Take a fresh look at your lifestyle.

డా।। ప్రియాంక హత్యకేసు .. నలుగురు నిందితుల అరెస్టు.

  • లారీ డ్రైవర్‌, ‌క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు
  • అత్యాచారం చేసి హతమార్చినట్లు నిర్ధారణ
  • దర్యాప్తు మరింత వేగవంతం చేసిన పోలీసులు  – ఘటనపై దిగ్భ్రాతి వ్యక్తంచేసిన మంత్రి కేటీఆర్‌
  • ‌ప్రియాంక కేసును స్వయంగా పర్యవేక్షిస్తానని వెల్లడి – మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సబిత
ఫోటో‌: ప్రియాంక రెడ్డి హత్యకేసులో నిందితులు.. పాషా, నవీన్‌, ‌కేశవులు, శివ

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ‌లో సంచలనం సృష్టించిన వెటర్నిటీ డాక్టర్‌ ‌ప్రియాంకరెడ్డి హత్య కేసును సైబరాబాద్‌ ‌పోలీసులు చేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో లారీ డ్రైవర్‌, ‌క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. నిందితులు మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి, అనంతరం జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కాగా వీరిని విచారిస్తున్న పోలీసులు మరిన్ని విషయాలు రాబట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే అందరూ అనుమానించినట్టే… ప్రియాంక విషయంలో అత్యంత దారుణం జరిగినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. హత్యకు ముందు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. చీకటి పడటం, ప్రియాంకరెడ్డి ఒంటరిగా ఉండటం, నిర్మానుష్య ప్రదేశం కావడంతో మానవ మృగాలు కిరాతకంగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి హత్య చేసినట్లు ఖాకీలు నిర్దారించారు. నిందితులంతా ప్రియాంకరెడ్డి స్కూటీని పంక్చర్‌ ‌చేసి డ్రామాలు ఆడారని, తామే పంక్చర్‌ ‌వేయిస్తామని చెప్పి.. ఆమె మాటల్లో పెట్టి కిడ్నాప్‌ ‌చేశారని, ఆ తర్వాత ఆమెను రేప్‌ ‌చేసి చంపేశారని పోలీసులు గుర్తించారు. చంపేసిన తర్వాత తమపై అనుమానం రాకుండా ఉండేందుకు.. ప్రియాంక శవాన్ని దూరంగా తీసుకెళ్లి తగులబెట్టారని, అయితే.. బాడీని తీసుకువెళ్లేటప్పుడు అందరికి అనుమానం కలుగుతుందని అనుమానం వచ్చిన లారీ డ్రైవర్లు.. దుప్పటి అడ్డంగా చుట్టారని, కల్వర్టు దగ్గరకు ప్రియాంకరెడ్డి డెడ్‌బాడీని తీసుకువెళ్లిన తర్వాత.. దుప్పటితో సహాకాల్చి చంపారని పోలీసులు నిర్దారించారు. ప్రియాంక మృతదేహాం 70శాతం కాలిపోయిందని పోలీసులు తెలిపారు.

కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సబితా..
శంషాబాద్‌ ‌ప్రాంతంలో దారుణహత్యకు గురైన ప్రియాంకరెడ్డి  కుటుంబ సభ్యులను తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి తల్లి, చెల్లిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పుచేసిన వాళ్లకి కఠినంగా శిక్షపడేలా చేస్తామని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటుందని, రాబోయే కాలంలో భద్రతను మరింత పటిష్ఠం చేసి ఆడవారికి అండగా ఉంటామని అన్నారు. ఇదిలా ఉంటే ప్రియాంకరెడ్డి కుటుంబాన్ని మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌రోనాల్డ్‌రాస్‌  ‌పరామర్శించారు. హైదరాబాద్‌లోని మృతురాలి నివాసానికి వెళ్లిన కలెక్టర్‌ ‌కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రియాంకరెడ్డి తండ్రిని ఓదార్చారు. ప్రియాంకరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హా ఇచ్చారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని, వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌రొనాల్డ్ ‌రోస్‌ ‌పేర్కొన్నారు.

ప్రియాంక కేసును నేనే పర్యవేక్షిస్తా – కేటీఆర్‌
‌శంషాబాద్‌లో పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి దారుణ హత్య ఘటనపై మంత్రి కేటీఆర్‌ ‌స్పందించారు. మృతిపై తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లను పోలీసులు పట్టుకుంటారన్న విశ్వాసముందని చెప్పారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుందని హా ఇచ్చారు. ఈ కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే డయల్‌ 100‌కి ఫోన్‌ ‌చేయాలని సూచించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy