోసెచ్‌ , ‌వాబ్‌కో తమ ప్లాంట్లను 8 నుంచి 20 రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. తగినన్ని ఆర్డర్లు లేకపోవడమే కారణమని పేర్కొన్నాయి. నాన్‌ ‌వర్కింగ్‌ ‌డేస్‌ అం‌టే కార్మికులు ఇళ్ళ వద్ద కూర్చోవాలి. మరే పనీ చేసుకోరాదు. గత జూలైలో టివిఎస్‌ ‌గ్రూపు వాహనాల అమ్మకాలు బాగా తగ్గిపోయాయని ప్రకటించింది. 2018లో 3.21 లక్షల యూనిట్లకు, 2019 జూలైలో 2.79 లక్షలకు పడిపోయాయని పేర్కొంది. ఉద్యోగాల కోత అన్ని చోట్లా జరుగుతోందని ఎసిఎంఎ డైరక్టర్‌ ‌జనరల్‌ ‌విన్నే మెహతా చెప్పారు..ఆత్మానేశన్‌ ‌యూనిట్‌లో పెద్ద ట్రక్కుల బోల్టులు, నట్‌లు తయారు చేస్తారు. ఆయన యూనిట్‌లో 10 ఏళ్ళ నుంచి మెషీన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న మేరీ ఉన్నపళంగా ఉద్యోగం నుంచి వెళ్ళిపోవడమంటే తనకు నిలువ నీడ లేకుండా అయిందని చెప్పింది. తన కోడలు అస్వస్థురాలైతే 50 వేలు ఖర్చు చేశానని చెప్పింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని అంతా అమ్మేశానని చెప్పింది. ఇలా ఎవరిని కదిలించినా తమ కష్టాలను వెళ్ళ బోసుకుంటున్నారు. కొంత మంది అయితే, పెదవి విప్పేందుకు భయపడుతున్నారు.

– ‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy