వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఢిల్లీలోనూ మన సర్కారే ఉండాలి

April 2, 2019

బోధన్‌ ‌ప్రచార సభలో తెరాస ఎంపీ అభ్యర్థి కవిత
రాష్ట్రంలో మనం అనుకున్న అభివృద్ధి జరగాలంటే ఢిల్లీ గద్దెపైనా మన సర్కారే ఉండాలి, మన గులాబీ జెండా ఎగరాలని నిజామాబాద్‌ ‌టీఆర్‌ఎస్‌ ఎం‌పీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఆమె బోధన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మన కేసీఆర్‌కు ఉందని, ఇప్పుడు 16ఎంపీలు గెలిస్తే.. ఢిల్లీలో మనసత్తాను మరోసారి చూపించేందుకు కేసీఆర్‌ ‌సిద్ధంగా ఉన్నారని కవిత అన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా.. ఢిల్లీలో అయినా, గల్లీలో అయినా ప్రజల కోసం పని చేసే పార్టీ తెరాస అని అన్నారు. గత ఐదేళ్లలో పార్లమెంట్‌లో అన్ని సమస్యలపై మాట్లాడానని, నాశక్తి వంచన లేకుండా ఢిల్లీలో పని చేశానని అన్నారు. మన ఊరు – మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో పర్యటించానని, ఈ సందర్భంగా వచ్చిన వినతులను స్వీకరించి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్యలను పరిష్కరించానని కవిత తెలిపారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కనబడటం లేదని, కాంగ్రెస్‌, ‌బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ ‌చేసుకున్నాని కవిత విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జెండా ఎత్తేసి.. మా కార్యకర్తలంతా.. బీజేపీకే ఓటేస్తారని చెబుతున్నట్లు తెలిసిందని, కొన్ని గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు కలిసి తిరుగుతున్నారని కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ •దా ఇవ్వలేదని, పోలవరానికి జాతీయ •దా ఇచ్చి రూ. 7వేల కోట్లు ఇచ్చారన్నారు. మనం 16ఎంపీ స్థానాలు గెలిస్తే పలు ప్రాజెక్టులకు జాతీయ •దా సాధించుకోవచ్చు అని ఆమె తెలిపారు. బోధన్‌ ‌మండలం 42 గ్రామాలతో ఉన్న అతి పెద్ద మండలమని, ఎన్నికల తర్వాత బోధన్‌ ‌మండల విభజన పక్రియ ప్రారంభమవుతుందని కవిత తెలిపారు. ఈ మండలంలోని అన్ని గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తామని కవిత హా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మంజీరా నది, పసుపు వాగు 365 రోజులు జలకళ సంతరించుకుంటుందని, నీళ్లు ఉంటే రైతులే కాదు.. ఊరు ఊరంతా బాగుంటుందన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఈ ప్రభుత్వం.. ఇక్కడి చెరుకు ఫ్యాక్టరీని తెరిపించేందుకు కూడా కృషి చేస్తోందని తెలిపారు. బోధన్‌ ‌షుగర్‌ ‌ఫ్యాక్టరీకి మంచి రోజులు రాబోతున్నాయని, డ్వాక్రా గ్రూపుల వారికి లోన్లు వస్తున్నాయని తెలిపారు. రైతులు పండించిన పంటను డ్వాక్రా గ్రూపు మహిళలు కొనాలని, ఆ తర్వాత వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మాలని, తద్వారా రైతులకు మద్దతు ధర వస్తుందని కవిత అన్నారు. కల్తీ లేని వస్తువులను అమ్మడం ద్వారా.. ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు