Take a fresh look at your lifestyle.

తగ్గిన పెట్రో ధరలు

  • అంతర్జాతీయ పరిణామాలతో ఊరట
  • జిఎస్టీలో పలు వస్తువుల ధరలు తగ్గుదల

న్యూఢిల్లీ,జనవరి1 : కొత్త ఏడాదిలో ఇంధన ధరలు మరింత దిగి రావడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గణనీయంగా పెరి గిన ధరలు మెల్లగా దిగొస్తున్నాయి. అంత ర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుం డటంతో గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలిరోజున కూడా ఇంధన ధరలు మరికాస్త తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 19 పైసలు తగ్గి రూ. 68.65గా ఉంది. లీటర్‌ డీజిల్‌ ధర కూడా 20 పైసలు తగ్గి 62.66గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 74.30, కోల్‌కతాలో రూ. 70.78, చెన్నైలో రూ. 71.23, హైదరాబాద్‌లో రూ. 72.82గా ఉంది. ఇక డీజిల్‌ ధర ముంబయిలో లీటర్‌కు రూ. 65.56, కోల్‌కతాలో రూ. 64.42, చెన్నైలో రూ. 66.15, హైదరాబాద్‌లో రూ. 68.11గా ఉంది. రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో గతేడాది ఆగస్టు-సెప్టెంబరు కాలంలో చుక్కలను తాకిన ఇంధన ధరలు.. ఆ తర్వాత అక్టోబరు 18 నుంచి తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఏడాది కనిష్ఠానికి పడిపోయాయి.

తగ్గిన పలు వస్తువుల ధరలు

జిఎస్టీ మండలి నిర్ణయంతో సగటు వినియోగదారుడికి ప్రభుత్వం అందిస్తున్న కొత్త సంవత్సరం కానుకగా. జనవరి 1 నుంచి 23 వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వస్తుసేవల పన్ను తగ్గడమే ఇందుకు కారణం. డిసెంబర్‌ 22న జీఎస్‌టీ పాలక మండలి 23 వస్తువులు, సేవలకు పన్నును తగ్గించింది. సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌ బ్యాంకులు, భద్రపరిచిన, శీతలీకరించిన ఆహారం ధరలు దిగివస్తాయి. సిమెంటు, భారీ తెరలు, ఏసీలు, డిష్‌ వాషర్ల వంటి విలాస వస్తువులను మినహాయించి చాలా వస్తువులను ప్రభుత్వం 28 శాతం నుంచి తక్కువ పన్ను రేట్ల పరిధిలోకి తీసుకొచ్చింది. పుల్లీస్‌, ట్రాన్స్‌మిషన్‌ షాప్టులు, క్రాంక్స్‌, గేర్‌ బాక్సులు, రీట్రేడెడ్‌, వినియోగించిన టైర్లు, లీథియం పవర్‌ బ్యాంకులు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో కెమెరాలు, వీడియో గేమ్‌ కన్సోళ్లను 28 శాతం నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. వాహనాలపై థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై పన్నురేటును 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. మార్బుల్‌ రబుల్‌, సహజ సిద్ధ కార్క్‌, ఊతకర్ర, ్గ//-లయాష్‌ ఇటుకలపై 5 శాతం జీఎస్టీ విధించారు. సంగీత పుస్తకాలు, కూరగాయాలు (ఆవిరిలో లేదా నీటిలో ఉడికించినవి), శీతలీకరించిన, కంటెయినర్లలో నింపిన ఆహారాన్ని జీఎస్టీ నుంచి మినహాయించారు. సాధారణ సేవింగ్స్‌ ఖాతాలు, జన్‌ధన్‌ యోజన ఖాతాలపై సేవలకు జీఎస్టీ లేదు. రూ.100 వరకు ఉండే సినిమా టికెట్లపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి, రూ.100కు పైగా ఉండే సినిమా టికెట్ల ధరను 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. మానిటర్లు, టీవీ తెరలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy