Take a fresh look at your lifestyle.

తగ్గుతున్న కోవిడ్ కేసులు- గత 24 గంటల్లో 1.52 లక్షలు

  • గత 50 రోజుల్లో అత్యల్ప స్థాయికి రోజువారీ కోవిడ్ కేసులు
  • కోలుకున్నవారి శాతం 91.60% కు పెరుగుదల
  • పరీక్షా సామర్థ్యం పెంపు, ఇప్పటిదాకా దాదాపు 34.48 కోట్ల పరీక్షలు
  • ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా21.3 కోట్ల టీకా డోసులు
హైదరాబాద్,పీఐబీ మే 31: రోజువారీ కొత్త కొరోనా కేసులు తగ్గుతూ వస్తుననయి.. గత 24 గంటలలో 1.52 లక్షల కొత్త కేసులు నమోదు కాగా ఇది గడిచిన 50 రోజుల్లో అత్యల్క్పం కావటం గమనార్హం. దీంతో, వరుసగా నాలుగో రోజు కూడా రెండు లక్షల లోపే కొత్త కేసులు వచ్చినట్టయింది.. నిన్న నమోదైన కేసులు 1,52,734 అని సోమవారం  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు సంఖ్య 20,26,092 కి తగ్గింది. గత 24 గంటలలో నికరంగా 88,416 మంది చికిత్సలో ఉన్నవారు తగ్గారు. మొత్తం పాజిటివ్ కేసులలో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి వాటా 7.22% మాత్రమే. దేశంలో కొత్త కోవిడ్ కేసుల కంటే కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. గత 18 రోజులుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. గత 24 గంటలలో 2,38,022 మంది కోలుకున్నారు. ఇది అంతకుముందు రోజు కోలుకున్నవారి కంటే 85,288 అధికం..కొరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఈ వ్యాధి సోకినవారిలో 2,56,92,342 మంది కోలుకున్నారు.

వారిలో గడిచిన 24 గంటల్లో కోలుకున్నవారు 2,38,022 మంది, దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 91.60% కి చేరింది. గత 24 గంటల్లో 16,83,135 కొరోనా పరీక్షలు జరపగా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా జరిపిన పరీక్షలు 34.48 కోట్లు దాటాయి. పరీక్షల సంఖ్య ఒకవైపు పెరుగుతూ ఉండగా పాజిటివిటీ తగ్గటం మరోవైపు కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ 9.04% కాగా ఈరోజు ఇంకా తగ్గి 9.07% గా నమోదైంది. ఇది వరుసగా వారం రోజులుగా 10% లోపే ఉంటూ వస్తోంది. దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల మొత్తం సంఖ్య ఈ రోజుకు 21.31 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 30,28,295 శిబిరాల ద్వారా మొత్తం 21,31,54,129 టీకా డోసుల పంపిణీ జరిగింది.

 

Leave a Reply