Take a fresh look at your lifestyle.

ఢిల్లీ, యూపి, కర్నాటకలో ఆగని పౌర ఆందోళనలు 144 సెక్షన్‌ ‌విధింపు

జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపడుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతుండడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌తోపాటు పలు రాష్టాల్లో్ర సెక్షన్‌ 144‌ను విధించారు. నిరసనల నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ ‌సేవలు నిలిపివేశారు. ఇక, కర్నాటకలోని పలు ప్రాంతాల్లోనూ మూడు రోజులపాటు సెక్షన్‌ 144‌ను విధించారు. అయితే, నిషేధం ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆందోళనకారులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రవాణా ఆంక్షలు విధించడంతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్‌ ‌జామైంది. జామియా మిలియా ఇస్లామియా, జసోలా విహార్‌ ‌షాహీన్‌ ‌భాగ్‌, ‌మునిర్‌కా, లాల్‌ ‌క్విలా, జామా మసీద్‌, ‌చాందినీ చౌక్‌ ‌విశ్వవిద్యాలయ స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఆందోళనల దృష్ట్యా దిల్లీ వ్యాప్తంగా 17 మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ ‌గేట్లను మూసివేశారు. ఆయా స్టేషన్లో మెట్రో రైళ్లు ఆగవని అధికారులు వెల్లడించారు. అయితే ఇంటర్‌ఛేంజ్‌ ‌సదుపాయం మాత్రం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఆందోళనల కోసం పక్క రాష్టాల్ర నుంచి ప్రజలను దిల్లీకి తీసుకొస్తున్నట్లు సమాచారం రావడంతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. దిల్లీ సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. దిల్లీ-గురుగ్రామ్‌ ‌హైవేపై పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు భారీగా స్తంభించి పోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఎర్రకోట, మండి హౌజ్‌ ‌ప్రాంతంలో 144 సెక్షన్‌ ‌విధించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy