Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో ప్రతి ఒక్కరికీ కొరోనా టెస్టులు..

  • అఖిలపక్ష భేటీలో కేంద్రమంత్రి అమిత్‌షా
  • టెస్టులు పెంచాలన్న విపక్షనేతలు

ఢిల్లీలో అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర •ంమంత్రి అమిత్‌షా చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితిపై సోమవారం అమిత్‌షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఢిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ అనిల్‌ ‌బైజాల్‌తోపాటు ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌, ‌బీజేపీ, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా పార్టీలు తమ ఎజెండాలను పక్కనపెట్టి మరీ కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్‌ ‌చేశాయి. కాగా, సమావేశం ప్రారంభం కాగానే ఢిల్లీలో కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్రం అమలు చేస్తున్న చర్యలను అమిత్‌షా అఖిలపక్షం ముందు పెట్టారు. కరోనా పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంలో అన్ని పార్టీలూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనని కాంగ్రెస్‌ ‌పార్టీ గట్టిగా డిమాండ్‌ ‌చేసింది. అంతేకాకుండా, కరోనా బారినపడ్డ కుటుంబాలకు, కంటైన్మెంట్‌ ‌జోన్లలో ఉన్న కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సహాయం అందించాలని కేంద్రాన్ని కోరింది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ముప్పు క్రమంగా తీవ్రమవుతుండంతో కేంద్ర •ం మంత్రి అమిత్‌ ‌షా దృష్టిసారించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆదివారం కేంద్ర •ం మంత్రి హర్షవర్ధన్‌, ‌ఢిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ అనిల్‌ ‌బైజల్‌, ‌సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌తో సమావేశమయ్యారు.ఈ సమావేశానికి అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ ‌సింగ్‌, ‌ఢిల్లీ కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు అనిల్‌ ‌కుమార్‌ ‌చౌదురి, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ఢిల్లీలో కరోనా నిర్దారణ పరీక్షలను రెండు రోజుల్లో రెట్టింపు చేయాలని, కంటెయిన్‌మెంట్‌ ‌జోన్లలోని ప్రతి పోలింగ్‌ ‌స్టేషన్‌లో కొద్దిరోజుల్లో కరోనా పరీక్షలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కరోనా రోగులకు చికిత్స అందించడానికి తక్షణమే 500 రైలు బోగీలను డిల్లీ ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించారు. కంటెయిన్‌మెంట్‌ ‌జోన్లలో కాంటాక్ట్ ‌మ్యాపింగ్‌ ‌చేపట్టడానికి వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రతి వ్యక్తి ఆరోగ్యం గురించి సర్వే చేయనున్నారు. ఇదిలావుంటే సోమవారం మధ్యాహ్నం కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని అమిత్‌ ‌షా పరిశీలించారు. ఆ ఆస్పత్రి డాక్టర్లతో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర •ంమంత్రి సక్ష నిర్వహించారు.

Leave a Reply