వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఢిల్లీ యూనివర్సిటీ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

September 22, 2019

ఢిల్లీ యూనివర్సిటీ లోని తెలుగు విద్యార్థులు బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఐక్యత తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 300 మందికి పైగా ఢిల్లీ యూనివర్సిటీ లో చదువుతున్న తెలుగు విద్యార్ధిని విద్యార్ధుల ఉత్సాహంగా ఆట పాటలతో సందడి చేశారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, తెలుగు వంటకాలు పులిహోర, దద్దోజనం, సత్తు పిండిని సైతం అందించడం పట్ల తెలంగాణ లొనే పండుగ జరుపుకున్నట్లు ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఐక్యత అధ్యక్షురాలు ఈ.వి.సాత్విక, ట్రెజరర్ యోగేశ్ కుమార్ పూడి, నార్త్ వైస్ ప్రెసిడెంట్ జి. నూతన్ కిరన్ రాజ్, సౌత్ వైస్ ప్రెసిడెంట్ నిశ్రీత, జనరల్ సెక్రెటరీ సహెలా, జాయింట్ సెక్రటరీ కార్తిక్, కల్చరల్ సెక్రటరీ రామచంద్ర, విద్యార్థిని విద్యార్థులు పాలుగొన్నారు.

ఇటీవలే ఐక్యత నూతన గవర్నింగ్ బాడీ ఏర్పాటైంది. వీరి ఆధ్వర్యంలో ఇదే మొదటి వేడుక