Take a fresh look at your lifestyle.

ట్యాంక్‌బండ్‌ ‌రణరంగం

పోలీసుల లాఠీ ఛార్జీ..కార్మికుల రాళ్లదాడి…
కదం తొక్కిన ఆర్టీసి కార్మికులు – ఉద్రిక్తతల నడుమ చలో ట్యాంక్‌ ‌బండ్‌.
‌మూడంచెల భద్రతను దాటుకుని ట్యాంక్‌ ‌బండ్‌ ‌చేరిన కార్మికులు – ముందస్తుగా పలు జిల్లాల్లో నాయకుల అరెస్టులు – రంగంలోకి దిగిన ర్యాపిడ్‌ ‌యాక్షన్‌ ‌ఫోర్స్
ఛలో ట్యాంక్‌ ‌బండ్‌ ఆం‌దోళనలో పాల్గొనేందుకు ఆర్టీసి కార్మికులు పెద్ద సంఖ్యలో కదంతొక్కారు. మిలియన్‌ ‌మార్చ్ ‌నేపథ్యంలో ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బారీకేడ్లను తోసుకుని ఆర్టీసి కార్మికులు, విపక్ష నేతలు, విద్యార్థి సంఘాల నేతలు దూసుకెళ్లారు. బ్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు దూసుకెళ్లిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఒక లాఠీచార్జీ చేయగా పోలీసులపై నిరసనకారులు రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు భాష వాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ముళ్లకంచెను సైతం దాటుకుని ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపుకు పరుగులు పెట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. ఈ క్రమంలోనే పలువురు కార్మికులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు వారి లాఠీలకు పనిచెప్పారు. ఆర్టీసి సమ్మెలో భాగంగా కార్మికులు పిలుపునిచ్చిన ఛలో ట్యాంక్‌ ‌బండ్‌ ‌కార్యక్రమాన్ని అణచివేసేందుకు అటు ప్రభుత్వం ఇటు పోలీసులు శనివారం ఉదయం 5గంటల నుండే పెద్ద ఎతున పోలీసు బలగాలను రోడ్లపై మోహరించాయి. ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపుకు వెళ్లే అని రోడ్లలో బారికేడ్లు, ముళ్లకంచెను ఏర్పాటు చేసి భద్రతను కటుదిట్టం చేశారు. దీంతో ఉదయం వేళలో స్కూళ్లు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందిపడారు. ఛలో ట్యాంక్‌ ‌బండ్‌కు వివిధ జిల్లాలు నుండి శుక్రవారం సాయంత్రం నుండి బయలుదేరిన ఆర్టీసీ కార్మికులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేసి రాత్రంగా పోలీస్‌ ‌స్టేషన్లలోనే నిర్బంధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసి కార్మికులు ట్యాంక్‌బండ్‌కు చేరకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్క పాయింట్‌ ‌వద్ద ఒక స్థాయి అధికారి, ముగ్గురు ఎస్సైలు, పదుల సంఖ్యల కానిస్టేబుళ్లన్లను మోహరించారు. ఈ క్రమంలోనే పోలీసులు కార్మికులను అడ్డుకోగా, పలువురు పోలీసుల వారిపైకి కర్రలు రువ్వారు. దీంతో పిడియు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ ‌తలకు బలంగా గాయం అవ్వడంతో హుటాహుటినా దవాఖానాకు తరలించారు. ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగారావు, రమతో పాటు మరికొంత మందిని అరెస్టు చేసి
పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కు తరలించారు. శాంతియుతంగా ఆర్టీసి కార్మికుల పక్షాన నిలబడి నిరసన తెలియజేస్తుంటే అరెస్టులు చేయడం సరికాదని, ప్రభుత్వం ఆర్టీసి కార్మికుల కడుపు మీద కొడుతుందని రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరాపార్కు వద్ద ఉద్రిక్తత…ఆర్టీసి కార్మికులు ఛలో ట్యాంక్‌ ‌బండ్‌ ‌కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన తెలంగాణ జనసమితి, సిపిఐ(యంఎల్‌), ‌డిఎయూ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌, ‌సిపిఐ(యంఎల్‌) ‌కార్యవర్గ సభ్యులు గోవర్దన్‌, అచ్యుతరామారావులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌, ఐఎఫ్‌ ‌టియు రాష్ట్ర సహాయకార దర్శి అనురాధ, ఐఎన్‌టియు రాష్ట్ర కార్యదర్శి యం. శ్రీనివాస్‌, ‌న్యూడెమక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పరశురాం, పిఓడబ్ల్యూ సరళలతో పాటు పలువురిని అరెస్టు చేసి గాంధీనగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు.
పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్‌.
ఛలో ట్యాంక్‌ ‌బండ్‌ ‌నేపథ్యంలో శనివారం ఉదయం నుండే ట్యాంక్‌ ‌బండ్‌ ‌పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. దీంతో అటువైపుగా వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్‌, ‌కవాడిగూడ, లిబర్టీ, సెక్రటేరియట్‌ ‌వైపు నుండి ట్యాంక్‌బండ్‌ ‌వైపు వచ్చే వాహనాలను అనుమతించలేదు. అదే విధంగా దోమలగూడ నుండి లిబర్టీ వైపునకు, ఇందిరాపార్కు నుండి లోయర్‌ ‌ట్యాంక్బండ్‌కు వెళ్లే దారుల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బషీర్‌బాగ్‌ ‌నుండి ట్యాంక్‌ ‌బండ్‌, ‌హిమాయతనగర్‌ ‌నుండి ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపు వచ్చే వాహనాలను, ప్రజలను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడే నిలిచిపోయింది. కిలోమీటర్‌ ‌ప్రయాణానికి గంటల తరబడి సమయం ట్రాఫిక్‌ ‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy